Showing posts with label ప్రేమ కవితలు ... Show all posts
Showing posts with label ప్రేమ కవితలు ... Show all posts

Monday, 3 March 2014

ముసలమ్మా.. తను ఓ ముసలమ్మ

పేరుకే తను ముసలమ్మ 
పెద్ద  పేరంటాలేమీ కాదమ్మా 
ఆలోచనకే తను ముసలమ్మ 
అంత అనుభవమేమీ లేదమ్మా 

మాటలకే తను ముసలమ్మ
మలినమంటని  చిట్టి తల్లమ్మా 
ఊహలకే తను ముసలమ్మ
ఉడుకుదనం వీడని బుజ్జి పాపమ్మా

ముసలమ్మా.. తను ఓ ముసలమ్మ 
ముత్యం లాంటి చిన్నినవ్వమ్మా..!! 
ముసలమ్మా.. తను ఓ ముసలమ్మ 
ముద్దుల మూటల తింగరి బుచ్చమ్మా..!!
********************************
written by BODDU MAHENDER
at 9:40pm, 3.3.2014

Wednesday, 19 February 2014

మనసారా ప్రేమిస్తే .....

ప్రేమని గుర్తించలేని మూర్ఖత్వం నీదా?
ప్రేమగా వ్యక్తీకరించలేని మూఢత్వం నాదా?
దేనికీ చలించని జడత్వం నీదా?
దేనితోని జతపడని జఠిలత్వం నాదా?
మనసా మరి మరి నను వేధించకే
మనసారా ప్రేమిస్తే పరి పరి సాధించకే
*****************************
written  by BODDU MAHENDER
at 9:20pm, 19.2.2014

Saturday, 19 October 2013

ఓ వసంతాగమనమే..

నన్ను నేను ఆవిష్కరించుకుంటున్నా 
నీ సాంగత్యంలో ..
నన్ను నేను సృష్టించుకుంటున్నా 
నీ సాన్నిహిత్యంలో..
ఇది నిజంగా, శిశిరానికి 
ఓ వసంతాగమనమే..
 చప్పుడు మానేసిన నా గుండెలో 
చిక్కిన ఊసుల పునరాగమనమే..
*******************************
written by BODDU MAHENDER
at 7:52pm 19.10.2013

Saturday, 17 August 2013

నీవే నేను

నీవే నేను - అనేలా
నీ నీడనై వచ్చా ఈ వేళ
నా రేపటి కలై రావేలా..!!
 నా యెదనే ఉండేలా ప్రతివేళా..!!
*************************
written by BODDU MAHENDER
at 10:01pm 16.8.2013

Thursday, 11 April 2013

నీది త్యాగం - నాది ప్రేమ.

మాట నిలుపుకునే తాపత్రయం నాది.
మనసు విరిచేయాలనే ప్రయత్నం నీది.
నీ కన్నీరు తుడవాలనే ఆకాంక్ష నాది.
ఆ కన్నులే మూయాలనే ప్రతీక్ష నీది.
జన్మంతా జత పడాలనే జాగరణ నాది.
జాగరణే ఈ జన్మనుకునే ఆవేదన నీది.
నిన్ను తప్ప ఎవరినీ ప్రేమించలేని అసహాయత నాది.
నా సుఖం తప్ప నీ జీవితం మరిచిన అనురాగం నీది.
అన్నీ తెలిసి దూరమవ్వాలనుకుంటున్నావు నువ్వు..
అన్నీ తెల్సు కాబట్టే నాతో ఉండమంటున్నా నేను..
నీది త్యాగం - నాది ప్రేమ.
కానీ ఏ త్యాగం ప్రేమను వీడదు.
ఏ ప్రేమా.. త్యాగం కోరదు.
ఐ లవ్యూ .. ఐ నీడ్ యూ ఫరెవర్..
****************************
written by BODDU MAHENDER
at 11:11 pm,  11.4.2013

Wednesday, 13 February 2013

అర్ధమంతా ఈ ఒక్క మాటలో ఉందంటే..

ఎలా చెప్పాలో తెలియట్లేదు..
ఏమని చెప్పాలో తెలియట్లేదు..
అంతులేని నా ప్రేమకి, 
అర్ధమంతా ఈ ఒక్క మాటలో ఉందంటే..
నా మనసు ఎన్నటికీ ఒప్పుకోవట్లేదు..
అయినా ఇక చెప్పలేక చెబుతున్నా..
నా మనసు దాచలేక  చెబుతున్నా...
ప్రియా...  I LOVE YOU..
****************************
written by BODDU MAHENDER
at 1:12pm 13.2.2013

Tuesday, 22 January 2013

కలకాదనీ..ఈ నిజం..



ఆగిపోనీ ఈ సమయం..
ఆలకించనీ...నీ హృదయం..ఈ ఉదయం..
కలకాదనీ..ఈ నిజం..
రుజువు చేయనీ..నీ సంగమం..హృదయంగమం... 
********************************

written by BODDU MAHENDER
at 9:16am 23.1.2013

Monday, 17 December 2012

ఇలా మనమూ ఉండాలి...

ఇలా మనమూ ఉండాలి...చెలి..
అరిగిపోయిన పోలికలకి పోటీగా..
ఆదర్శమనుకునే జంటలకి సాటిగా...  
ఐక్యమయ్యే కంటిచూపులకన్నా  ధాటిగా..
అష్ట సిరులతో అందరికన్నా మేటిగా..
***************************
written by BODDU MAHENDER
at 1:07pm 17.12.2012

Friday, 19 October 2012

కల కాదిదని ........


ఇలా నాతో ప్రతి క్షణం ఉండిపోవా..
కల కాదిదని సదా నాకు గుర్తు చేయవా.. ప్రియా..
నీ గుండెలపై ఓసారి అలా ఒదగనీయవా..
దాని చప్పుళ్ళలో నీ మనోగీతాన్ని
మధురంగా శృతి చేయవా..
అది పలికే ఊసుల్ని,
మురిపెంగా నను విననీయవా..
**********************
written by BODDU MAHENDER
at 10:35pm 19.10.2012

Saturday, 22 September 2012

ఇదే నా కల...

ఇదే నా కల...
నా మనసు వేసిన వల,
ప్రాయంలో ఎగిసిన అల.,
పరువంలో చేసిన హేల,
ప్రేమ అని దానిని చెప్పనేల,
ప్రేయసి నా ఊహే అని 
గుట్టు విప్పనేల...!!
****************
written by BODDU MAHENDER
at 8:18pm 16.9.2012

అలకేలనే బంగారు చిలక..........

అలకేలనే బంగారు చిలక 
అల్లుకుపోవే నా సింగారి మొలక 

నీ చూపే వెన్నెలై వాలక,

నా కంటికి వచ్చెను కలక,
రేగిన జుట్టుకి పెంచాను పిలక,
నీ మాటే మౌనమై పలక,
నా గుండె అయ్యెను చెలక,
కన్నీటి బావికి వేసాను గిలక,

ఇకనైనా 
ఆ మూతి ముడుపులు మానవే,
పట్టు విడుపులతో నన్ను చేరవే,
కోహినూర్ కోటలే నీకు కట్టిస్తా..
కోట్ల కవితలే ప్రేమతో రాసిస్తా..
**********************
written by BODDU MAHENDER 
at 1:35pm 16.9.2012

ఎంత అందమే నీది....

ఎవరే నీవు..
ఎంత ముద్దొస్తున్నావు..

నా గుండెని నీ చూపు కొనకి,
పెట్టి లాగేస్తున్నావు..
ఎంత అందమే నీది..
ఏమి భాగ్యమో కదా నాది..


నీ పెదవి అంచే మీటనా..
ఆ కొన ముక్కునే తాకనా..
మనసే మారుతమై తేలే వేళ..
నీ మనసు మాటనే నే విననా..

మరి కలల కలవరం
ఇక ఆపవే చెలీ..
కంటి ముందు నిలిచి..
నా కాంక్ష తీర్చవే సఖీ..
*********************
written by BODDU MAHENDER
at 10:10am 16.9.2012

Wednesday, 5 September 2012

అనుకోని వరమై....

అనుకోని వరమై వచ్చావు
ఆత్మ బంధమై నిలిచావు 
అంతులేని అనురాగాన్ని చూపి,
నను ఆనంద డోలికల్లో తేలియాడించావు..
చెలీ..
నీవే నా సర్వస్వమని చెప్పేందుకు..
ఈ మాటలు చాలవు..
నీతో సదా ఆనందభరితమే అని,
తేల్చేందుకు ఒక జన్మ చాలదు..
Love You My sweet Heart..
I Love You Ever.. Forever…
*************************
written by BODDU MAHENDER
at 1:07am 20.2.2012

Monday, 3 September 2012

కానీ దాచలేనే ప్రియా..

బంధించగలనేమో... నీ రూపాన్ని నా గుండెల్లో..
నీ జ్ఞాపికని మనసు లోతుల్లో..
కానీ దాచలేనే ప్రియా..
నా ప్రేమని నీ ముంగిట్లో..
ఆరాధనని నా అంగిట్లో..
కలగా అయినా నా కాంక్ష తీర్చిపోవే..
క్షణమైనా నీ ప్రేమ పంచిపోవే..
నీవే నా సర్వస్వం..
నీకే నా సర్వస్వం..
సదా నీ ధ్యాసలో ఓ ప్రేమ పూజారి.. 
*************************
written by BODDU MAHENDER
at 5:50pm 3.9.2012

ఓ మైడియర్ బ్లాక్ బ్యూటీ..,


వదలలేను..నిలవలేను..
కదిలి కర్కశంగా సాగిపోలేను..
నాకు తెలుసు బంధాల విలువేంటో
ఆత్మీయతల అనుభూతులేంటో..
కన్నీరు విదిల్చి, కత్తుల్నిదూయలేను..
కపట నవ్వుల్తో,గుండెల్ని కోయలేను..
నా అల్లరి, ఆనందం అంతా నీతోనే..
నా ఆవేదన,ఆరాధన నీకోసమే..

ఓ మైడియర్ బ్లాక్ బ్యూటీ..,
నువ్వొక జ్ఞాపకం కాదు..
నా వ్యక్తిత్వ రూపకం..
నీ ప్రతి కథ , ప్రతి మలుపు
నాకో జీవిత పాఠం...
ఈ స్వార్ధ లోకానికి ఓ నీతి పాఠం
*********************
written by ME
at 3:30pm 3.9.2012

Saturday, 1 September 2012

నాలో సవ్వడి చేయనీ..


ఊహలకే రెక్కలు రానీ..
నా ఊసులన్నీ మోసుకుపోనీ..
మనసుకే మాటలు రానీ..
ఓ మధుర కవితై అల్లుకుపోనీ..
ప్రేమా..
నీ సడి ఎప్పుడూ నాలో సవ్వడి చేయనీ..
నా మరుడి తోడునే ప్రేమనీడగా మారనీ..
****************************
written by ME
at 10:01pm 1.9.2012

Monday, 23 July 2012

ప్రేమ వరం..

ఎదురు చూసిన క్షణం రానే వచ్చింది..
ఎదలోని మరుడిని ముందే నిలిపింది..
ప్రియ స్వరం, గుండె లయతో శృతి కలిపింది..
ప్రేమ వరం, కొత్త లోకానికి దారి చూపింది..
*******************************
written by ME
at 10:30pm 23.7.2012

కాంతదాసునిగా నను మలిచింది..


ప్రేమ...
మర ని కాదు,నేను మనిషినే అని గుర్తు చేసింది...
ఈ రాతి గుండెలోనూ అనురాగాలని పలికించింది..
కన్నె తోడులోని వన్నెలన్నీ ప్రదర్శించింది..
కాటికెళ్ళే వైరాగ్యాన్ని తొల్చి, కాంతదాసునిగా నను మలిచింది..
*********************************
written by ME
at 12:30pm 23.7.2012

Friday, 13 July 2012

తాజ్ మహల్.......


తాజ్ మహల్,
అదొక స్మారకం అని నేనంటాను..
కాదు..సమాధి అని నువ్వంటావు..
ప్రేమ అని నేను ఊహిస్తాను..
పశ్చాతాపం అని నువ్వు వాదిస్తావు..
కళాపోషణ అని నేను చూపిస్తే..
కన్నీటి చూషణ అని నువ్వు ఒప్పిస్తావు..
అయినా తరగని మక్కువతో నేనుంటే
తమకపు మొహం అని లోకువ చేస్తావు..
అయినా అదే ఇపుడు ప్రేమకి గుర్తు అయింది..
మన ప్రేమకి నాంది అయింది..
కాదంటావా చెలీ..!!
***********************
written by BODDU MAHENDER
at 10:15pm 13.7.2012

Thursday, 12 July 2012

ప్రేమా..

అనుకోని పరిచయం
అందించింది నీ హృదయం
ఆత్మీయమైన అనునయం
అంకురించింది ఈ ఉదయం
ప్రణయమనే ఊహే
పరవశం నింపే నాలో..
ప్రాణసఖివై నీవే
ప్రతిష్ట అయ్యావే లోలో..
నీ ఆశే నాకిపుడు ఆశయమయ్యిందే..
నీ ధ్యాసే గుండెకి ఊపిరినిచ్చిందే..
ప్రేమా..
నీవే నా ఉన్నతికి మార్గం చూపావే..
ప్రియురాలి సన్నిధికి దగ్గర చేసావే..
***********************

written by 
BODDU MAHENDER
at 8:45am 13.7.2012