Showing posts with label సదా మీ సేవలో..(Help Line). Show all posts
Showing posts with label సదా మీ సేవలో..(Help Line). Show all posts
Friday, 25 January 2013
Friday, 18 January 2013
Tuesday, 31 July 2012
పాన్ కార్డు - కొన్ని వాస్తవాలు
ఒకరికి ఒక పాన్‌కార్డుకు మించి ఉండటం చట్టవిరుద్ధం.
- ఒకటి కంటే ఎక్కువ ఉంటే సరెండర్ అప్లికేషన్ ద్వారా అదనపు కార్డును వెనక్కి ఇచ్చేయవచ్చు.
- www.incometaxindia.gov.in ద్వారా ఆన్‌లైన్లోనూ పాన్ కార్డు అప్లై చేసుకోవచ్చు.
- పాన్ అప్లికేషన్‌లో పెళ్లయినా కూడా తండ్రిపేరే రాయాలి. ఆదాయపు పన్ను ఫైలింగ్‌లోనూ అంతే.
- మీ పాన్‌కార్డు నంబరు ఎలా ఇస్తారంటే మొదటి మూడక్షరాలు సిరీస్ కోసం, నాలుగో అక్షరం కంపెనీ అయితే ‘సి’ అని, పర్సన్ అయితే ‘పి’ అని... ఇలా ఉంటుంది. ఐదో అక్షరం మీ ఇంటిపేరులోని మొదటి అక్షరం. మిగతావి సీరియల్ నంబర్. చివరి అక్షరం కూడా సిరీస్‌లో భాగమే.
- పాన్ కార్డు కొత్తగా అప్లయి చేసిఉంటే మీది ఏ స్టేటస్‌లో ఉందో తెలుసుకునే అవకాశముంది. గూగుల్‌లో ‘ట్రాక్ యువర్ పాన్ స్టేటస్’ అని టైప్ చేస్తే https://tin.tin.nsdl.com వస్తుంది. ఆ లింకు క్లిక్ చేస్తే మీ స్టేటస్ తెలుసుకోవచ్చు.
- పాన్ కార్డుపై అనుమానాల నివృత్తికి tininfo@nsdl.co.in, utiisl-gsd@mail.utiisl.co.in ఈ రెండు మెయిల్స్‌లో సంప్రదించవచ్చు.
అర్జెంటుగా పాన్ నెంబరు కావాలంటే?
పాన్‌కార్డు ఇంట్లో మరిచిపోయినపుడు మీ పాన్ నంబరు అవసరమైతే ఏం చేస్తారు? ఇంటికి ఫోన్ చేస్తారు. మరి ఇంట్లో ఎవరూ లేకపోతే? అందుకే ఆ అవకాశాన్ని ఇన్‌కంటాక్స్ డిపార్‌టమెంట్ కల్పించింది.
http://incometaxindiaefiling.gov.in వెబ్‌సైట్లోకి వెళ్తే మెనులో ‘సర్వీసెస్’ అని ఆప్షన్ ఉంటుంది. అందులో ‘నో యువర్ పాన్’లో మీ పేరు, పుట్టినరోజు వివరాలు ఫిల్ చేస్తే ఒక్క క్లిక్‌తో మీ పాన్‌కార్డు నంబరు తెలుసుకోవచ్చు.
Saturday, 17 March 2012
ATM , క్రెడిట్ కార్డులకి సంబంధించిన సమస్యలు-పరిష్కారాలు
కార్డు పోతే ..?
ఏటీఎం ,డెబిట్,క్రెడిట్, ఇంటర్ నేషనల్ ...ఇలా ఏ కార్డు వినియోగిస్తున్నా సరే ,కార్డు పోయింది అంటే ముందుగా చేయాల్సిన ముఖ్యమైన పని - ఆ కార్డుని వెంటనే బ్లాక్ చేయించడం.
కార్డు ఇష్యూ చేసిన బ్యాంకు కస్టమర్ కేర్ , ఫోన్ బ్యాంకింగ్ ద్వారా లేక కార్డు సర్వీస్ ప్రొవైడర్ (వీసా ,మాస్టర్ కార్డ్ ) కాల్ సెంటర్ కి మీరు ఫోన్ చేసి బ్లాక్ చేసుకోవచ్చు.ఈ సమయంలో కార్డు హోల్డర్ పేరు , కార్డు నంబర్ ,మీ గుర్తింపు కోసం పుట్టిన తేదీ , బ్యాంక్ అకౌంట్ నంబర్ వంటి ఇతర వివరాలని అడిగి తెలుసుకుంటారు. సాధారణంగా ఎవరు ఫోన్ చేసి కార్డు నంబర్ , కార్డు హోల్డర్ పేరు చెప్పినా ముందు జాగ్రత్తగా కార్డుని వెంటనే బ్లాక్ చేస్తారు.
ఒక్కోసారి మనం కార్డు ఎక్కడో పెట్టి మర్చిపోతాం.అది కనపడదు.పోయింది కదా అని బ్లాక్ చేస్తే కొత్త కార్డు రావడానికి వారం రోజులపైనే పడుతుంది.అలా అని వెతుకుతూ కూర్చొని ఉంటే, ఎవరైనా కాజేసి వాదేస్తారేమో అని భయం ఉంటుంది. ఇలాంటప్పుడు కార్డుని తాత్కాలికంగా బ్లాక్ చేయవచ్చు. ఇలా కార్డుని తాత్కాలికంగా బ్లాక్ చేసేందుకు ICICI, AXIS వంటి కొన్ని బ్యాంకులు వెసలుబాటుని కల్పిస్తున్నాయి. ఫోన్ చేసిన వెంటనే తాత్కాలికంగానా లేక శాస్వతంగానా అని అడుగుతారు. కార్డు పోయిందని నిర్ధారణకి రానప్పుడు తాత్కాలికంగా బ్లాక్ చేయించుకోవచ్చు.కార్డ్ దొరికిన వెంటనే బ్యాంకుకి ఫోన్ చేసి మీ వివరాలని చెప్పి వెంటనే మళ్ళీ కార్డుని పునరిద్ధరించుకోవచ్చు .
కార్డు ATM మిషన్ లో ఇరుక్కుపోయినపుడు ..
తక్షణం మీ దగ్గరలోని సంబంధిత బ్యాంకు బ్రాంచికి వెళ్లి ఫిర్యాదు చేయాలి. ఇలా ATM లో ఏవైనా కార్డులుంటే, అవి అదే సంస్థకి చెందిన కార్డులు అయితే వెంటనే కార్డు నంబర్ ఆధారంగా అకౌంట్ ఉన్న బ్రాంచికి పంపడం జరుగుతుంది.తర్వాత మీ చిరునామాకి ఈ కార్డుని పంపిస్తారు.దీనికి కనీసం వారం రోజుల సమయం పడుతుంది.ఒక వేల కార్డు పూర్తిగా బ్లాక్ చేయిస్తే మాత్రం కొత్త కార్డు తీసుకోవాల్సిందే. అదే వేరే బ్యాంకు ATM లో కార్డు స్ట్రక్ అయితే మాత్రం ఆ కార్డుని వెంటనే ముక్కలు చేస్తారు.కాబట్టి మీరు ఆ కార్డు మిస్యూజ్ అవ్వకుండా ముందు జాగ్రత్తగా ఆ కార్డుని మీరే బ్లాక్ చేయించి కొత్త కార్డు తీసుకోవాలి. కొత్త కార్డు తీసుకున్నందుకు రూ.200 నుంచి రూ.500 వరకి చార్జీలు వసూలు చేస్తారు.
బీమా రక్షణ ఉంటుంది:
దొంగిలించిన మీ కార్డుతో ఎవరైనా లావాదేవీలు నిర్వహిస్తే ,ఆ మొత్తాన్ని తిరిగి ఇచ్చే విధంగా బ్యాంకులు బీమా రక్షణని కల్పిస్తాయి.కాని దీనికి ముందుగా మీరు చేయాల్సింది - కార్డు పోయిన వెంటనే బ్యాంకుకి ఫిర్యాదు చేయడంతో పాటు కార్డు పోయినట్లు పోలీస్ స్టేషన్ నుండి ఒక F.I.R. పత్రం ఇవ్వాల్సి ఉంటుంది.ఇలా బ్యాంకుకి ఫిర్యాదు చేసిన తర్వాత మీకు సంబంధం లేకుండా జరిగిన లావాదేవీలకి సంబంధించిన మొత్తాన్ని బ్యాంకులే భరిస్తాయి.కాని లావాదేవీలు జరిగిన 30 రోజుల లోపు ఈ వ్యవహారాన్ని బ్యాంకు దృష్టికి తీసుకురావాల్సి ఉంటుంది.ఒకవేళ మీ కార్డుకి బీమా రక్షణ లేకపోతే అడిగి తీసుకోవచ్చు.
pin నంబర్ మర్చిపోయినపుడు..
మీ ATM లేదా డెబిట్,క్రెడిట్ కార్డుల పిన్ నంబర్లు మరిచిపోతే ఈ విషయాన్ని బ్యాంకు దృష్టికి తీసుకు వస్తే మీకు కొత్త pin నంబర్ ని ఇస్తారు.ఇది నేరుగా ఇవ్వరు. అకౌంట్ లో ఉన్న చిరునామాకి పిన్ నంబర్ ని పోస్ట్ చేస్తారు.దీనికి రూ.25 నుంచి రూ.50 వరకు వసూలు చేస్తారు.
ఈ కింది బ్యాంకుల కస్టమర్ కేర్ నంబర్స్ నోట్ చేసుకోండి.
master card : 0008001001087
visa card : 0008001001219
SBI :
1800112211, +91802659990
ICICI BANK:
9849578000
040-23128000, 1800224848
HDFC BANK :
040-66624332, 18004254332
ANDHRA BANK:
040-24756023.
STATE BANK OF HYDERABAD:
1800112211, 08026599990
AXIS BANK :
02225261201, 18604258888.
UCO BANK:
18003450123, 18003453337
0RIENTAL BANK OF COMMERCE:
040-27722424, 18003452424.
ఇవి గుర్తుంచుకోండి:
- కార్డు వివరాలని గోప్యంగా ఉంచండి.
- కార్డు నంబర్ ని రాసి పెట్టుకోవడం మరిచిపోవద్దు.
- కార్డుని బ్లాక్ చేయాలంటే ఆ నంబర్ తప్పనిసరి.
- అలాగే ఫోన్ బ్యాంకింగ్ లేదా టోల్ ఫ్రీ నంబర్లని రాసిపెట్టుకోండి.
- మిస్యూజ్ అవుతుందనే అనుమానం ఉంటె వెంటనే బ్లాక్ చేయించండి.
Wednesday, 14 December 2011
పాకెట్ మనీ సంపాదనకు
రోజురోజుకీ పెరిగిపోతున్న ధరలు ఒక పక్కయితే, ఊహకు మించి పెరిగిపోతున్న పిల్లల ఫీజులు, నిత్యావసర సరుకులు, ఇంటద్దెలు మరోవైపు. ఒక్కరే సంపాదించే కుటుంబం అయితే ఇక చెప్పనవసరంలేదు. దూరంగా మహానగరాలలో చదువుతున్న తమ పిల్లలకు ఇచ్చే పాకెట్ మనీ కూడా సరిపోవడంలేదు. ఇంట్లో పరిస్థితి తెలిసి విద్యార్థులు కూడా తల్లిదండ్రులను పాకెట్‌మనీ కోసం ఒత్తిడి తీసుకురాలేక ఇటు పట్టణాలలో అవసరాలకు డబ్బు సరిపోక ఏం చేయాలనే గందరగోళ పరిస్థితులలో ఉన్నారు. అందుకే ఇంట్లో వాళ్ళకి చేయూతగా ఉంటూ తమ పాకెట్‌మనీ కోసం ఇతరుల మీద ఆధారపడకుండా ఉండేందుకు కొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు. నెలకు రూ. వేయి నుంచి పది వేలకు పైగా సంపాదిస్తున్నారు...
ఇంటర్‌నెట్‌లో పాఠాలు...
ఈ రోజుల్లో ఇంటర్‌నెట్ ఎలా అభివృద్ధిచెందిందో మనకు తెలుసు. దానివల్ల ఇ-లెర్నింగ్ లాభదాయకంగా మారింది. స్కూలుకు వెళ్ళే విద్యార్థుల పాఠాలనుంచి కంప్యూటర్‌కు సంబంధించిన సమాచారం, యాని మేషన్, కార్పోరేట్ వారికి శిక్షణ లాంటి విషయాలను సులభంగా అర్థమయ్యేరీతిలో తయారు చేసి ఇంటర్ నెట్‌లో ఉంచండి. తద్వారా నెలకు రూ.3,000 నుంచి రూ15,000 వరకు సంపాదించండి.
అలవాట్లతో ఆదాయం...
మీకున్న హాబీలతోనే సంపాదించవచ్చు. అదెలాగంటే... ప్యాకింగ్ చేయడం, గిఫ్ట్‌లను తయారు చేయడం, కొవ్వొత్తులు, అగరొత్తుల ద్వారా ఆదాయం పొందవచ్చు. పండుగలు వస్తున్న తరుణంలో వ్యాపారానికి అనువైన ప్రదేశా లలో విక్రయకేంద్రాలు తెరవండి. దుకాణ దారులతో ఒప్పందాలు కుదుర్చుకొని వాటి ని సరఫరా చేయండి. మొదలు పెట్టగానే ఆదాయం రావట్లేదని అధైర్యపడకుండా, వస్తువుల నాణ్యతపైనే దృష్టిపెట్టండి. మీ వ్యాపారానికి అవసరమై తే చిన్న చిన్నప్రకటనలు కూడా ఇవ్వండి.
ఆలోచనలను అక్షరాలుగా ...
మీలో ఉన్న ఆలోచనలకు పదునుపెట్టండి. ఈ రోజుల్లో పత్రికలు, వెబ్‌సైట్‌లు రోజురోజుీ పెరుగుతు
న్నాయి. మీ సామర్థాన్ని పెంచుకోండి. ఆన్‌లైన్ సైట్‌లకు ఫోటోలు, వ్యాసాలను విక్రయించడం మీకు ఆదా యాన్ని తెచ్చే మార్గం. సరికొత్త అంశాలపై లోతైన అవగాహనతో చదవించేలా వ్యాసాలను రాయాలి.ప్రచురితమయ్యే వ్యాసాల్లో ప్రతి పదానికి కొంత మొత్తం చెల్లిస్తారు. ఇలా సంపాదించడం కోసం మీరు మొదటగా చేయవలసినదల్లా ఎలాన్స్ డాట్‌కామ్ తదితర సైట్లలో మీ పేరును నమోదు చేసుకోవడమే.
నిర్ణీత పాయింట్లు సాధించండి...
ఈ రోజుల్లో ఇంటర్‌నెట్ కనెక్షన్‌లు ఉన్న ఇళ్ళు నగరాలలో ఎనభైశాతం ఉన్నాయి. ఐటీకి సంబంధిం చినదైనా, హెల్త్ సెక్యూరిటీకి సంబంధించినదైనా ఇంటర్‌నెట్ కనెక్షన్ ఉంటే చాలు పెయిడ్ ఆన్‌లైన్ సర్వే లలో పాల్గొని సంపాదించవచ్చు. కేవలం అభిప్రాయ సేకరణే కావచ్చు. ఏదైనా డబ్బు చెల్లించే సర్వే సైట్ల లో రోజుకి అరగంటసేపు కేటాయిస్తే లాభం ఉంటుంది. పెయిడ్ ఆన్‌లైన్ సర్వేలలో డబ్బు చెల్లింపులు, రాయితీ కూపన్లు ఉంటాయి. వివిధ ఉత్పత్తులపై మార్కెట్ సర్వే సంస్థలు విస్తృతంగా సమాచారాన్ని సేకరి స్తున్నాయి. దీంతో అవకాశాలు పుష్కలంగా ఉంటున్నాయి. ఈ సైట్లలో మరొకరిని రిఫర్ చేయడం ద్వారా పాయింట్లు కేటాయిస్తారు. వాటి ఆధారంగా రోజుకు రూ. 15 నుంచి రూ. 300 దాకా మీ పాకెట్‌లోకి చేరుతుంది. నిర్ణీత పాయింట్లు సాధిస్తే దానికి తగ్గట్లుగా చెల్లింపులు ఉంటాయి. ఇందుకోసం గ్లోబల్ టెస్ట్ మార్కెట్, సర్వే, సేవీ, అమెరికన్ కన్జ్యూమర్ ఒపీనియన్ ప్యానల్, బ్రాండ్ ఇన్‌స్టిట్యూట్ అండ్ చియావో సర్వీస్ ఇండియా తదితర సైట్లను సంప్రదించండి. ఇంకెందుకు ఆలస్యం ఈ రోజునుంచే నిర్ణీత పాయిం ట్లను సాధించడానికి ప్రయత్నించండి.
పెట్టుబడులపై నిఘా...
గంటకు ఇంతని..
మనం చదువుకునే రోజుల్లో కాలక్షేపానికి నేర్చుకొన్న గణిత చిట్కాలనో, సంగీతమో, విదేశీ భాషో ఇప్పుడు సంపాదనకు ఉపయోగపడుతుంది. సాయంత్రాల్లోనో, వారాంతాల్లోనో ఈ అంశాలపై ట్యూషన్లు చెప్పి గంటకు ఇంతని సంపాదించండి. హైస్పీడ్ నెట్‌కనెక్షన్‌తో ఆన్‌లైన్ ట్యూషన్లూ చెప్పొచ్చు. ఇదేం కొత్తపద్ధతి కాదుకదా చాలా మంది పెద్దలు కూడా చదువుకునే రోజుల్లో ఇలానే ట్యూషన్లు చెప్పి పైకి వచ్చి నవారేనని ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి.
ఆన్‌లైన్‌లో అమ్మకాలు...
ఇది కొంచెం టెక్నిక్ ఉపయోగించి చేయాల్సినపని. ఎందుకంటే మంచి మంచి పెయంటింగ్స్‌ను ఎన్నుకొని వాటిని ఈ- కామర్స్ ద్వారా నెట్‌లో వేలానికి ఉంచాలి. ఇంకా ఇందులో ఎక్ట్రానిక్ వస్తువులు, పాత పుస్తకాలు, కార్లు, మోటార్ సైకిళ్ళు కూడా ఆన్‌లైన్‌లో అమ్ముకోవచ్చు. రిడీఫ్, ఐఆఫర్, అమె జాన్, ఈబే లాంటి సైట్లలో వేలానికి ఉంచండి. పేపాల్ అనే ఆన్‌లైన్ నిధుల బదిలీ సర్వీసుల ద్వారా మీకు చెల్లింపులు జరుగుతాయి. బదిలీలు చెల్లింపుల విషయంలో అప్రమత్తంగా ఉండడం అవసరం. అంతేకాకుండా వేలంలో మన వస్తువుకు తగ్గ రేటును సంపాదించుకోవడం పైనే మన తెలివితేటలన్నీ ఆధారపడి ఉంటాయన్న విషయం మర్చిపోకండి.
క్లిక్ చేయడం ద్వారా...
బ్లాగ్ అనగా మనసులోని భావ వ్యక్తీకరణకు, వాటిపై జరిగే చర్చకు ఓ వేదిక మాత్రమే కాదు. డబ్బు సంపాదించే మార్గం కూడా. బ్లాగింగ్‌లను డబ్బు సం పాదించే ప్రక్రియగా మార్చుకోండి. మీ బ్లాగు
లో వాణిజ్య ప్రకటనల కోసం గూగుల్ యాడ్‌సెన్స్, చిటికా తదితర ప్రకటన దారులతో భాగస్వామి కావ చ్చు. బ్లాగానుకూల ప్రకటనలు సంబంధిత కంపెనీ లు మీకు పంపుతాయి. క్లిక్ వంతునో, స్పందనను బట్టో డబ్బులు చెల్లిస్తాయి. ఖాళీ సమయాల్లో ఇలాం టివి చేయడం ద్వారా నెలకు రూ. 5,000లకు పైనే సంపాదించవచ్చు. ఒక్క రూపాయి దానం చేయడం నేర్పించేకన్నా రూపాయి సంపాదించడం నేర్పించ మన్నారు పెద్దలు. మీరు కూడా ఉన్నత చదువుల కోసం పట్టణాలకు, మహానగరాలకు వచ్చి చదుకునే టప్పుడు ఇలాంటి చిన్న చిన్న ఆదాయ మార్గాలను ఎంచుకోవడం ద్వారా మీ పాకెట్ మనీని సమకూర్చుకోవచ్చు.
సెకండ్ ఇన్నింగ్స్ ఉద్యోగాలు
పిల్లల్ని కనడానికో, పెంచడానికో, తల్లిదండ్రుల్ని చూసుకోవడానికో, సేవ చేయడానికో కొంతమంది ఉద్యోగినులు కెరీర్‌లో బ్రేక్ తీసుకోవాల్సి వస్తుంటుంది. బాధ్యతలు తీరిపోయాక మళ్లీ ఉద్యోగం చేయాలని ప్రయత్నిస్తే ఇంతకాలం ఖాళీగా ఉన్నారు కదా... చూద్దాంలే అంటూ దరఖాస్తులను పక్కన పడేస్తున్నాయి సంస్థలు. ఉద్యోగానుభవం, నైపుణ్యం ఉన్నప్పటికీ ఖాళీగా ఉండాల్సి వస్తున్న ఇటువంటి మహిళల కోసం కొన్ని కార్పొరేట్ కంపెనీలు అవకాశాలు కల్పిస్తున్నాయి. వాటిలో టాటా సంస్థ ఒకటి.![]()
"టాటా గ్రూప్స్ ఏర్పాటుచేసిన సెకండ్ కెరీర్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ (ఎస్‌సిఐపి) ద్వారా మహిళలు కెరీర్‌లో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టొచ్చు. ఈ కార్యక్రమాన్ని 2008-09 సంవత్సరంలో మొదలుపెట్టాం. ఆ ఏడాది రెండు వేల దరఖాస్తులు వచ్చాయి. వాటినుంచి 34 మందిని ఎంపిక చేశాం. ఆ తరువాత 2009-10 లో వాటిసంఖ్య ఐదువేలకి పెరిగింది. వాటిలో 41 మంది ఎంపికయ్యారు. ఈ ఏడాది ఐదువేల దరఖాస్తుల పైనే వచ్చే అవకాశం ఉంది. టాలెంట్ ఉన్న ఎంతోమంది మహిళలు పలురకాల కారణాల వల్ల ఉద్యోగాలను వదిలేస్తుంటారు.
ఆ తరువాత ఉద్యోగాలు చేయాలని వాళ్లకున్నా అవకాశాలు లేక ఖాళీగా ఉంటున్నారు. సామర్ధ్యం ఉండి, నైపుణ్యం కలిగి మళ్లీ కెరీర్ మొదలుపెట్టాలనుకునే మహిళలకి పని కల్పించేందుకు ఏర్పాటు చేసిందే ఎస్‌సిఐపి ప్రోగ్రామ్. టాటా గ్రూప్ లైవ్ బిజినెస్ ప్రాజెక్టుల ద్వారా కూడా ఉపాధి కల్పిస్తుంది. ఇందుకు ఐదారునెలల సమయంలో దాదాపు 500 గంటలపాటు పనిచేయాల్సి ఉంటుంది. దీంతోపాటు టాటా పవర్ అండ్ టాటా కాపిటల్‌లో కూడా ఉద్యోగావకాశాలు ఉన్నాయి'' అని చెప్పారు టాటా గ్రూప్ హెచ్ఆర్ చీఫ్ సతీష్ ప్రధాన్.
కెరీర్‌లో బ్రేక్ తప్పనిసరి..
హిందుస్తాన్ యూనిలివర్ లిమిటెడ్ (హెచ్‌యుఎల్) కంపెనీ కూడా దాదాపు ఇలాంటి పద్ధతినే అనుసరిస్తోంది. అయితే ఆడవాళ్లకు మాత్రమే కాదు. మగ, ఆడ ఇద్దరికీ కొన్నేళ్లపాటు ఉద్యోగం చేసిన తరువాత బ్రేక్ తీసుకుంటే బాగుండనిపించడం సహజం. అటువంటి వాళ్లకి బ్రేక్ తీసుకునే అవకాశం కల్పిస్తోంది హెచ్‌యుఎల్. ఈ అవకాశాన్ని ఉద్యోగ కాలపరిమితిలో రెండుసార్లు వాడుకోవచ్చు. "ముఖ్యంగా మహిళా మేనేజర్ల గురించి ఆలోచించి ఈ సదుపాయాన్ని కల్పిస్తున్నాం. జీవితంలో ప్రతీ దశను ఎంజాయ్ చేయాలంటే ఇటువంటి అవకాశం తప్పక ఉండాలి.
అప్పుడే మహిళ లకి కుటుంబ జీవితాన్ని, కెరీర్‌ని బాలెన్స్ చేసుకోవడం సులభమవుతుంది'' అన్నారు హెచ్‌యుఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లీనా నాయర్. ఈ రెండు సంస్థలే కాకుండా ఇండియన్ ఇంక్ అనే సంస్థ కూడా మహిళల కోసం ఎన్నో సౌకర్యాలను కల్పించింది. పనిగంటల్లో వెసులుబాటు, ఇంటినుంచి పనిచేసే అవకాశం, శాటిలైట్ ఆఫీస్ పాలసీ, పిల్లల సంరక్షణ వంటి ఎన్నో అవకాశాలు ఉన్నాయి ఈ సంస్థలో
"టాటా గ్రూప్స్ ఏర్పాటుచేసిన సెకండ్ కెరీర్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ (ఎస్‌సిఐపి) ద్వారా మహిళలు కెరీర్‌లో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టొచ్చు. ఈ కార్యక్రమాన్ని 2008-09 సంవత్సరంలో మొదలుపెట్టాం. ఆ ఏడాది రెండు వేల దరఖాస్తులు వచ్చాయి. వాటినుంచి 34 మందిని ఎంపిక చేశాం. ఆ తరువాత 2009-10 లో వాటిసంఖ్య ఐదువేలకి పెరిగింది. వాటిలో 41 మంది ఎంపికయ్యారు. ఈ ఏడాది ఐదువేల దరఖాస్తుల పైనే వచ్చే అవకాశం ఉంది. టాలెంట్ ఉన్న ఎంతోమంది మహిళలు పలురకాల కారణాల వల్ల ఉద్యోగాలను వదిలేస్తుంటారు.
ఆ తరువాత ఉద్యోగాలు చేయాలని వాళ్లకున్నా అవకాశాలు లేక ఖాళీగా ఉంటున్నారు. సామర్ధ్యం ఉండి, నైపుణ్యం కలిగి మళ్లీ కెరీర్ మొదలుపెట్టాలనుకునే మహిళలకి పని కల్పించేందుకు ఏర్పాటు చేసిందే ఎస్‌సిఐపి ప్రోగ్రామ్. టాటా గ్రూప్ లైవ్ బిజినెస్ ప్రాజెక్టుల ద్వారా కూడా ఉపాధి కల్పిస్తుంది. ఇందుకు ఐదారునెలల సమయంలో దాదాపు 500 గంటలపాటు పనిచేయాల్సి ఉంటుంది. దీంతోపాటు టాటా పవర్ అండ్ టాటా కాపిటల్‌లో కూడా ఉద్యోగావకాశాలు ఉన్నాయి'' అని చెప్పారు టాటా గ్రూప్ హెచ్ఆర్ చీఫ్ సతీష్ ప్రధాన్.
కెరీర్‌లో బ్రేక్ తప్పనిసరి..
హిందుస్తాన్ యూనిలివర్ లిమిటెడ్ (హెచ్‌యుఎల్) కంపెనీ కూడా దాదాపు ఇలాంటి పద్ధతినే అనుసరిస్తోంది. అయితే ఆడవాళ్లకు మాత్రమే కాదు. మగ, ఆడ ఇద్దరికీ కొన్నేళ్లపాటు ఉద్యోగం చేసిన తరువాత బ్రేక్ తీసుకుంటే బాగుండనిపించడం సహజం. అటువంటి వాళ్లకి బ్రేక్ తీసుకునే అవకాశం కల్పిస్తోంది హెచ్‌యుఎల్. ఈ అవకాశాన్ని ఉద్యోగ కాలపరిమితిలో రెండుసార్లు వాడుకోవచ్చు. "ముఖ్యంగా మహిళా మేనేజర్ల గురించి ఆలోచించి ఈ సదుపాయాన్ని కల్పిస్తున్నాం. జీవితంలో ప్రతీ దశను ఎంజాయ్ చేయాలంటే ఇటువంటి అవకాశం తప్పక ఉండాలి.
అప్పుడే మహిళ లకి కుటుంబ జీవితాన్ని, కెరీర్‌ని బాలెన్స్ చేసుకోవడం సులభమవుతుంది'' అన్నారు హెచ్‌యుఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లీనా నాయర్. ఈ రెండు సంస్థలే కాకుండా ఇండియన్ ఇంక్ అనే సంస్థ కూడా మహిళల కోసం ఎన్నో సౌకర్యాలను కల్పించింది. పనిగంటల్లో వెసులుబాటు, ఇంటినుంచి పనిచేసే అవకాశం, శాటిలైట్ ఆఫీస్ పాలసీ, పిల్లల సంరక్షణ వంటి ఎన్నో అవకాశాలు ఉన్నాయి ఈ సంస్థలో
Tuesday, 29 November 2011
An Idea can change your Life...
Hai my dear Frnds...
Spark change in INDIA...with the Spark in YOU...
Share ideas for India's progress at-
www.sparktherise.com
***They will give Grants to the winning ideas**
Be the Fresh thinkers of today,
who make the india of tomarrow..
Submit your ideas in the areas of Technology, Transportation, Infrastructure, Energy, Agriculture, Rural Development and Social Entrepreneurship to
www.sparktherise.com
and see them spark change..
*Its a rare opportunity to help build the world you want to live in.....
In the same way,u can share your ideas at-
www.isb.edu/idiya
*********************************
Spark change in INDIA...with the Spark in YOU...
Share ideas for India's progress at-
www.sparktherise.com
***They will give Grants to the winning ideas**
Be the Fresh thinkers of today,
who make the india of tomarrow..
Submit your ideas in the areas of Technology, Transportation, Infrastructure, Energy, Agriculture, Rural Development and Social Entrepreneurship to
www.sparktherise.com
and see them spark change..
*Its a rare opportunity to help build the world you want to live in.....
In the same way,u can share your ideas at-
www.isb.edu/idiya
*********************************
Subscribe to:
Posts (Atom)





