Thursday, 26 July 2012

పెరుగన్నం..


పెరుగూ అన్నం కలిపితే పెరుగన్నం
ఆకలేసి ఆబగా తింటే పరమాన్నం
మినప పప్పు, జీడి పప్పుల తాలింపు
ఓ అద్భుతం..
కొత్తిమీర,దానిమ్మ గింజల మేళవింపు
మహా అమృతం..
అజీర్తిని హరిస్తుంది
అలసటని తొలగిస్తుంది
ఒంటికి చలువ చేసి,
కంటికి కమ్మటి నిద్రనిస్తుంది..
అందుకే ఇదంటే నాకెంతో ఇష్టం  
ఇది లేక పూట గడపడం చాలా కష్టం.
*************************
written by ME
at 12:15pm 26.7.2012

No comments:

Post a Comment