Showing posts with label శుభాకాంక్షల కవితలు ... Show all posts
Showing posts with label శుభాకాంక్షల కవితలు ... Show all posts
Sunday, 30 March 2014
అందుకే మరి ఉగాది...
వసంతం మొదలుగ ఆరు ఋతువులు..
వగరు మొదలుగ ఆరు రుచులు..
వ్యక్తి జీవనగమనంలో పరిణామాలకి సూచికలుగా..
వ్యక్తి జీవితవికాసంలో ప్రమాణాలకి తూనికలుగా..
అందుకే మరి ఉగాది...
ప్రకృతితో మమేకమైన ఓ కాలగణన
ప్రకృతితో పోల్చదగిన మన జీవిత సాధన
********************************
written by BODDU MAHENDER
at 4:45am 31.3.2014
వగరు మొదలుగ ఆరు రుచులు..
వ్యక్తి జీవనగమనంలో పరిణామాలకి సూచికలుగా..
వ్యక్తి జీవితవికాసంలో ప్రమాణాలకి తూనికలుగా..
అందుకే మరి ఉగాది...
ప్రకృతితో మమేకమైన ఓ కాలగణన
ప్రకృతితో పోల్చదగిన మన జీవిత సాధన
********************************
written by BODDU MAHENDER
at 4:45am 31.3.2014
అందరికీ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు..
Sunday, 16 March 2014
Monday, 17 February 2014
Monday, 13 January 2014
Tuesday, 31 December 2013
ఈ నేస్తం నీకు స్వాగతం పలుకుతోంది
ఎన్నో ఆశ్చర్యాలు,.., మరెన్నో ఆహ్లాదాలు..
అపజయాల అవరోధాలు దాటిన నీకు.... !!
******
ఆవేదనల నివేదనలు ఇక చెల్లవు
అనుమానాలు, అవమానాలు ఇక ఉండవు
కాలం పరిచిన రాచబాటలో
కమనీయ పర్వాల పూలబాటలో
ఈ నేస్తం నీకు స్వాగతం పలుకుతోంది
సమస్తం నీదేనని ఊరిస్తోంది ..
రా.. మరి .. సంతోషాల నిధికే పెట్టు గురి..
*******************************
written by BODDU MAHENDER
at 9:11am, 1.1.2014
నూతన సంవత్సర శుభాకాంక్షలు
Sunday, 13 October 2013
ఆ గెలుపు ఎప్పుడూ మంచిని పెంచడానికే..
పురాణాలు ఏవైనా.. కారణాలు ఎన్నున్నా..
అంతిమంగా నిలిచేది న్యాయం.. గెలిచేది ధర్మం..
అయోధ్య రాముడైనా.. ఆది పరాశక్తి అయినా..
ఆ గెలుపు ఎప్పుడూ
మంచిని పెంచడానికే.. మదాన్ని తుంచడానికే..
మనిషిగా నిను ఎంచడానికే..
మానవత్వం గుర్తించడానికే..
ఈ మూలం ఎప్పుడూ మరువబోకు..
నీ ఆనవాలం విడువకబోకు..
*********************************
written by BODDU MAHENDER
at 1:22pm, 13.10.2013
అందరికీ దసరా పర్వదిన శుభాకాంక్షలు..
Saturday, 12 October 2013
చల్లంగ మము కాచవే బతుకమ్మా..
ఏ యేటికాయేడు ఎదురు చూస్తుంటాం
తంగేడు పువ్వుల్లో నిన్ను చూస్తుంటాం
మా యిల వేల్పే, నువ్వని బతుకమ్మ
ముస్తాబు చేసి, మురిసిపోతుంటాం
చల్లంగ మము కాచవే బతుకమ్మా..
చక్రాంకుడ పత్ని వే బతుకమ్మా
సత్తు ముద్దల తోడనే బతుకమ్మా
సర్వ సౌఖ్యము లీయవే బతుకమ్మా
*****************************
written by BODDU MAHENDER
at 6:04pm, 12.10.2013
బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు
Monday, 9 September 2013
జయహో జయహో హరికృష్ణ
అనామకమై పోతున్న తెలుగుని
అందలాన ఎక్కిస్తావు..
ఆత్మీయతని చూపిస్తావు.. ఆలోచనని పెంచేస్తావు..
అణగారిన ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని
అఖిలావనికి చాటేస్తావు.
జయహో జయహో హరికృష్ణ
జయము కలిగించేదేలే నీ తృష్ణ
****************************
written by BODDU MAHENDER
at 9:30 am, 10.9.2013
తెలుగు రక్షణ వేదిక అధ్యక్షుడు శ్రీ పొట్లూరి హరికృష్ణ గారికి
జన్మదిన శుభాకాంక్షలు..
Wednesday, 4 September 2013
ఈ ప్రశ్నలకి సమాధానమే గురువు.
ఏదో తెలుసుకోవాలి, మరేదో కనుగొనాలి..
అది జీవ రహస్యమైనా, సృష్టి రహస్యమైనా..
సమస్య మూలాల్ని అన్వేషించాలి..
సార్ధక జీవితం అనిపించుకోవాలి..
ప్రాపంచిక జ్ఞానాన్ని , ఆధ్యాత్మిక పరిజ్ఞానాన్ని
ప్రముఖంగా పదిలపరుచుకోవాలి.
కానీ ఎలా..?
ఎవరు ఉపదేశమిస్తారు..?
ఏ విధంగా కార్యోన్ముఖున్ని చేస్తారు ..?
ఈ ప్రశ్నలకి సమాధానమే గురువు.
నిన్ను జ్ఞానో న్న తుడిగా మార్చే కల్పతరువు.
నల్లబల్లపై తెల్లని సుద్ద గీతలులాగానే
నీలో అజ్ఞాన అంధకారాన్ని చీలుస్తూ
వెలుగు రేఖలు ప్రసరింపజేసే ఆదరువు.
****************************
written by BODDU MAHENDER
at 2:39am 5.9.2013
ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు
ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు
Sunday, 1 September 2013
సమాజ స్పృహ గల కథానాయకుడతను.
తన
చూపు సమ్మోహనం
మాట మన్మోహనం
నటన నవనూతనం
నడత సమజీవనం
అవును...
భయం లేదు...అసలే,
బాధ్యత గల నాయకుడతను.
స్వార్ధం లేదు...నిజమే,
సమాజ స్పృహ గల కథానాయకుడతను.
ఒక్కమాటలో చెప్పాలంటే
ట్రెండ్స్ కే ట్రెండ్ సెట్ చేస్తాడు .
కామన్ మ్యాన్ కి బ్రాండ్ గా అగుపిస్తాడు.
*****************************
written by BODDU MAHENDER
at 11:01pm 1.9.2013
జన్మదిన శుభాకాంక్షలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి.
Wednesday, 28 August 2013
సప్తపదితో సాగే సహజీవనం
నీ మనసు గెలిచిన మగువ
ముంగిట్లో వధువై నిలువగా
నీ ఊహల నిలిచిన మరుడు
పందిట్లో వరుడై చేరువగా
జరిగే ఈ సంరంభం
కొత్త జీవితానికి ఆరంభం
నూరేళ్ళ కలలని
అక్షింతలుగా పోసుకొని
నిండైన ప్రేమలని
మంత్రాలుగా చదువుకొని
సప్తపదితో సాగే మీ సహజీవనం
సర్వకాల సర్వావస్థలలో
కావాలి సుఖజీవనం
*****************************
written by BODDU MAHENDER
at 1:28pm 28.8.2013
మిత్రురాలు ధనలక్ష్మీ బూర్లగడ్డ కి ఆత్మీయ శుభాకాంక్షలు తెలియజేస్తూ
Tuesday, 20 August 2013
తోడ్పాటుకి చిహ్నమై ..
ఒకరికి భరోసా నిస్తూ,
మరొకరికి బాధ్యతని గుర్తు చేస్తూ
తోబుట్టువుల మధ్యన ఉండే
తోడ్పాటుకి చిహ్నమై నిలుస్తూ
అండ నిచ్చే వాడి చేతికి
కైదండగా మారింది ఈ రాఖీ.
అభయ హస్తం కోరే పడతికి
అండదండగా నిలిచింది ఈ రాఖీ.
**************************
written by BODDU MAHENDER
at 1:54am 21.8.2013
సోదర సోదరీమణులకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు.
Friday, 19 April 2013
Thursday, 11 April 2013
Wednesday, 27 March 2013
Saturday, 2 March 2013
Wednesday, 20 February 2013
Wednesday, 13 February 2013
Subscribe to:
Posts (Atom)



















