Friday 16 December 2011

ఒకే ఒక ఆశ ...

ఒకే  ఒక  ఆశ ...
నను  నన్నుగా నిలిపే  ఆశ  ..
నా  తోడుని  జత  చేసే  ఆశ ...
నా  ఆశయం  నెరవేర్చే  ఆశ ...

ఏళ్ళకు  ఏళ్ళుగా  ఎదురుచూపులు  చూసి ,
ఎండమావులని  చవి  చూసి ...
కలగా  కరిగిపోతున్న  ఆశ ..
రేపు  ఉందని  ఊరించి ..
నిన్నటి  గాయాల్ని  మరిపించి ..
నడిరేయిలో  నను  నడిపిస్తున్న  ఆశ ..

ఆవేదనలని  అంతమొందించే  ఆశ ..
ఆనందాలకి  నాంది  పలికే  ఆశ ..
నిరాశ  కాకూడదు  నా  ఈ  ఆశ ..
నిర్జీవున్ని  చేయకూడదని  తలుస్తూ
 కోరే  నా చివరి  ఆశ ..
************
written by Me
at 10:25pm, 16.12.2011

No comments:

Post a Comment