Showing posts with label నాన్న ప్రేమ పై కవితలు. Show all posts
Showing posts with label నాన్న ప్రేమ పై కవితలు. Show all posts

Sunday, 17 June 2012

మా నాన్న ...


మా నాన్న...మా మంచి నాన్న
నాకో స్నేహితుడు..మార్గదర్శకుడు..
నిజమైన ప్రేమికుడు..ఆదర్శప్రాయుడు.. 

కష్టనష్టాలలో..నాకు ఇచ్చే తోడ్పాటు
సుఖ దు:ఖాలలో..నా వెంట నిలిచే ఓదార్పు..

భారాలెన్ని మోసినా..
బాధ్యత మరువలేదు... 
బాధలెన్ని ఉన్నా..
మము భుజం దించ లేదు..

లోకమెంత ఉందో తెలీదు గాని..
లోకులు మనసు లోతు తెలిపాడు..
బ్రతికేది ఎంత కాలమైనా..
భరతభూమి ఋణం తీర్చమన్నాడు..
అందుకే..
మా నాన్న ..మా మంచి నాన్న..
మా మదిలో మాధవుడై నిలిచిన నాన్న..
**************************
written by ME
at 10pm 17.6.2012

Thursday, 3 May 2012

నాన్నా..!!


వేలుపెట్టి నడిపించింది..
వెన్నుతట్టి ప్రోత్సహించింది..
లోకమంతా చూపించింది..
లోకజ్ఞానం నేర్పించింది..
అంతా మీరే కదా ..నాన్నా..!!

మీ ఆలనే మాకు రక్షణ ..
మీ లాలనే మాకు శిక్షణ ..

బాధ్యతలని మోస్తూనే..,
బంధాలకి విలువిచ్చారు..
బాధలని భరిస్తూనే..
భుజాలకి మమ్ము ఎత్తారు..
మీ ఎదనే శయన పాన్పు చేసారు..
మీ అరచేతినే పాదరక్ష గా చూపారు..
మా నవ్వుల్లో..మీ అలసట మరిచారు..
మా మాటల్లో..మీ వేదన తుడిచారు..

జన్మనిచ్చింది అమ్మ అయినా
జన్మ సార్థకం చేసింది మీరే కదా..నాన్నా..!!

మీ ఎదుగుదలే ప్రేరణ..
మీ పట్టుదలే ఆలంబన..
మా తొలి స్ఫూర్తి మీరే..
మాకు ఆదర్శ మూర్తి మీరే...
I LOVE YOU.....DAD
**************************
నా అనే స్వార్ధం లేకుండా..
నా అనే ..నిజ బంధమే.. నాన్నా..
**************************
written  by  ME    
at 1:29am 4.5.2012