Showing posts with label ఛాయాగీతం ఫోటో కవితలు. Show all posts
Showing posts with label ఛాయాగీతం ఫోటో కవితలు. Show all posts

Friday, 7 February 2014

ఛాయాగీతం ఫోటో కవితల పోటీ - 229

ఆంధ్రభూమి మాసపత్రిక  2010 సెప్టెంబర్ సంచికలో ప్రచురితమైన నా కవితలు.

ఛాయాగీతం ఫోటో కవితల పోటీ - 226

ఆంధ్రభూమి మాసపత్రిక  2010 జూన్ సంచికలో ప్రచురితమైన నా కవితలు.

ఛాయాగీతం ఫోటో కవితల పోటీ - 225

ఆంధ్రభూమి మాసపత్రిక  2010 మే సంచికలో ప్రచురితమైన నా కవితలు.

ఛాయాగీతం ఫోటో కవితల పోటీ - 224

ఆంధ్రభూమి మాసపత్రిక : ఏప్రిల్- 2010 సంచికలో ప్రచురితమైన నా కవితలు.

ఛాయాగీతం ఫోటో కవితల పోటీ - 221

ఆంధ్రభూమి మాసపత్రిక జనవరి 2010 సంచికలో ప్రచురితమైన నా కవితలు.

Sunday, 18 December 2011

ఛాయా గీతం ఫోటో కవితల పోటీ -226

 

విహంగాలకి రాజును నేను

లోహ విహంగాలకి ప్రేరణ నేను 

అందనంత ఎత్తులో విహరిస్తున్నా 

చిన్న జీవిని సైతం పసిగట్టగలను నేను 

 ఎగరలేనన్న బాధ లేదు నాకు 

బరువున్నానన్న చింత లేదు నాకు 

ఆర్కిటిక్ ఖండాల అందాన్ని  నేను  

అతి చలి లోనూ మన గల జీవిని నేను

 

 

 

జులై  2010 ఆంధ్రభూమి మాస పత్రికలో ఇవి ప్రచురితమైనవి ..

ఛాయా గీతం ఫోటో కవితల పోటీ -225

అలల   ఊయలపై  కదలాడుతూ
ఆనంద  ఝరి  లో  ఓలలాడుతూ
జోరుగా  సాగే  నావ
నా  ఆనందానికి  జత  కావా ..!!

ఆకలైనా దప్పికైనా..
భారమైనా దూరమైనా..
మండే ఎండల్లో కడవెడు నీళ్ళనిస్తా..
కటిక ఎడారుల్లో నడిచే నావనవుతా ...!!

 

 

జూన్  2010 ఆంధ్రభూమి మాస పత్రికలో ఇవి ప్రచురితమైనవి ..

ఛాయా గీతం ఫోటో కవితల పోటీ -224

నిదానమే ప్రధానం,
అన్నది తాబేలు నినాదం..
ప్రతి అడుగు స్వీయ రక్షణలో.,
సాగాలన్నది తన జీవిత విధానం..






వేగం శృతి మించితే,
గమనం గతి తప్పుతుంది..
ఆత్మ రక్షణతో ముందుకు సాగితే 
ఆ గమ్యమే నీ దరి చేరుతుంది..  

 మే  2010 ఆంధ్రభూమి మాస పత్రికలో ఇవి ప్రచురితమైనవి ..

స్ఫూర్తి..

అడ్డంకులు ఎన్ని వున్నా 
అడ్డు కావవి నీ ఆశయానికి 
కదిలే ఆరాటమే నీలో ఉంటే 
కడలి కెరటమే కాదా నీ స్ఫూర్తి..
****************************
written by ME
at 10:15am 12.1.2010

ఛాయా గీతం ఫోటో కవితల పోటీ -222

 నీవెంత దూరం పరుగెత్తినా ..
ఈ తూటా గురి తప్పదు ..
నిన్ను ఈ పూట మట్టుబెట్టనిదే,
నా వేట సరదా తీరదు .. 












 

ఛాయా గీతం ఫోటో కవితల పోటీ -221

మంచు  తీరాన... 
మనోహర ప్రయాణం ..
మనసున మెదిలే ..
టైటానిక్ ప్రమాదం ..









అణువణువునా వెదికినా 
కానరాని కాలుష్యం...
అందరూ చేయి కలిపితే 
ఆవిష్కరించదా..ఈ దృశ్యం...









జనవరి 2010 ఆంధ్రభూమి మాస పత్రికలో ఇవి ప్రచురితమైనవి ..