Wednesday 14 December 2011

పాకెట్‌ మనీ సంపాదనకు


రోజురోజుకీ పెరిగిపోతున్న ధరలు ఒక పక్కయితే, ఊహకు మించి పెరిగిపోతున్న పిల్లల ఫీజులు, నిత్యావసర సరుకులు, ఇంటద్దెలు మరోవైపు. ఒక్కరే సంపాదించే కుటుంబం అయితే ఇక చెప్పనవసరంలేదు. దూరంగా మహానగరాలలో చదువుతున్న తమ పిల్లలకు ఇచ్చే పాకెట్‌ మనీ కూడా సరిపోవడంలేదు. ఇంట్లో పరిస్థితి తెలిసి విద్యార్థులు కూడా తల్లిదండ్రులను పాకెట్‌మనీ కోసం ఒత్తిడి తీసుకురాలేక ఇటు పట్టణాలలో అవసరాలకు డబ్బు సరిపోక ఏం చేయాలనే గందరగోళ పరిస్థితులలో ఉన్నారు. అందుకే ఇంట్లో వాళ్ళకి చేయూతగా ఉంటూ తమ పాకెట్‌మనీ కోసం ఇతరుల మీద ఆధారపడకుండా ఉండేందుకు కొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు. నెలకు రూ. వేయి నుంచి పది వేలకు పైగా సంపాదిస్తున్నారు...

SuperStockమనసుంటే మార్గాలు అనేకం ఉంటాయి. మన హాబీలతో, మనకున్న తెలివితేటలతో సులభంగా పాకె ట్‌మనీనే కాకుండా ఇంట్లో వాళ్ళకు కూడా మీవంతు సాయంగా అందించవచ్చు.


ఇంటర్‌నెట్‌లో పాఠాలు...
ఈ రోజుల్లో ఇంటర్‌నెట్‌ ఎలా అభివృద్ధిచెందిందో మనకు తెలుసు. దానివల్ల ఇ-లెర్నింగ్‌ లాభదాయకంగా మారింది. స్కూలుకు వెళ్ళే విద్యార్థుల పాఠాలనుంచి కంప్యూటర్‌కు సంబంధించిన సమాచారం, యాని మేషన్‌, కార్పోరేట్‌ వారికి శిక్షణ లాంటి విషయాలను సులభంగా అర్థమయ్యేరీతిలో తయారు చేసి ఇంటర్‌ నెట్‌లో ఉంచండి. తద్వారా నెలకు రూ.3,000 నుంచి రూ15,000 వరకు సంపాదించండి.


అలవాట్లతో ఆదాయం...
మీకున్న హాబీలతోనే సంపాదించవచ్చు. అదెలాగంటే... ప్యాకింగ్‌ చేయడం, గిఫ్ట్‌లను తయారు చేయడం, కొవ్వొత్తులు, అగరొత్తుల ద్వారా ఆదాయం పొందవచ్చు. పండుగలు వస్తున్న తరుణంలో వ్యాపారానికి అనువైన ప్రదేశా లలో విక్రయకేంద్రాలు తెరవండి. దుకాణ దారులతో ఒప్పందాలు కుదుర్చుకొని వాటి ని సరఫరా చేయండి. మొదలు పెట్టగానే ఆదాయం రావట్లేదని అధైర్యపడకుండా, వస్తువుల నాణ్యతపైనే దృష్టిపెట్టండి. మీ వ్యాపారానికి అవసరమై తే చిన్న చిన్నప్రకటనలు కూడా ఇవ్వండి.


ఆలోచనలను అక్షరాలుగా ...
మీలో ఉన్న ఆలోచనలకు పదునుపెట్టండి. ఈ రోజుల్లో పత్రికలు, వెబ్‌సైట్‌లు రోజురోజుీ పెరుగుతు
న్నాయి. మీ సామర్థాన్ని పెంచుకోండి. ఆన్‌లైన్‌ సైట్‌లకు ఫోటోలు, వ్యాసాలను విక్రయించడం మీకు ఆదా యాన్ని తెచ్చే మార్గం. సరికొత్త అంశాలపై లోతైన అవగాహనతో చదవించేలా వ్యాసాలను రాయాలి.ప్రచురితమయ్యే వ్యాసాల్లో ప్రతి పదానికి కొంత మొత్తం చెల్లిస్తారు. ఇలా సంపాదించడం కోసం మీరు మొదటగా చేయవలసినదల్లా ఎలాన్స్‌ డాట్‌కామ్‌ తదితర సైట్లలో మీ పేరును నమోదు చేసుకోవడమే.


నిర్ణీత పాయింట్లు సాధించండి...
ఈ రోజుల్లో ఇంటర్‌నెట్‌ కనెక్షన్‌లు ఉన్న ఇళ్ళు నగరాలలో ఎనభైశాతం ఉన్నాయి. ఐటీకి సంబంధిం చినదైనా, హెల్త్‌ సెక్యూరిటీకి సంబంధించినదైనా ఇంటర్‌నెట్‌ కనెక్షన్‌ ఉంటే చాలు పెయిడ్‌ ఆన్‌లైన్‌ సర్వే లలో పాల్గొని సంపాదించవచ్చు. కేవలం అభిప్రాయ సేకరణే కావచ్చు. ఏదైనా డబ్బు చెల్లించే సర్వే సైట్ల లో రోజుకి అరగంటసేపు కేటాయిస్తే లాభం ఉంటుంది. పెయిడ్‌ ఆన్‌లైన్‌ సర్వేలలో డబ్బు చెల్లింపులు, రాయితీ కూపన్లు ఉంటాయి. వివిధ ఉత్పత్తులపై మార్కెట్‌ సర్వే సంస్థలు విస్తృతంగా సమాచారాన్ని సేకరి స్తున్నాయి. దీంతో అవకాశాలు పుష్కలంగా ఉంటున్నాయి. ఈ సైట్లలో మరొకరిని రిఫర్‌ చేయడం ద్వారా పాయింట్లు కేటాయిస్తారు. వాటి ఆధారంగా రోజుకు రూ. 15 నుంచి రూ. 300 దాకా మీ పాకెట్‌లోకి చేరుతుంది. నిర్ణీత పాయింట్లు సాధిస్తే దానికి తగ్గట్లుగా చెల్లింపులు ఉంటాయి. ఇందుకోసం గ్లోబల్‌ టెస్ట్‌ మార్కెట్‌, సర్వే, సేవీ, అమెరికన్‌ కన్జ్యూమర్‌ ఒపీనియన్‌ ప్యానల్‌, బ్రాండ్‌ ఇన్‌స్టిట్యూట్‌ అండ్‌ చియావో సర్వీస్‌ ఇండియా తదితర సైట్లను సంప్రదించండి. ఇంకెందుకు ఆలస్యం ఈ రోజునుంచే నిర్ణీత పాయిం ట్లను సాధించడానికి ప్రయత్నించండి.


పెట్టుబడులపై నిఘా...
youthమీకు స్టాక్‌ మార్కెట్‌పై అవగాహన ఉందా, నెంబర్స్‌ మ్యాజిక్‌ చేయగలరా, ్రమశిక్షణతో ఎప్పటికప్పుడు మార్కెట్‌ను విశ్లేషణ చేయగలరా. అయితే ఇంట్లోనే కూర్చొని సులభంగా డబ్బు సంపాదించవచ్చు. ఇందు కోసం మొదటిగా డీమ్యాట్‌ ఖాతా ప్రారంభించాలి.లాభాలు సంపాదించాలంటే మార్కెట్‌ను బాగా అధ్యయ నం చేయాలి. పెట్టుబడులపై రోజూ నిఘా వేయాలి.ఏమరుపాటుగా ఉంటే కలల సౌధం కూలిపోతుంది.అందువల్ల పూర్తి అవగాహన ఉంటేనే వీటిల్లో పెట్టుబడి పెట్టండి.


గంటకు ఇంతని..
మనం చదువుకునే రోజుల్లో కాలక్షేపానికి నేర్చుకొన్న గణిత చిట్కాలనో, సంగీతమో, విదేశీ భాషో ఇప్పుడు సంపాదనకు ఉపయోగపడుతుంది. సాయంత్రాల్లోనో, వారాంతాల్లోనో ఈ అంశాలపై ట్యూషన్లు చెప్పి గంటకు ఇంతని సంపాదించండి. హైస్పీడ్‌ నెట్‌కనెక్షన్‌తో ఆన్‌లైన్‌ ట్యూషన్లూ చెప్పొచ్చు. ఇదేం కొత్తపద్ధతి కాదుకదా చాలా మంది పెద్దలు కూడా చదువుకునే రోజుల్లో ఇలానే ట్యూషన్లు చెప్పి పైకి వచ్చి నవారేనని ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి.


ఆన్‌లైన్‌లో అమ్మకాలు...
ఇది కొంచెం టెక్నిక్‌ ఉపయోగించి చేయాల్సినపని. ఎందుకంటే మంచి మంచి పెయంటింగ్స్‌ను ఎన్నుకొని వాటిని ఈ- కామర్స్‌ ద్వారా నెట్‌లో వేలానికి ఉంచాలి. ఇంకా ఇందులో ఎక్ట్రానిక్‌ వస్తువులు, పాత పుస్తకాలు, కార్లు, మోటార్‌ సైకిళ్ళు కూడా ఆన్‌లైన్‌లో అమ్ముకోవచ్చు. రిడీఫ్‌, ఐఆఫర్‌, అమె జాన్‌, ఈబే లాంటి సైట్లలో వేలానికి ఉంచండి. పేపాల్‌ అనే ఆన్‌లైన్‌ నిధుల బదిలీ సర్వీసుల ద్వారా మీకు చెల్లింపులు జరుగుతాయి. బదిలీలు చెల్లింపుల విషయంలో అప్రమత్తంగా ఉండడం అవసరం. అంతేకాకుండా వేలంలో మన వస్తువుకు తగ్గ రేటును సంపాదించుకోవడం పైనే మన తెలివితేటలన్నీ ఆధారపడి ఉంటాయన్న విషయం మర్చిపోకండి.


క్లిక్‌ చేయడం ద్వారా...
బ్లాగ్‌ అనగా మనసులోని భావ వ్యక్తీకరణకు, వాటిపై జరిగే చర్చకు ఓ వేదిక మాత్రమే కాదు. డబ్బు సంపాదించే మార్గం కూడా. బ్లాగింగ్‌లను డబ్బు సం పాదించే ప్రక్రియగా మార్చుకోండి. మీ బ్లాగు
లో వాణిజ్య ప్రకటనల కోసం గూగుల్‌ యాడ్‌సెన్స్‌, చిటికా తదితర ప్రకటన దారులతో భాగస్వామి కావ చ్చు. బ్లాగానుకూల ప్రకటనలు సంబంధిత కంపెనీ లు మీకు పంపుతాయి. క్లిక్‌ వంతునో, స్పందనను బట్టో డబ్బులు చెల్లిస్తాయి. ఖాళీ సమయాల్లో ఇలాం టివి చేయడం ద్వారా నెలకు రూ. 5,000లకు పైనే సంపాదించవచ్చు. ఒక్క రూపాయి దానం చేయడం నేర్పించేకన్నా రూపాయి సంపాదించడం నేర్పించ మన్నారు పెద్దలు. మీరు కూడా ఉన్నత చదువుల కోసం పట్టణాలకు, మహానగరాలకు వచ్చి చదుకునే టప్పుడు ఇలాంటి చిన్న చిన్న ఆదాయ మార్గాలను ఎంచుకోవడం ద్వారా మీ పాకెట్‌ మనీని సమకూర్చుకోవచ్చు.

No comments:

Post a Comment