Showing posts with label ప్రకృతి అందాలపై కవితలు. Show all posts
Showing posts with label ప్రకృతి అందాలపై కవితలు. Show all posts

Saturday, 3 November 2012

సీతాఫలం ఓ అమృత ఫలం..


సీతాఫలం ఓ అమృత ఫలం..
ఆరోగ్య ప్రధాయిని..ఔషధ గుణ దాయిని..
సకల రోగనివారిణి..సత్వర శక్తి సంధాయిని..
పేదవాడి ఆపిల్ పండుగా పేరుగాంచినది..
పెరటి మొక్కగా మన ఇంట నిల్చి యున్నది..
కరుకు గుండెల్లోని కన్నీటి జాలు కిది పోలిక..
మృదు మధుర రుచిలో ఆ తేనెకే సాటి వచ్చునిక..
******************************
written by BODDU MAHENDER
at 5:40pm 3.11.2012

Sunday, 14 October 2012

ప్రకృతే ఓ పాఠం..


పరిశీలిస్తే ప్రతి అణువూ ఓ గురు బోధే..
పరిశోధిస్తే ప్రతి తనువునా ఆ పరమాత్మే..
చదివే ఓపికుంటే, కాదా ప్రకృతే ఓ పాఠం..
నీవే గొప్ప అనుకుంటే, చెప్పదా గుణ పాఠం..
**************************
written by BODDU MAHENDER
at 12:06am 15.10.2012

Sunday, 29 July 2012

నీలి రంగు గులాబి..


సంకర వంగడమైనా
సంతోష చిహ్నం అది..
సకల వర్ణ జగతిలో
సాటి ప్రాథమిక వర్ణమది

ఆ రెండింటి కలయికే,
ఈ నీలి రంగు గులాబి..
నీ వాలు కన్నుల వన్నెలన్నీ
తన రెక్కలుగా చేసుకున్న గులాబి.. 

అందుకేనేమో..  
జంగిల్ బుక్ రాసిన చేత్తో..,
జనరంజక పద్యాలు రాయించింది.
జపనీస్ యానిమేషన్స్ లో
జనం మెచ్చే సీరియల్స్ చేయించింది..
ఇదిగి ఇప్పుడు నీ మెప్పుకై,
నాతో ఈ కవిత రాయించింది ..
*********************
written by ME
at 4:15am 30.7.2012

Sunday, 10 June 2012

జామ పండు


హాయ్ రే హాయ్..జామ పండు రో..
చిలకపచ్చ రంగులో ఇరుగకాసిన కాయరో...
గులాబి రంగు గుజ్జుతో నోరూరించే చూడరో..
పాట ఉరవడిలో ఇది పల్లవిరో..
కన్నె అందాలకి ఇది పోలికరో...
కవ్వించే గుణాల నాయికరో...
వగరు.. తీపి..రుచుల మేలు కలయికరో..
హాయ్ రే హాయ్..జామ పండు రో..

అమెరికా లో ఇది పుట్టెను రో.. అవని అంతా విస్తరించెను రో..
ఆకులైనా ఔషధమేరో..గాయాలైనా  మానునురో...
అతిసారం , క్యాన్సర్ల కైనా...ఈ ఫలమే చక్కని విరుగుడురో.....
హాయ్ రే హాయ్..జామ పండు రో..
********************************
written by ME
at 6:42am 11.6.2012

Sunday, 1 January 2012

మల్లె..సిరిమల్లె ..

మల్లె..సిరిమల్లె  ..
జాము రాతిరిలో జాజిమల్లె  ..
విరిసే...మురిసే ...
మోహంతో  మమ్ము 
మురిపించే , మైమరిపించే..
*****************
written by ME
at 11:29pm 7.11.2011




మల్లె ...బొండు మల్లె..
నీ వల్లే ..మాలో  మోహాలు అల్లే...
నీ పోదరిల్లె ...మదనుని  ఇల్లే...
అమ్మాయిల జడలే..నీ  లోగిల్లె ...
******************
written by ME
at 11:36pm 7.12.౨౦౧౧