Showing posts with label వంటలపై కవితలు. Show all posts
Showing posts with label వంటలపై కవితలు. Show all posts

Monday, 22 October 2012

ఆలూ వెజ్ బిర్యానీ..


తినాలని కోరికున్నా..తినలేని వారికోసం..
మాంసాహారమేమో అని ముఖం తిప్పుకునేవారి కోసం ..
బిర్యానీ ఘుమఘుమల్ని , మసాలా మధురిమల్ని మేళవించి..
శాఖాహార భోజనంగా..సర్వ శ్రేష్ట సమ్మిళితంగా..
మన ముందుకు వచ్చింది..ఈ వెజ్ బిర్యానీ..
మన జిహ్వ చాపల్యాన్ని తీర్చింది.. ఆలూ వెజ్ బిర్యానీ..
**********************************
written by BODDU MAHENDER
at 11:06pm 22.10.2012

Saturday, 29 September 2012

గరం గరం దోశ.....


గరం గరం దోశ..
గరం మసాలా దోశ..
ఊరించే దోశ..ఉల్లిపాయ దోశ..
పొట్ట నింపే దోశ.. పొడవైన 70 ఎం.ఎం.దోశ..
కండల్ని పెంచే దోశ.. కరకరల రవ్వ దోశ..

పోషకాలు ఉన్న దోశ..మినపపప్పు దోశ..
పెనం మీద చేసే దోశ..పేపరంత పల్చటి దోశ..
అమ్మాయి ఆశ దోశ..అట్లతద్ది దోశ..
ఆంధ్రుల ఇష్ట తిండి దోశ..అట్టుగా పిలిచే ఈ దోశ..
******************************
written by BODDU MAHENDER
AT 10:05am 30.9.2012

Wednesday, 26 September 2012

అటుకుల ఉప్మా..


ఆహా ఓహో.. అటుకుల ఉప్మా..
దీని సాటి రాదు ఏ రవ్వ ఉప్మా..
చింత చారు వేస్తే కాదా పులిహోర..
చింత లేకుండా మరి తినరా నోరారా..
కన్నడిగుల ఇంట ఇది కవ్వించునంటా..
కలిమిలేములు మరిచి అందరూ భుజించునంటా..
మా అమ్మ చేస్తే మైమరిచిపోతుంటా..
మళ్ళీ మళ్ళీ కొసరి వడ్డించమని తింటా..
**************************
Witten by BODDU MAHENDER
at 10:35am 27.9.2012

Tuesday, 31 July 2012

మొలకలండి మొలకలు....


మొలకలండి మొలకలు
పెసర,శనగల మొలకలు
పోషకాల నిల్వలు..
మాంసకృత్తుల చెలిమెలు

ఉప్పు కారాలు చల్లి ,
ఉల్లి నిమ్మరసాలు వేసి,
ఉడుకు ఉడుకువి పెడితే 
ఉవ్విళ్ళూరుతూ తింటారు..
ఊసులెన్నో చెబుతారు..

నోటి తాళాలు తీసి
జిహ్వ చాపాల్యాలు పెంచి
బొజ్జ పోషణ చేస్తారు..
శక్తి శోషణ అంటారు.. 

మొలకలండి మొలకలు
ఇవి సహజ సిద్ధ సరుకులు.
*******************
written by ME
at 10:25pm31.7.2012

Thursday, 26 July 2012

పెరుగన్నం..


పెరుగూ అన్నం కలిపితే పెరుగన్నం
ఆకలేసి ఆబగా తింటే పరమాన్నం
మినప పప్పు, జీడి పప్పుల తాలింపు
ఓ అద్భుతం..
కొత్తిమీర,దానిమ్మ గింజల మేళవింపు
మహా అమృతం..
అజీర్తిని హరిస్తుంది
అలసటని తొలగిస్తుంది
ఒంటికి చలువ చేసి,
కంటికి కమ్మటి నిద్రనిస్తుంది..
అందుకే ఇదంటే నాకెంతో ఇష్టం  
ఇది లేక పూట గడపడం చాలా కష్టం.
*************************
written by ME
at 12:15pm 26.7.2012

Thursday, 12 July 2012

చికెన్ బిర్యాని


CHICKEN BIRYANI
******************
ఆ పేరు వింటేనే నోరూరిపోతుంది..
ప్లేటు చూస్తేనే కడుపు నిండిపోతుంది..
నాటుకోడితో చేస్తే నవనవలాడుతుంది..
ఘాటు మసాలా వేస్తే ఘుమఘుమలాడుతుంది..
బాస్మతి రైస్ అయితే ఆవురావురు అనిపిస్తుంది..
లెమన్,పుదీనాతో కూడితే చివచివ అనిపిస్తుంది..

విందు అయినా..వినోదమైనా...
ఇది ఉంటేనే కళ వస్తుంది..
ఆతిధ్యానికి అందం తెస్తుంది..
ఆకలైనా..ఆత్రంతోనైనా..
రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది..
మొఘలుల అభిరుచికి జేజేలు చెప్పాలనిపిస్తుంది.

అదేనోయి మన దేశీయ వంటల ఘనత..
అది తెలిపేందుకే ఈ చికెన్ బిర్యాని కవిత.. 
******************************
written by BODDU MAHENDER
at 4:55pm 12.7.2012

Tuesday, 10 July 2012

మిరపకాయ బజ్జి...


వేడి వేడి బజ్జి..
మిరపకాయ బజ్జి...
తింటావా బుజ్జి..
అవుతావా సమవుజ్జీ..
నోట్లో పెడితే కారం..
అయినా వీడదు మమకారం..
దీంట్లో ఉంది సారం..
పెంచును పగా ప్రతీకారం
రుచి చూస్తే తప్పు కాదు..
కొత్తయినా ముప్పు లేదు..
అతి అయితేనే అనర్ధం...
అల్సరొచ్చి పేగు అవును ఓ వ్యర్ధం.. 
**************************
written by BODDU MAHENDER
at 6:25pm 10.7.2012

Monday, 28 November 2011

ఆ ..వేడి వేడి సమోసా ..

ఆ ..వేడి వేడి సమోసా ..
కావాలా బాబు కావాలా .??
ఢిల్లీ సుల్తాన్ ల మెప్పు పొందినది ఈ సమోసా ..
మొఘల్ పాదుషాల నోరూరించినది ఈ సమోసా ..
కావాలా ..అమ్మా ..కావాలా ??
సంస నుండి సమోసా గా పేరు మారినా ...
Taste,craze ఏ మాత్రం తగ్గని సమోసా ..
కావాలా ..బేబీ ..కావాలా ..??
10 వ శతాబ్దం నుండి ,
ప్రస్తుత శతాబ్దం వరకి ,
రాజ్యమేలుతున్న ..
ఏకైక snack రారాజు ఈ సమోసా ..
కావాలా ..చిన్నా ...కావాలా ..?
**
any center.. 
Single samosa.. 
కడుపు నిండును .. 
ఆకలి తీరును .. 
** ************************
written by ME 
at 9:43am 18.8.2011