Showing posts with label వాస్తవిక కవితలు. Show all posts
Showing posts with label వాస్తవిక కవితలు. Show all posts
Friday, 18 January 2013
Tuesday, 18 December 2012
కానీ నేను మారలేదు..
నాలోనేనేగా ఉంటే తెలియలేదు ఈ సమాజ పోకడ..
నాతో నీవని కలుపుకుంటే ఆగట్లేదు ..నా గుండె దడ..
ఏది నిజం..ఏది అబద్ధం..ఎందుకీ అసంబద్ధం..
మాట మాటలోనూ ఎన్నో మర్మాలు..
మనుగడ పేరుతో పాటించే ఆపద్ధర్మాలు..
సమయానికి, సంపాదనకి ఉన్న విలువ,
మనిషికి, మానవత్వానికి లేదు..
నటనకి, నగ్నత్వానికి ఉన్న గుర్తింపు,
నా అనుకునే ప్రేమకి లేదు..
అవును..కాలం మారింది.. కాంక్ష మారింది..
కానీ నేను మారలేదు..నా తత్వం మారలేదు..
ఇప్పుడూ అలానే ఉన్నా..అందరిలో ఏకాకిలా..
అస్తిత్వాన్ని నిలుపుకునే తుపాకిలా..
****************************
written by BODDU MAHENDER
at 10:55am 19.12.2012
Friday, 9 November 2012
ఏ ఒక్కరితోనూ ఆగదు ....
ఓ అల వెనుకే మరో అల..
అలా నిరంతరం సాగిపోయేలా
పొద్దు వెనుకే ఈ రాత్రి వేళ..
మన బ్రతుకు బండి నడిచేనలా..
ఏ ఒక్కరితోనూ ఆగదు ఈ పయనం..
ఎందాక సాగినా వీడదు ఈ సహజీవనం..
మాతృ ప్రేమ మమకారం అది..
మహాజనుల సంస్కారం అది..
తెలుసుకో..తెలివిగా నడుచుకో..
నీ అడుగుజాడల్నే పదుగురికి చూపుకో..
***************************
written by BODU MAHENDER
at 6:26pm 9.11.2012
Wednesday, 17 October 2012
Sunday, 23 September 2012
ఈనాటి ప్రేమ ఇది.....
ఒప్పందాల ప్రేమ ఇది
సంప్రదింపుల ప్రేమ ఇది
రాజీపడని ప్రేమ ఇది
రాటుదేలిన ప్రేమ ఇది
అవసరాలే ముఖ్యం
ఆస్తిపాస్తులే ముఖ్యం
అంతరంగం ఒక పుష్పక విమానం
అడుగు అడుగుకొక ఆపద్ధర్మ ప్రమాణం
నా అనేదంతా నేనేంటో చెప్పేందుకే,
నీకోసం అనేదంతా నిన్ను నే అణిచేందుకే..
ఎంతైనా ఇది ఈనాటి ప్రేమ ఇది,
ఇచ్చిపుచ్చుకోవడాలు తెలిసిన ప్రేమ ఇది..
*************************
written by BODDU MAHENDER
at 7:25am 18.9.2012
Thursday, 6 September 2012
ఊహలే నా నేస్తాలు....
ఊహలెంత మంచివో కదా..
ఊరడించుతుంటవి కదా..
కలనైనా కానరాని కథలన్నీ ,
కళ్ళ ముందు నిలుపుతవి కదా..
మనసుపెట్టి చేసే పనులన్నీ,
మన అంచనాలని అందుకోకున్నా..
మైమరుపు తెచ్చే ఊహలెప్పుడూ
మనల్ని నీరుగార్చవు..నివ్వెర పర్చవు..కదా !
ఊహలే అని తీసిపారేయుట ఏలా..
ఆవిష్కరణలకివే పునాదులు..
సృజనాత్మకతకివే నిజ పాదులు..
ఆనందాన్ని అందించే అష్ట సిరులు..
అంబరాన్ని చేర్చే ఆలోచన ఝరులు..
అందుకే ఊహలే నా నేస్తాలు..
వాటి ఊసులే ఈ తత్వాలు..
*********************
written by ME
at 3:55pm 6.9.2012
Tuesday, 14 August 2012
వచ్చిందా..స్వాతంత్ర్యం వచ్చిందా..
వచ్చిందా..స్వాతంత్ర్యం వచ్చిందా..
సామాన్యుడి నడ్డి విరిచి
స్వార్ధ నాయకుల కడుపు నింపిందా..
అవినీతి, బంధు ప్రీతి
అంతకంతకు పెరిగిపోయిందా..
అందరూ ఒకటేననే సమభావం
అసలే లేకుండా తరిగిపోయిందా..
వచ్చిందా..స్వాతంత్ర్యం వచ్చిందా..
వివక్ష,విద్వేషాలని ఉసిగొల్పి
వివిధ వర్గాలంటూ జాతిని వేరుచేసిందా..
విశ్వమానవ సౌభ్రాతృత్వానికి..
విపత్తుగా పరిణమించిందా..
వచ్చిందా..స్వాతంత్ర్యం వచ్చిందా..
అట్టడుగు ప్రజల అవసరాల్ని తీర్చిందా..
అష్ట సిరుల జనుల ఆదరణ పొందిందా..
వచ్చిందా..స్వాతంత్ర్యం వచ్చిందా..
***********************
written by ME
at 8:02pm 14.8.2012
Monday, 13 August 2012
నమ్మితేనే మంచి..
ఆకాశపు అంచుకి చేర్చినా, ]
అగాధపు లోతుకి పడవేసినా..
అది నీ నమ్మకమే..నీపై నీకు గల నమ్మకమే..
వ్యక్తిని ప్రేమించేలా చేసేనా..
దైవాన్ని పూజించేలా కోరినా..
కేవలం నమ్మకం మాత్రమే..
వ్యవస్థని నిర్మింప చేసి...
వ్యవహారమై నిలిచిపోయేది..
మనసుతో చూసి..
మనిషిని మనిషితో కలిపేది..
మన నమ్మకం మాత్రమే..
నమ్మకం కారాదు ఎపుడూమూఢ నమ్మకం..
అలాగని పెంచుకోకూడదు అపనమ్మకం..
నమ్మితేనే మంచి..
నమ్మిస్తేనే నీకు మంచి..
*****************
written by ME
at 12pm 14.8.2012
Saturday, 21 July 2012
Saturday, 23 June 2012
Friday, 22 June 2012
Tuesday, 5 June 2012
ఓ నీలి వర్ణమా.....
ముక్కంటి గొంతులో ముచ్చటగా ఒదిగి..
మరు రెండు రంగులతో మురిపెంగా పొదిగి
హరివిల్లు రంగుల్ని అవనిలో ఒలికావే
ఆనంద రూపమై అనుభూతులు చిలికావే
ఆ నింగికే రంగద్దిన ఓ నీలి వర్ణమా
ఈ అంబుధిని చూపేటి కనికట్టు మర్మమా..
ఆ రామ , కృష్ణులైనా వినీల వర్ణ మూర్తులే..
ఈ మహి మనుజులైనా ఓ నీల వేణికి ఆర్తులే
మరు రెండు రంగులతో మురిపెంగా పొదిగి
హరివిల్లు రంగుల్ని అవనిలో ఒలికావే
ఆనంద రూపమై అనుభూతులు చిలికావే
ఆ నింగికే రంగద్దిన ఓ నీలి వర్ణమా
ఈ అంబుధిని చూపేటి కనికట్టు మర్మమా..
ఆ రామ , కృష్ణులైనా వినీల వర్ణ మూర్తులే..
ఈ మహి మనుజులైనా ఓ నీల వేణికి ఆర్తులే
****************************
written by ME
at 6:10pm 5.6.2012
Monday, 21 May 2012
Friday, 24 February 2012
Wednesday, 1 February 2012
Subscribe to:
Posts (Atom)












