Showing posts with label కీటకాలపై కవితలు. Show all posts
Showing posts with label కీటకాలపై కవితలు. Show all posts

Sunday, 20 October 2013

కావ్.. కావ్.. కావ్..


కావ్.. కావ్.. కావ్.. విని, కాకిగోల అంటాం గానీ,
కాకేగా మనకి కథల్ని నేర్పింది.. కర్తవ్యాన్ని చూపింది..
ఆ కాకేగా శనికి వాహనమైంది.. యమునిచే ఆవాహనమైంది..
చుట్టాలొస్తున్నారని కబురు తెస్తుంది.. చుట్టమై వచ్చానని కాటికి వస్తుంది..
కలిసి ఉండమని సందేశమిస్తుంది..కలహంస అవమని సంబోధ చేస్తుంది..
అలాంటి కాకి మరి ఇపుడు గతమై, ఒక జ్ఞాపకమైపోతోంది..
హతమై ప్రకృతిలో శిలాజమైపోతోంది.. 
************************************
written by BODDU MAHENDER
at 10:32pm, 20.10.2013

Friday, 28 September 2012

ఓ మిణుగురు ముందు నిలిచింది..


నిశి రాతిరి మేలుకొంది..
నిర్దయగా కమ్ముకొంది..
నిరాశని పెంచింది..
నిక్కి నీలిగి మురిసింది..

నా ఆలోచన మెరిసింది..
కొత్త కాంతి విరిసింది..
ఊహలన్నిటికి ఊతమిస్తూ..
ఓ మిణుగురు ముందు నిలిచింది..

గొప్ప సూక్తి తెలిపింది..
చిన్న చూపు వద్దంది..
ప్రయత్నమంటూ చేపడితే..
ప్రతి గెలుపూ నీదంది..
*******************
written by BODDU MAHENDER
at 9:30pm 28.9.2012

Thursday, 23 August 2012

ఉడుతని మరిపించే మిడతనే..నేనని


ఆకులో ఆకునై .
అవనిపై ఓ జీవినై
మాయ చేసి మేను దాచ,
ఓ కొమ్మకొనలో వర్ణమై.. నేను వాలిపోనా..
ఈ కొండకోనలో ఓ సొగసై, మురిపెంగా అల్లుకోనా..
ఆరుకాళ్ళతో అంగలేస్తూ,
నాల్గు రెక్కలతో గంతులేస్తూ..
ఉడుతని మరిపించే మిడతనే..నేనని పొంగిపోనా..
మీ అందరికీ ఓ వింతలా మిగిలిపోనా....

ఆకలేస్తే పంట చేను,
ఆపదొస్తే వైరి మేను
నా దాడికి నిలవలేక...నలిగిపోయే నరజాతి..
నా సోగుసుని ఓర్వలేక...కుమిలిపోయే కీటక జాతి 
నా గొప్పలిన్ననీ ఇంకా చెప్పుకోనా..
మీ తిప్పలన్నీ చూసి నాలో నేనే నవ్వుకోనా..
****************************
written by ME
at 12:15pm 24.8.2012

బొద్దింక వద్దింకా అని మీరన్నా..


నిశాచరినే..సర్వ భక్షకినే..
కీటకాన్నే..కీడెంచే దాన్నే..
మూషికానికి భయపడుతా..
మూలగూట్లో తిరుగాడుతా..
వంటల్లో పడిపోయి..
వాంతులనే మీకు తెప్పిస్తా..
జోకుల్లో చేరిపోయి..
నవ్వులనే మీకు రప్పిస్తా..
చికాకు తెచ్చినా..
మీ చదువులకి పనికొస్తా..
నను చంపే మందులోళ్ళకి
సిరుల వాన కురిపిస్తా..
బొద్దింక వద్దింకా అని మీరన్నా..
ఈ పొద్దింకా నా సోది చెప్పక మాననింకా ..
*************************
written by BODDU MAHENDER
at 9:50pm 23.8.2012

Wednesday, 22 August 2012

దోమ దోమ అంటూ


మగ దోమ మా మంచి దోమ 
మకరందాలతోనే మహాదానందపడే దోమ
ఆడ దోమ అసురతనాల దోమ 
మానవ రక్తాలతోనే మత్తెక్కి పోయే దోమ 

అంతేనా..
మలేరియా కి వాహకం ఈ దోమ 
చికెన్ గున్యా కి కీలకం ఈ దోమ 
వైరస్ లకి పోషకం ఈ దోమ
వ్యాదులకి ప్రాపకం ఈ దోమ

అందుకే 
దోమ దోమ అంటూ 
దొరకబెట్టి చంపినా
దోమ ఖర్మ ఏంటంటూ
దోమ బిళ్ళ పెట్టినా..
దోమ తెరల్ని చీల్చే 
దొరసాని ఈ దోమ 
మనిషి రక్తాల్ని పీల్చే 
మహారాణి ఈ దోమ 
ఇక తప్పక , మనసొప్పక 
దోమ దోమ అంటూ 
దోమలన్నీ గోప్పవంటూ 
దోమ దండకాలు రాసి 
దోమల దినోత్సవాలు జరుపుతున్నాం మనం నేడు 
ఇకనైనా వీడాలని ఆశిద్దాం... వీటి కీడు..
*********************************
written by ME 
at 7am 20.8.2007

Friday, 17 August 2012

మరి నేనే నేనే ఆ చీమని..


తలకు మించిన భారమైనా ఎత్తుతా..
తన పర లేకుండా సఖ్యంగా గడుపుతా..
క్రమశిక్షణలో సాటి లేరని చూపుతా..
కలిసికట్టుగా ఒక దారెంట వెళుతా...
అనుకుంటే అబ్బురపరిచే పుట్టలెన్నో కడుతా..
అవసరమైతే ఏ పామునైనా కుట్టి చంపుతా..
శివుడి ఆజ్ఞ అని మీరనుకున్నా..,
నా మనో వాంఛే అని నేనంటా..
మరి నేనే నేనే ఆ చీమని..
ఆ ఈగకి పోటీ వచ్చే మరో హీరోని..
*************************
written by ME
at 5:22pm 3.8.2012

మరి నేనే కానా ఈగ..

ఎగరనా ఎంత ఎత్తువున్నా..
దూరనా లోన దాచివున్నా..
కళ్లుగప్పి దాయడం కుదిరేనా..
తెరలేసి చూపడం సబబేనా..?
నేను అంటుకుంటే వదలనుగా..
అంటువ్యాధులే మీకు కలుగునుగా..
మరి నేనే కానా ఈగ..
మీ ఇంట్లో వేయనా పాగా..
కీటకాలలో నేనూ ఒక తెగ..
కానీ సిన్మాల్లోకి వస్తే హీరోలకీ పెడతా సెగ..
**************************
written by ME
at 10:15pm 2 .8 .2012