Showing posts with label బాల గీతాలు. Show all posts
Showing posts with label బాల గీతాలు. Show all posts
Friday, 21 September 2012
Tuesday, 26 June 2012
తోము తోము తోము....
తోము తోము తోము
పొద్దు మాపు తోము..
పళ్ళన్నీ మెరిసేలా పౌడరేసి తోము..
తోము తోము తోము
ఓ పద్ధతిగా తోము...
ఫ్లోరైడులే తోలిగేలా పేస్టేసి తోము..
తోము తోము తోము
రోజు మరువక తోము..
చిగుళ్లన్నీగట్టిపడేలా వేప పుల్లేసి తోము..
ఏ సిరి లేదనే దిగులే వద్దురా..
32 ముత్యాలున్న దంత సిరి నీదిరా..
పాచి పట్టించి వాటిని కంపు కొట్టనీయకురా..
పలువరుస అందాలని మసక పోనీయకురా..
అందుకే
తోము తోము తోము
పొద్దు మాపు తోము..
************************
written by ME
at8:30am 27.6.2012
Wednesday, 20 June 2012
వల్ల వల్ల జిన్న..
హే.. వల్ల వల్ల జిన్న..వల్ల వల్ల జిన్న
నా చిట్టి అడుగులే నడక నేర్చేనంటా..
నా చిన్ని కలలే పరుగు తీసేనంటా..
హే.. వల్ల వల్ల జిన్న..వల్ల వల్ల జిన్న
నా ముద్దు పాదాలకే తొడుగు వేసేనంటా..
నా రేపటి భవితకే రక్ష అయ్యేనంటా...
హే.. వల్ల వల్ల జిన్న..వల్ల వల్ల జిన్న
నాన్నారికి నా నవ్వులే సిరివెన్నెలంటా..
మా అమ్మకి నా ముద్దులే విరితేనియలంటా..
హే.. వల్ల వల్ల జిన్న..వల్ల వల్ల జిన్న
************************
written by ME
at 12:35pm 20.6.2012
Saturday, 28 April 2012
ప్రేమించండి..నాన్నా..
అందం కాదు,అనురాగాన్ని చూడండి నాన్నా ..!!
మీ పై పెంచుకున్న మా మమకారాన్ని చూడండి
మమ్ము కన్న దైవాలే కర్కశంగా చూస్తుంటే
కందిపోతున్న మా మనసులని చూడండి..
అన్నీ ఉన్న అనాధలని చేయకండి నాన్నా..!!
ఆత్మీయంగా మీ ఒడిని చేరనివ్వండి.
దూరమైన మా కలల్ని మళ్ళీ దగ్గరికి చేర్చండి..
భారమైన మా హృదయాల బరువు దించండి..
ప్రేమించండి..నాన్నా..ప్రేమని పంచండి.
నలిగిన ఈ పసి గుండెకి ఓ నవ్వుని చూపండి..
వివక్షతో, కసిరిన ఈ రూపానికి ఓ ఓదార్పు నివ్వండి..
******************************
written by ME
at 8:45am 28.4.2012
Monday, 5 December 2011
వేసవి సెలవులు
వచ్చేశాయి వచ్చేశాయి..
వేసవి సెలవులు వచ్చేశాయి..
తెచ్చేశాయి తెచ్చేశాయి ..
ఆట విడుపులను తెచ్చేశాయి...
చదువు సంధ్యలతో అలిసిన మనసులకి..
ఆటా పాటలంటూ ఆహ్లాదాన్ని తెచ్చేశాయి..
పరీక్షలూ ఫలితాలని కుస్తీ పడిన ..
మా మెదళ్ళకి , హాయిగా విరామాన్ని ఇచ్చేశాయి..
పల్లెల్లోకి వెళ్లి ప్రకృతిని చూడమని ..
అభిరుచులకు మెరుగులు దిద్దమని..
తోటి వారికి సాయం చేస్తూ ..
ఉత్తమ పౌరులుగా ఎదగమని..
చక్కని సమయం ఇచ్చేశాయి ..
చల్లగా మా మనసు దోచేశాయి .....
వచ్చేశాయి వచ్చేశాయి..
వేసవి సెలవులు వచ్చేశాయి.. *********************************
written by ME
at 9am, 2.4.2011
*********************************
ఈ బాల గీతం వార్త పేపర్ "మొగ్గ " శీర్షిక లో
11 .4.2011 నాడు ప్రచురితమైనది ..
వేసవి సెలవులు వచ్చేశాయి..
తెచ్చేశాయి తెచ్చేశాయి ..
ఆట విడుపులను తెచ్చేశాయి...
చదువు సంధ్యలతో అలిసిన మనసులకి..
ఆటా పాటలంటూ ఆహ్లాదాన్ని తెచ్చేశాయి..
పరీక్షలూ ఫలితాలని కుస్తీ పడిన ..
మా మెదళ్ళకి , హాయిగా విరామాన్ని ఇచ్చేశాయి..
పల్లెల్లోకి వెళ్లి ప్రకృతిని చూడమని ..
అభిరుచులకు మెరుగులు దిద్దమని..
తోటి వారికి సాయం చేస్తూ ..
ఉత్తమ పౌరులుగా ఎదగమని..
చక్కని సమయం ఇచ్చేశాయి ..
చల్లగా మా మనసు దోచేశాయి .....
వచ్చేశాయి వచ్చేశాయి..
వేసవి సెలవులు వచ్చేశాయి.. *********************************
written by ME
at 9am, 2.4.2011
*********************************
ఈ బాల గీతం వార్త పేపర్ "మొగ్గ " శీర్షిక లో
11 .4.2011 నాడు ప్రచురితమైనది ..
Saturday, 3 December 2011
విద్యార్థులం మేం విద్యార్థులం ....
విద్యార్థులం మేం విద్యార్థులం
భావి భారత దేశ నిర్మాతలం
అజ్ఞాన తిమిరం లో అల్లాడే లోకానికి
విజ్ఞాన కాంతుల నివ్వగల చిరు జ్యోతులం
శాస్త్రాలు, సంస్కృతులు ఇష్టంగా నేర్చుకొని
చారిత్రక ఔన్నత్యాన్ని నిలిపే దేశ వారసులం..
రేపటి పౌరులం
ఆటలూ పాటలూ , సకల కళా రంగాల్లో
మేలైన ప్రతిభతో ఘనమైన కీర్తిని
ఆర్జించగల అపర శూరులం ..మహా వీరులం
కులాలు మతాలు కుళ్ళు రాజకీయాల్ని విడిచి
ఐక్యంగా సఖ్యంగా ,మానవతే ముఖ్యంగా
మెలిగే తరాలకి వారధులం ..
నవ సమాజ రథ సారథులం
విద్యార్థులం మేం విద్యార్థులం
*************************
written by ME,
at 1 :45 pm 9 .2 .2011
***********************************ఈ బాల గీతం వార్త పేపర్ మొగ్గ శీర్షిక లో
27.2.2011 నాడు ప్రచురించబడింది ..
Tuesday, 29 November 2011
ఆడేద్దాం ..పాడేద్దాం....
జారుడు బండ జారేద్దాంతొక్కుడు బిళ్ళ ఆడేద్దాం ..
దాగుడు మూతలు దండా కోర్ ..
పక్కోడి బలపం చేసెయ్ చోర్ ..
చిప్పలు చెప్పులుగా చేసేద్దాం ..
కుండలు డప్పులుగా మార్చేద్దాం ..
సినిమాల్ గిన్మాల్ ఛి ఛి బోర్ ..
కార్టూన్ చానల్స్ దేఖో యార్ ..
సిర్ర గోన తో ఆడేద్దాం..
చీకు పుల్లలు విసిరేద్దాం ..
రాయి రాయి పెడితే లగోర్..
పిల్ల కాలవలో మన పడవదే జోర్ ...
కోతి కొమ్మచ్చి ఆడేద్దాం..
మర్రి ఊడలతో ఊగేద్దాం ..
Tutions అంటే వెంటనే పరార్ .
Toys ,games కి ఇప్పుడే షికార్ ..
************************************
Written by ME,
at 6:26pm, 14.11.2011.
************************************
Childhood is about innocence and playfulness..It is about Joy and Freedom..
Happy Happy Evening..
My Dear Friends..
Happy Happy childrens day..
Subscribe to:
Posts (Atom)




