నీ బాధ తెలుసు.. భావార్ధం తెలుసు..
ప్రేమ తెలుసు.. దాని పరమార్ధం తెలుసు..
నాకన్నీ తెలుసన్న విషయం, నీకూ తెలుసు..
నీలో నేనై గడిపానన్న విషయం, నాకూ తెలుసు..
అయినా నా మౌనం వెనుక వేదన నాకే తెలుసు..
నా మాటల మాటున దాగిన ప్రేమ నాకే తెలుసు..
నా గతం నీ భవితకు హామీ ఇవ్వలేకుంది..
నా ప్రస్థానం కాస్తయినా విరామం ఇవ్వలేనంది..
ఇప్పుడు తెలుస్తోంది..
నేనెంత పరాజితున్నో ..
నిన్ను పొందలేక నలిగిపోతున్న విరహ మోహితున్నో..
*********************************
written by BODDU MAHENDER
at 10:26am 7.11.2013



















