Thursday, 3 May 2012

నాన్నా..!!


వేలుపెట్టి నడిపించింది..
వెన్నుతట్టి ప్రోత్సహించింది..
లోకమంతా చూపించింది..
లోకజ్ఞానం నేర్పించింది..
అంతా మీరే కదా ..నాన్నా..!!

మీ ఆలనే మాకు రక్షణ ..
మీ లాలనే మాకు శిక్షణ ..

బాధ్యతలని మోస్తూనే..,
బంధాలకి విలువిచ్చారు..
బాధలని భరిస్తూనే..
భుజాలకి మమ్ము ఎత్తారు..
మీ ఎదనే శయన పాన్పు చేసారు..
మీ అరచేతినే పాదరక్ష గా చూపారు..
మా నవ్వుల్లో..మీ అలసట మరిచారు..
మా మాటల్లో..మీ వేదన తుడిచారు..

జన్మనిచ్చింది అమ్మ అయినా
జన్మ సార్థకం చేసింది మీరే కదా..నాన్నా..!!

మీ ఎదుగుదలే ప్రేరణ..
మీ పట్టుదలే ఆలంబన..
మా తొలి స్ఫూర్తి మీరే..
మాకు ఆదర్శ మూర్తి మీరే...
I LOVE YOU.....DAD
**************************
నా అనే స్వార్ధం లేకుండా..
నా అనే ..నిజ బంధమే.. నాన్నా..
**************************
written  by  ME    
at 1:29am 4.5.2012

No comments:

Post a Comment