Showing posts with label పేరడీ పాటలు ... Show all posts
Showing posts with label పేరడీ పాటలు ... Show all posts

Monday, 25 June 2012

నువ్వా నేనా సినిమాలోని "హే వయ్యారి బ్లాక్ బెర్రీ ఫోనులే "అనే పాటకి పేరడీ


సర్రా.. సర్రా…సర్రా.. సర్రా..
హే… అయ్యారే నాటుకోడి పుంజు లే..
వారేవా దీని రుచి రంజు లే..
హే… అయ్యారే నాటుకోడి పుంజు లే..
వారేవా దీని రుచి రంజు లే..
థోడా థోడా థోడా ఉడికింది బాగా
తుక్ డా తుక్ డా తుక్ డా
ఆడ మగ తేడా లేకుండా  కుమ్ముతారు దీని కూర
సర్రా ఓ మేరా దిల్ లుట గయీ ...
సర్రా ఓ మేరా దిల్ లుట గయీ ...
సర్రా ఓ మేరా దిల్ లుట గయీ ...
సర్రా ఓ మేరా దిల్ లుట గయీ ...
లుట గయీ ...
ఓ మేరా దిల్ లుట గయీ ...


హే ఫైవ్ స్టార్ రేంజ్ కట్టే బిల్లు తెలిసెనే...
ఈ పల్లె పక్షి ముక్క రుచి ఎరుగనే..
హే..బిర్యాని ఎంత తిన్నా మొహం మొత్తదే..
ఈ పులుసు వండుకుంటే నోరు ఆగదే..
కొంచెం గట్టిగుండులే..కొంచెం మెత్తగుండులే..
బాగా ఉడకబెట్టాలే..గరం మసాలెయ్యాలే..
లాక్కోలేక.. పీక్కోలేక..కొర్క లేక పళ్ళ నొప్పి లే..
సర్రా ఓ మేరా దిల్ లుట గయీ ...
సర్రా ఓ మేరా దిల్ లుట గయీ ...
సర్రా ఓ మేరా దిల్ లుట గయీ ...
సర్రా ఓ మేరా దిల్ లుట గయీ ...
అయ్యారే నాటుకోడి పుంజు లే..
వారేవా దీని రుచి రంజు లే..


హే..తెల్ల కోడి..బాయిలర్ని కాలదన్నెనే..

పందెం కోడిగ ఇది పుష్టిగుండునే..
హే..కడుపు కాలి కంచమడితే..ఖాళీ ఉండదే..

అరగకుండా తిరగబెడితే దొడ్డి దారేలే..
కొంచెం కొవ్వు పెరుగునే..కొంచెం కండ ఎదుగునే..
కొంచెం వాతం అవ్వునే....కొంచెం వాటం అవ్వునే..
ఆపలేక ఓపలేక జుర్రుకుంటూ నోట్లో కుక్కేవు  లే.
సర్రా.. సర్రా…సర్రా.. సర్రా..
సర్రా ఓ మేరా దిల్ లుట గయీ ...(8)
******************************
written by ME
at 6:56am 26.6.2012

Monday, 11 June 2012

"ఖుషి "సినిమా లోని "ఆడువారి మాటలకి అర్థాలే వేరులే "అనే పాటకి పేరడీ


మగవారి చేష్టలకు అర్థాలే వేరులే..
మగవారి చేష్టలకు అర్థాలే వేరులే..
అర్థాలే వేరులే..అర్థాలే వేరులే..
అర్థాలే వేరులే..అర్థాలే వేరులే..
మగవారి చేష్టలకు అర్థాలే వేరులే..
మగవారి చేష్టలకు అర్థాలే వేరులే..

కసిరి విసిరి కొట్టినచో బాసు చేత బాధితుడే..
కసిరి విసిరి కొట్టినచో బాసు చేత బాధితుడే..
తనలో తానే ఏడ్చినచో ప్రేమ కోరే తాపసిలే..
తనలో తానే ఏడ్చినచో ప్రేమ కోరే తాపసిలే..

మగవారి చేష్టలకు అర్థాలే వేరులే..
మగవారి చేష్టలకు అర్థాలే వేరులే..


మునిగా మౌనిగా మారినచో భార్య వలన పీడితుడే..
మునిగా మౌనిగా మారినచో భార్య వలన పీడితుడే..
మనసు వయసు మాటలనినా సృష్టినేలే రసికుడే..
మనసు వయసు మాటలనినా సృష్టినేలే రసికుడే..
మగవారి చేష్టలకు అర్థాలే వేరులే..
మగవారి చేష్టలకు అర్థాలే వేరులే..
*******************************
written by ME
at 8:48am 12.6.2012

Friday, 8 June 2012

"గోలీమార్ "సినిమాలోని "మగాళ్ళు ఒట్టి మాయగాల్లె "అనే పాటకి పేరడీ

ఆడోళ్ళు ఒట్టి తింగరొళ్ళే...
డబ్బుంటే చాలులే అంటారే...
హార్టిస్తే హ్యాండిచ్చి పోతారే...
ఈమె కూడ ఇంతే..

ఆడోళ్ళు ఒట్టి తింగరొళ్ళే...
డబ్బుంటే చాలులే అంటారే...
హార్టిస్తే హ్యాండిచ్చి పోతారే...
ఈమె కూడ ఇంతే..

ఆడోళ్ళ ఒళ్లంతా మేకప్ అంతే
కాసిన్ని నీళ్ళు పోస్తే పోతదంతే..
ఆడోళ్ళ ప్రేమ బల్లి తోక లాంటిదంతే..
ఈమె కూడ ఇంతే..

ఆడోళ్ళు ఒట్టి తింగరొళ్ళే...
డబ్బుంటే చాలులే అంటారే...
హార్టిస్తే హ్యాండిచ్చి పోతారే...
ఈమె కూడ ఇంతే..

కాసింత రొమాన్సు కోరుకుంటాం...కూసింత లవ్ చేస్తే చాలు అంటాం..
కాసింత రొమాన్సు కోరుకుంటాం...కూసింత లవ్ చేస్తే చాలు అంటాం
ఆడోళ్ళ క్రేజెంటో.. ఫోజెంటో...రేంజెంటో..యేజెంటో..ఏమో ఏంటో..
మీరు కోరినన్ని గిఫ్టు లిచ్చినా..ఓ కోటి దాకా అప్పు చేసినా..
మీరింతే... ఛీ ఛీ ఈమె కూడా ఇంతే

వీలుంటే కోటలే కట్టియిస్తాం..లేకుంటే కాళ్ళనే పట్టుకుంటాం..
వీలుంటే కోటలే కట్టియిస్తాం..లేకుంటే కాళ్ళనే పట్టుకుంటాం..
ఆడోళ్ళ ట్రిక్కేంటో..కిక్కేంటో...తిక్కేంటో...లెక్కేంటో...ఏమో ఏంటో...
అడ్డమైన సేవలు ఎన్ని చేసినా..మీకోసమని ప్రాణం ఇచ్చినా..
మీరింతే... ఛీ ఛీ ఈమె కూడా ఇంతే

ఆడోళ్ళు ఒట్టి తింగరొళ్ళే...
డబ్బుంటే చాలులే అంటారే...
హార్టిస్తే హ్యాండిచ్చి పోతారే...
ఈమె కూడ ఇంతే.
**************
written by ME
at 6:24pm 8.6.2012

Wednesday, 6 June 2012

"మాయాబజారు "సినిమాలోని "అహ నా పెళ్ళంట "అనే పాటకి పేరడీ

అహ నా ప్రేమ యంట.. ఓహో నా ప్రేమ యంట..
అహ నా ప్రేమంట.. ఓహో నా ప్రేమంట..
నువ్వు నేను కెవ్వంట ..లోకమంతా నవ్వంట
టాం టాం టాం


అతిలోక  సుందరంట....అర యించే మేకప్ అంట...
ప్యారు ప్యారు మంటూ నన్ను చేర వచ్చే నంట...
అతిలోక  సుందరంట....అర యించే మేకప్ అంట...
ప్యారు ప్యారు మంటూ నన్ను చేర వచ్చే నంట...
అబ్బబ్బబ్బబ్బబ్బో...


అహ నా ప్రేమ యంట.. ఓహో నా ప్రేమ యంట..
అహ నా ప్రేమంట.. ఓహో నా ప్రేమంట..
నువ్వు నేను కెవ్వంట ..లోకమంతా నవ్వంట
టాం టాం టాం


చాలా మంచోడి నంట..బాగా పేరున్న దంట...
చాలా మంచోడి నంట..బాగా పేరున్న దంట...
నేము, ఫేము, స్టైలు చూసి నాకే  ఫిక్స్ అయ్యేనంట..
అయ్యయ్యయ్యయ్యయ్యో ...ఆహాహా


అహ నా ప్రేమ యంట.. ఓహో నా ప్రేమ యంట..
అహ నా ప్రేమంట.. ఓహో నా ప్రేమంట..
నువ్వు నేను కెవ్వంట ..లోకమంతా నవ్వంట
టాం టాం టాం

ముద్దులివ్వ వచ్చెనంట...షాపుల వెంట తిప్పేనంట....
పాద నిదపమ - మాప దపమగ
ముద్దులివ్వ వచ్చెనంట...
పపప్పాద - మమమ్మాప - గగగ్గామ - రిగమప
ముద్దులివ్వ వచ్చెనంట...
తథోం ధోం ధోంత - తధీం ధీం ధీంత
తంధోత తధీంత అటు తంతాం
ఇటు తంతాం తంతాం తంతాం తంతాం సనిపదపమగరిస
ముద్దులివ్వ వచ్చెనంట...షాపుల వెంట తిప్పేనంట...
బిల్లులన్నీ నెత్తి నెట్టి తుర్రు మంటూ జారేనంట..
అహహ్హహ్హహ్హహ్హ
************************************

written by ME
at 9:20am 6.6.2012

Sunday, 3 June 2012

"పంజా "సినిమాలోని "నీ చుర చుర చుర చూపులే పంజా "అనే పాటకి పేరడీ..


హే..మిల మిల మిల మెరిసే ముంజా..
తళ తళ తళ తాటీ ముంజా..
తెలతెల్లని మంచులా ముంజా..
చలచల్లని ముద్దలా ముంజా..
కల్తెరుగని కాయనే ముంజా..
కమ్మని చిన బొండమే ముంజా..
మధుమేహపు మందుగా ముంజా..
ఉద్రేకపు అదుపుగా ముంజా..
రూపములో కొబ్బరిలా
ఎదిగిన చెట్టుకు కాసిన పండా...
వేసవిలో తాపములే
తీర్చగ వచ్చిన తీయని బోండా...
చలువేలే ఈ ముంజా..
ఇది దొరికేను...తాటికల్లు కన్న మిన్నగా...
చవకేలే ఈ ముంజా..
రుచి చూడాలి...వనమిచ్చిన వంటల నైవేద్యంగా..

చలువేలే ఈ ముంజా..
ఇది దొరికేను...తాటికల్లు కన్న మిన్నగా...
చవకేలే ఈ ముంజా..
రుచి చూడాలి...వనమిచ్చిన వంటల నైవేద్యంగా..

**********************
written by ME
at 9:52am 4.6.2012

నీరాజనం సినిమాలోని "నిను చూడక నేనుండలేను "అనే పాటకి పేరడీ


ఆ... ఆహాహా... ||2||
ఓహో... ఓహో... ఓహో...
 టి.వి. చూడక నేనుండలేను ||2||
T ఛానలో మరి జీ(z) ఛానలో  ||2||
అది ఏ భాషధైనా అలానే 
 టి.వి. చూడక నేనుండలేను ||2||
ఓహోహో.. ఆహాహా.. ఆహాహా.. ఓహోహో..
అహాహా.. ఓహోహో.. ఓహోహో.. ఆహాహా..

చరణం 1
ఏ బ్రేకింగుల న్యూస్ ఒచ్చినా
నా పనులన్నీ ఆపేస్తిని...
ఏ షాకింగుల ట్విస్ట్ ఇచ్చినా
ఆ సీరియల్ కై పడిగాస్తిని...
ఈ ఒక టి.వి.లో ఎన్ని సెన్సేషనో ||2||
 టి.వి. చూడక నేనుండలేను ||2||
T ఛానలో మరి జీ(z) ఛానలో  ||2||
అది ఏ భాషధైనా అలానే 
 టి.వి. చూడక నేనుండలేను ||2||

చరణం 2
ఓహోహో.. ఆహాహా.. ఆహాహా.. ఓహోహో..
ఓహోహో.. ఆహాహా.. ఆహాహా.. ఓహోహో..
ఏ టాలెంటుతో నువ్వొచ్చినా..
హై ఫోకస్ తో లైఫ్ ఇచ్చును..
బుల్లి తెర యని చిన చేసినా..
వెండి తెరలానే యేమార్చును...
తన ప్రతి కల్పనా..మన యెద దోచెనా..
టి.వి. చూడక నేనుండలేను ||4||
***********************
written by ME
at 10:32pm 3.6.2012

Tuesday, 29 May 2012

"లక్ష్మీ నివాసం" చిత్రంలోని " ధనమేరా అన్నిటికి మూలం" అనే పాటకి పేరడీ


చదువేరా ఉన్నతికి మార్గం 
ఆ చదువు విలువ తెలుసుకొనుట మానవ ధర్మం 
చదువేరా ఉన్నతికి మార్గం 
ఆ చదువు విలువ తెలుసుకొనుట మానవ ధర్మం 
చదువేరా ఉన్నతికి మార్గం 

చదువునే దేవతయని పూజించుమురా...
చదివి నీవే విజ్ఞానము ఆర్జించుమురా..
చదువునే దేవతయని పూజించుమురా...
చదివి నీవే విజ్ఞానము ఆర్జించుమురా..
చదువుకొని ఇతరులకి నేర్పినవాడే 
చదువుకొని ఇతరులకి నేర్పినవాడే 
ఆత్మీయుడు..ఆరాధ్యుడు..ఆచార్యుడురా..
చదువేరా ఉన్నతికి మార్గం 

శ్రద్ధ చూపి పట్టుదలగా పఠియించుమురా..
పాఠమంతా అన్వయిస్తూ ప్రతిభ పెంచరా..
కఠినమైనా సులభమవు సాధన చేస్తే.. 
కఠినమైనా సులభమవు సాధన చేస్తే.. 

అయ్యో.. ఒత్తిడితో చనిపోరు ఇది తెలుసుకుంటే..
చదువేరా ఉన్నతికి మార్గం 


శాస్త్రజ్ఞుడి మేధస్సులో చదువున్నదిరా..
సర్వజ్ఞుడి కీర్తిలో చదువున్నదిరా..
విద్యార్థికి పాఠశాలే కోవెల రూపం..
అజ్ఞానమును విడువకుంటే కలగదు మోక్షం..

చదువేరా ఉన్నతికి మార్గం 
ఆ చదువు విలువ తెలుసుకొనుట మానవ ధర్మం 
చదువేరా ఉన్నతికి మార్గం 
**************************
written by ME
at 10:42am 30.5.2012


Monday, 28 May 2012

బిజినెస్ మ్యాన్ సినిమాలోని "సారోస్తారోస్తారే..."అనే పాటకి పేరడీ..


అతడు :
ప్రేమిస్తే తప్పేనా...తప్పూ..తప్పూ..తప్పేనా..
నీతోనే నేనంటే వద్దూ వద్దనకే..
ప్రేమిస్తే తప్పేనా...తప్పూ..తప్పూ..తప్పేనా..
నీతోనే నేనంటే వద్దూ వద్దనకే..

ఆమె :
రోజ్  పువ్వు తీసుకొస్తే లవ్వు అంటానా..
గోల్డ్ రింగు చాన్సులన్నీ మిస్సు చేస్తానా..
ప్రేమిస్తే తప్పేలే..ప్రేమిస్తే తప్పేలే..
ప్రేమలేఖ రాసుకొస్తే యస్సు అంటానా..
ఫోర్డు కారు ఆశలన్నీ తుస్సు చేస్తానా..

బాగా డబ్బు చూసి వేసినావు వల 
ఎక్కేందుకే బెంజి కారు కల 
నీ ఊరు తిరుమల 
రోడ్డు ఇరుకుల 
దిల్ సే క్షమా భోళా...

అతడు :
ప్రేమిస్తే తప్పేనా...తప్పూ..తప్పూ..తప్పేనా..
నీతోనే నేనంటే వద్దూ వద్దనకే..
ప్రేమిస్తే తప్పేనా...తప్పూ..తప్పూ..తప్పేనా..
నీతోనే నేనంటే వద్దూ వద్దనకే..

కోరస్ :
వేరే దేశం ...పోరా..పోరా..
మస్తుగ  పైసా.. తేరా..తేరా..
అప్పుడే అంటది..వీరా..వీరా..
ముద్దుగ  నవ్వుతు... ప్యారా..ప్యారా..

ఏహే ...చేస్తుందే..లవ్వూ..గివ్వూ..చేస్తుందే...
**************************
written by ME
at 5:35pm 28.5.2012

Friday, 25 May 2012

పెళ్లి సందడి సినిమాలోని "రమ్యకృష్ణ లాగా ఉంటదా "అనే పాటకి పేరడీ పాట


సాకి:
ఈ గ్యాంగుకి హెడ్ అయినందుకు...
నీకు పిల్ల(GF) ని వెతికే బాధ్యత నాది....
ఓరి ప్రేమార్ది..
నీ తవికలు మెచ్చిన చిన్నది ఎవరది..?
ఎలా ఉంటది..??


పల్లవి: 
కొండముచ్చులాగా ఉంటదా...
చెప్పర కన్నా..చెప్పర నాన్నా...
కోతిలాగా తోక ఉంటదా..
చెప్పర కన్నా..చెప్పర నాన్నా...
పర్పులు ..ప్రభాసు టేస్ట్ ఉందా..
తింగరి.. తిక్కల నేచరుందా...??
చెప్పకుంటే ఆమె ఫేసు ఎట్ల సెర్చ్ చేయనురా..
కొండముచ్చులాగా ఉంటదా...చెప్పర కన్నా..చెప్పర నాన్నా..


చరణం :
ఏడున్నర రాగంలో ... ఎంకి పాటలే పాడే వేముల రామక్కా       
ఫ్లాప్ సూప్ సాంగులకి ...వెర్రి మొర్రి స్టెప్పు లేసే గుండూ మైసమ్మా 
వాటమైన రూపం తోటి.. వణుకు తెచ్చే వర్షానా..
పారాహుషార్ అనిపించే....పాములోల్ల పుష్పానా...
నీ మనసుని గుచ్చుకుంది..మహితా మాయలేడా..?
నీ పర్సు దోచింది..పాకీజా....
సత్యభామ లాంటి పొగరుబోతా..
సక్కుబాయి లాంటి వదరుబోతా...
బాలికా..కాళికా పోలికేనా..???
చెప్పరా..నాయనా..భూత భామినా..?? 
ఒక్క ముక్క చెప్పు చాలు..ఒలుకుతుంది ప్రేమ పాలు...
కొండముచ్చులాగా ఉంటదా...చెప్పర కన్నా..చెప్పర నాన్నా...
కోతిలాగా తోక ఉంటదా..చెప్పర కన్నా..చెప్పర నాన్నా...
***********************************
written by ME
at 1:15pm 25.5.2012

Monday, 21 May 2012

గబ్బర్ సింగ్ సినిమాలోని "మందు బాబులం" అనే పాటకి పేరడీ పాట


బ్రహ్మచారులం మేము బ్రహ్మచారులం..
భార్యా... బాధల్లేని మేమే బ్రహ్మ జ్ఞానులం..

బ్రహ్మచారులం మేము బ్రహ్మచారులం..
భార్యాబాధల్లేని మేమే బ్రహ్మ జ్ఞానులం..

గల్సు తోని ప్యారంటాం..గ్యాంగు తోని బారంటాం..
గల్లీలన్నీ చుట్టేసి మేమేలే టాపంటాం 

పెళ్ళయితే పెళ్ళానికి చులకన...
పేద్ద...కట్నాలు ఇస్తుందని గనకన..

హే...సింగిలైతే బాదర బందీ లేదన్నా..
జాబ్..సెటిలైతే..మనీమజా నీదన్నా...

ఓ బ్యాచిలరే రాములోరి రక్షణ..
ఈ బ్యాచిలరు మీ అల్లరికి శిక్షణ..శిక్షణ 

బ్రహ్మచారులం మేము బ్రహ్మచారులం..
భార్యాబాధల్లేని మేమే బ్రహ్మ జ్ఞానులం..

గల్సు తోని ప్యారంటాం..గ్యాంగు తోని బారంటాం..
గల్లీలన్నీ చుట్టేసి మేమేలే టాపంటాం 
****************************
written by BODDU MAHENDER
at 8:15am 22.5.2012

ఈ  పాట " నమస్తే తెలంగాణా "దినపత్రిక  లోని మీ ఫీచర్స్  అనే ప్రత్యేక పేజీలో 26.5.2012నాడు ప్రచురితమైనది...

Thursday, 17 May 2012

‘టక్కరిదొంగ’ చిత్రంలో ‘నలుగురికీ నచ్చినది’ పాటకు పేరడీ

పల్లవి :
నలుగురికీ నచ్చినది ఆర్టీసీకే నచ్చదురో!
నరులెవరూ నడవనిది ఆ రూట్లో అది నడుచునురో!
బస్సని కొందరు అన్నా... అది మాత్రం కాదు నిజం
తుస్సున గాలే పోతే తెలిసొచ్చును అసలు నిజం...
బస్సు స్టాపులు ఒకవైపు బస్సులు ఒకవైపు
టైమ్‌ టేబులంటూ లేదు ప్రతి బస్సు యమలేటు నలుగురికీ

చ షార్ట్‌ రూట్‌లో బస్సు నడపడం నథింగ్‌ స్పెషల్‌ 2
చుట్టు తిప్పుతూ సిటీ చూపడం సంథింగ్‌ స్పెషల్‌
ఎంసెట్‌లో ర్యాంకు పొందటం నథింగ్‌ స్పెషల్‌ 2
సిటీ బస్సులో సీటు పొందటం సంథింగ్‌ స్పెషల్‌
చైను లాగితే ట్రైను ఆగడం నథింగ్‌ స్పెషల్‌ 2
స్టాపు వచ్చినా ఆగనిది ఈ బస్సు స్పెషల్‌ నలుగురికీ

- బొడ్డు మహేందర్

గబ్బర్ సింగ్ సినిమా లో కెవ్వుకేక పాటకి పేరడీ పాట..

కెవ్వు..
బ్యాగులో బుక్సెట్టుకొని 
సిన్మా టిక్కెట్సు కొని..
పొద్దున్నే నేనెళుతుంటే 
కెవ్వు కేక...మా ఇల్లంతా..కెవ్వుకేక..

రోజా పూలెట్టుకొని...
రోజో సెంట్  కొట్టుకొని..
గల్సెంట(గర్ల్స్ వెంట) నేనెళుతుంటే 
కెవ్వు కేక...మా ఫ్రెండ్సంతా...కెవ్వు కేక..

ఉరకలయ్యి పారుతోంది..నాలో జోరు..
ఉడుకు నెత్తురే చేసే..లోన హుషారు..
నా పేరు దేవదాసు...నా తీరు టైం పాసు..
నువ్వు పేకముక్క ఆటకొస్తే...
చిల్లి గవ్వ  దోచేస్తా..
కెవ్వు కేక...ఓ పోకిరోడా..కెవ్వు కేక..
కెవ్వుకేక...ఓరి కేటుగాడా..కెవ్వుకేక..
కెవ్వు కేక...ఓ పోకిరోడా..కెవ్వు కేక..
కెవ్వుకేక...ఓరి కేటుగాడా..కెవ్వుకేక..

నీ పర్సె  నా బ్యాంకు..
దాని పైనే నా లుక్కు..
అల్సిపోయి పన్నావంటే..
ఆ పన్నానంటే..
కెవ్వుకేక..ఓ తింగరోడా..కెవ్వుకేక..
నీ సెల్లులోని టాక్ టైం తో..
గల్లి పోరికి కాల్ జేసి..
నీ పేరున  లింకెట్టేస్తే...
ఆ  లింకెట్టేస్తే...
కెవ్వుకేక..  సోమరోడా ..కెవ్వుకేక..
నా చిన్ని బోజ్జకే ఆకలి హెచ్చు.. కెవ్వుకేక..
నువ్వొచ్చి హోటల్లో బిల్లే కట్టు..కెవ్వుకేక...

నే చెప్పిందీ కొంచెము..
మీరు ఇస్తే సమ్ లంచము..
మా మాథ్స్ సార్ కి దక్షిణిచ్చి ఐపోతా నే టాపరు..
కెవ్వుకేక..ఓ మోసగాడా..కెవ్వుకేక..
కెవ్వుకేక..ఓరి సచ్చినోడా...కెవ్వుకేక..
*************************
written by BODDU MAHENDER
at 3:05pm 14.5.2012

Tuesday, 8 May 2012

స్నేహితుడు సినిమా లో "మన ఫ్రెండల్లె ఇంకెవరుంటారు" అనే పాటకి పేరడీ..


మన బుజ్జల్లె ఇంకెవరుంటారు..?
కోతులన్నింటిలో తానొకతేం కాదు..
కోతిలానే ఉన్నా ఆమే..
కొండముచ్చుగా ఎందుకు మారిపోయింది..
మన కోతుల్లో కొండంగే ఆమే..
మరి కోకోనట్స్ ఎందుకు వద్దంటోంది ..

మామిడి చెట్టూ ఎక్కేస్తోంది..
మజా జ్యూసుగా చేసి జుర్రేస్తోంది...
కొండలు కోనలు తిరగేస్తోంది..
ఈ ఎండల వేడికి  తాళ లేనంది..

తన అందము అద్భుతమంటూ 
తెగ క్రీములు పూసేస్తోంది..
తన వర్ణం తెలుపని అంటూ
యమ సిగ్గులు ఒలికేస్తోంది...

మిస్ వరల్దే తానయి నట్టూ 
బ్యూటి టిప్సే మనకి చెప్తోంది..
డైటు రూల్సేన్నో పెట్టే తాను  
ఓ గజమై ఇప్పుడు వచ్చేసింది..

మన బుజ్జల్లె ఇంకెవరుంటారు..?
కోతులన్నింటిలో తానొకతేం కాదు..
కోతిలానే ఉన్నా ఆమే..
కొండముచ్చుగా ఎందుకు మారిపోయింది..
మన కోతుల్లో కొండంగే ఆమే..
మరి కోకోనట్స్ ఎందుకు వద్దంటోంది ..
******************************
written by me 
1:45pm 8.5.2012 

Monday, 26 December 2011

పంజా సినిమా లోని "ఎలా ఎలా ఎలా ఎలా" అనే పాటకి పేరడీ

 ఎలా ఎలా ఎలా ఎలా నాలో కళ చూపేదెలా..??
సిన్మాలలో లిరి సిస్టులా...నాకో పేరూ వచ్చేదెలా..??
ఈ బ్లాగునే  వాడేది ఎలా...
నా స్కిల్స్ ని చూపేదెలా ..
ఈ నెట్టు యూజింగ్ లో పొందా ఛాన్సు కలలా ...
                                                    "ఎలా ఎలా ఎలా ఎలా"



                                                          

Sunday, 25 December 2011

" జర్నీ " లోని " మేఘమా నీలి మేఘమా " పాటకి పేరడీ :

ఇటీవల విడుదలైన తమిళ్ డబ్బింగ్ సినిమా " జర్నీ " లోని " మేఘమా నీలి మేఘమా " పాటకి పేరడీ :

స్నేహమా స్నేహ గంధమా .
ఎదురు చూశా.. నీ తీపి చెల్మికే ..
బింబమా..నా ప్రతి బింబమా ..
వెంటనడిచే నా తోడు నీడవే..

కల్సి పుట్టలా ..కులమడగలా..
డాబు చూపలా..కల్సే ఇలా ..
ఈర్ష్య చూపలా ...స్వార్ధమెరగలా..
సాయం కోరలా ..వెన్నుతట్టే ఇలా ..
ఓ ..నేస్తమా..నేస్తమా ,,
ఎదురు చూసానే ..
" స్నేహమా స్నేహ గంధమా ."

చరణం :
గోళీల ఆటల్లో ..దాగుడు మూతల్లో ..
చిచ్చర అల్లర్లో ..చిందేసే వేళల్లో ..
బదికేల్లె దారుల్లో ..బజారు సందుల్లో ..
వచ్చావు వెన్నంటూ ఉంటూనే..
హొంవర్క్ రాతల్లో ..క్లాస్ రూము డౌట్లల్లో...
సరదాల టూరుల్లో..సగపాలు తిండ్లల్లో..
అంగిట్లో ..అంగట్లో ..ఉన్నావు అన్నిట్లో ..
కలిసాము ఈ బడి ముంగిట్లో ..
తలరాతో ..విధిరాతో ఈ జన్మలో ..
నీ మిత్రుడనే అయ్యాను లైఫ్ లో
నే ఎదురు చూసానే ఈ మైత్రి ప్రేమకి ..
బింబమా నా ప్రతి బింబమా
వెంట నడిచే నా తోడు నీడవే ..

కాలేజి రోజుల్లో ..కవ్వించే ప్రేమల్లో ..
కిక్కెక్కే పార్టీల్లో..కిలాడి వేషాల్లో
ఎగ్జాము టెన్షన్లో ..ఎంట్రన్స్ ల వర్రీలో..
గైడ్ గా మంచేదో చెప్తూనే..
బాధల భారాల్లో ..కన్నీటి ధారల్లో ..
అప్పుల తిప్పల్లో ..గుండాల ముప్పుల్లో
కష్టాల్లో ,నష్టాల్లో ..నా ప్రతి ఇష్టాల్లో..
నన్నీ వీడలే దెప్పుడూ..
నీ ఋణం తీర్చలేను నేనెప్పుడూ .
నీ పేరునే వినిపించే గుండె చప్పుడు ..
నే ఎదురు చూసానే ఈ మైత్రి ప్రేమకి ..
" స్నేహమా స్నేహ గంధమా ."
*****************************************************
written by ME
at 10:30am 26.12.2011

Saturday, 17 December 2011

శివ సినిమాలోని " బోటనీ పాటముంది " అనే పాటకి రాసిన పేరడీ :

రాయల్ స్టాగ్ విస్కీ ఉంది 
ఓల్డ్ మంక్ రమ్ము ఉంది 
ఏ డ్రింకు తాగుదామురా ..
కోకైను పౌడర్ ఉంది 

గంజాయి చుట్ట ఉంది 
ఏ మత్తులో తూలుదామురా ..
విస్కీలు బ్రాండీలు తాగాబోకురా 
కాలేయానికి తూట్లు పొడవబోకురా..
గంజాయి నల్లమందు ముట్టబోకురా..
మత్తులో నీ మెదడు మోద్దుబారు రా ..


ఝలక్ ఝలక్ ఝలక్ ఝలక్ జాం
ఝలక్ ఝలక్ ఝలక్ ఝలక్ జాం 


సినిమాల్లో చూపినట్టు ..రింగు రింగుల పొగలూద్దాం..
తీయరా సిగరెట్ ప్యాక్ ని 
తిన్నదంతా అరిగేట్టు ..రాజసమే ఇధైనట్లు ..
నములరా పాను.. గుట్కాని
స్మోకింగ్ తో నోరంతా కంపుకొట్టు ..
గుట్కాతో పళ్ళన్నీ గార పట్టు 
గుట్కాలతో ధవడలన్నీ పొక్కి పెట్టు 
మానకుంటే రాచపుండై తిరగబెట్టు


ఝలక్ ఝలక్ ఝలక్ ఝలక్ జాం 
ఝలక్ ఝలక్ ఝలక్ ఝలక్ జాం 


ఏళ్ళుగా వ్యసనముంది .,మారాలని నాకు ఉంది 
మార్గమే చూపు గురువా ..
వ్యాదులంటే వణుకూ ఉంది ..వస్తాయని భయము ఉంది 
చెప్పవా చిన్ని సలహా ..
మనసుంటే మార్గముంది వెర్రి నాన్నా 
ప్రయత్నిస్తే ఫలితముండు బుజ్జి కన్నా ..
కౌన్సిలింగ్ తో కనువిప్పు కలుగురన్నా 
వైద్యం తో నీ వ్యాధులు తొలగురన్నా..


వ్యసనాలు అన్ని మరిచి 
ఒళ్ళు వంచి పని చేస్తే 


సంపాదన పెరగవచ్చురా 


ధనమంతా పొదుపు చేసి , పిల్లల్ని పోషించి 
విద్యా బుద్ధులు నేర్పవచ్చురా 
తందనా తందననా  తందనా తందననా 

ఇక నే చెప్తా సార్...
వ్యసనాలకి బానిసలై తిరిగే టోళ్ళు..
వ్యర్ధ పదార్థాలై కుల్లిపోతరు..
సన్మార్గం లో నడిచే సక్కనోల్లు ..
సంఘంలో గొప్ప వాళ్ళుగా మిగిలిపోతరు..
*****************************
written by ME,
at 8pm 24.12.2010





Saturday, 10 December 2011

మై లవ్ మహి-మహే, మహి-మహే మహి-మహే కే.



Recent  sensational song  KOLAVERI SONG(from the tamil movie' 3 ")ki peradee song:


హలో  బాయ్స్  ..
అయాం  సింగింగ్ ...సాంగ్ ..
సూపర్  సాంగ్ ...పేరడీ  సాంగ్ ...

మై లవ్ మహి-మహే మహి-మహే మహి-మహే కే
రిథం  కరెక్ట్ ..
మై లవ్ మహి-మహే మహి-మహే మహి-మహే కే

మైంటైన్ థిస్ ...
మై  లవ్  మహి -మహే ..... ఆ  ఓకే .
వాయిస్  ల  స్వీట్టు   స్వీట్టు  
స్వీట్టు  మ్యాటర్   లేట్టు ..
బ్రేక్స్  మై  హార్ట్  గేట్టు  గేట్టు ..
హార్ట్  ల  లవ్  వేయిట్టు ..

మై లవ్ మహి-మహే మహి-మహే మహి-మహే కే 
మై లవ్ మహి-మహే మహి-మహే మహి-మహే కే

క్యూట్  లుక్సు   డియరు డియరు ...
డియరు  ఇన్ సైడ్   ఫియరు ..
థాట్స్  థాట్స్  మిక్షూ ..మిక్షూ ...
ట్రై  టు  కిస్సూ  లిప్సు ..

మై లవ్ మహి-మహే మహి-మహే మహి-మహే కే 
మై లవ్ మహి-మహే మహి-మహే మహి-మహే కే 




బాబు  పర్స్  చూసుకో ..
అలాగే  ఆ  రొసేస్   తీసుకో ..
హాహాహ  హాహాహ హ  హాహాహ హా
బాగుంది  అంతా .
 సూపర్ రా    బుజ్జీ  గో ఆహేడ్  1 2 3 4
వాట్  యె  మేక్ ఓవర్  బుజ్జి ..
ఓకే ..బుజ్జి ..నౌ  గెటప్  చేంజు  


పార్కు  లో  ప్రేయసి ...
ఓన్లీ  ఇంగ్లీష్  ఓకే .. 
 పార్క్స్ 'ల  లవరు..షి  ఈజ్  సో  క్లెవరు
హార్ట్  ఫుల్  ఆఫ్ షివరు..
స్ట్రక్చరు  సూపరు ..వెదరు   వింటరు..
బాడీ ఆజ్   ది   హీటరు..
లవ్వు  లవ్వు  ఓ  మై  లవ్వు 
ఐ  డోన్ట్ హావ్  డవ్వు 
సెల్లు  సెల్లు  నోకియ  సెల్లు 
కనెక్ట్  విత్  హర్  నవ్వు 
క్యుపిడ్   అయాం  క్రయింగ్  నవ్వు 

వీక్కు  సిగ్నల్  రీచ్  హవ్వు 
థిస్  టైం  వన్  గై  కేమ్ము ..
షి  వెంట్ విత్  హిమ్మూ


మై లవ్ మహి-మహే మహి-మహే మహి-మహే కే 
మై లవ్ మహి-మహే మహి-మహే మహి-మహే కే 
మై లవ్ మహి-మహే మహి-మహే మహి-మహే కే 
మై లవ్ మహి-మహే మహి-మహే మహి-మహే కే
*************************************
written by  BODDU MAHENDER
AT 9am 10.12.2011

Friday, 9 December 2011

kolaveri peradee song

Recent  sensational song  KOLAVERI SONG(from the tamil movie' 3 ")ki peradee song:
************************************
written by  BODDU MAHENDER
AT 9am 10.12.2011
hello boys..
iam singing...song..
Super song...peradee song...
My love mahi-mahe ,mahi-mahe mahi-mahe ke.
My love mahi-mahe ,mahi-mahe mahi-mahe ke.
Rhythm correct..
My love mahi-mahe ,mahi-mahe mahi-mahe ke.
Maintain this...
My love mahi-mahe..... Aa ok.
Voice la sweetu sweetu
sweet'tu matter late'tu..
Breaks my heart gate'tu gate'tu..
Heart la love weight'tu..
My love mahi-mahe ,mahi-mahe mahi-mahe ke.
My love mahi-mahe ,mahi-mahe mahi-mahe ke.
Cute looks dear'ru dear'ru...
Dear inside fear'ru..
Thoughts Thoughts mix'uu..mix'uu...
Try to kiss'su lips'su..
My love mahi-mahe ,mahi-mahe mahi-mahe ke.
My love mahi-mahe ,mahi-mahe mahi-mahe ke.
babu purse choosuko..
alaage aa roses theesuko..
hahaha hahahaha hahahaha
baagundhi anthaa.
 super'ra bujjee go ahead 1 2 3 4
what a make over bujji..
ok..bujji..now getup change
parkuu lo preyasi...
only english ok..
 parks'la lover'ru..she is so clever
heart full of shiver..
structure super;ru..weather  winter'ruu..
body as the  heater'ru
love'vu love'vu oh my love'vu
i dont have dove'vu
cell'lu cell'lu nokia cell'lu
connect with her now'wu
cupid iam crying now'wu
weak'ku signal reach how'wu
this time one guy came..
she went'tu with him'mu
My love mahi-mahe ,mahi-mahe mahi-mahe ke.
My love mahi-mahe ,mahi-mahe mahi-mahe ke.
My love mahi-mahe ,mahi-mahe mahi-mahe ke.
My love mahi-mahe ,mahi-mahe mahi-mahe ke.

Sunday, 4 December 2011

ఇటీవల చాలా ప్రాచుర్యం పొందిన " అనితా ఓ అనితా.." అనే పాటకి ఇది పేరడీ :


 ఓ ప్రేయసీ నను విడిచిపెట్టవే...
నీ ప్రేమకి ఫుల్ స్టాప్  పెట్టవే ..
అదేపనిగా తింటుంటే ... అప్పులపాలవుతున్నా 
హోటల్స్ , పార్లర్స్  లో బిల్లు కట్టలేకున్నా 
లలితా  .. లలితా"   


 లలితా  .. ఓ  లలితా  
నా లైఫ్ కి   విష వలిత
దయలేదా కాస్తయినా 
నా క్రెడిట్ కార్డ్ పైనా ..


                         " ఓ ప్రేయసి "
పట్టదుగా చెలియా 
నే చిక్కి శల్యమైనా
నీ షాపింగు .. షికార్లకి 
ఒళ్ళు హూనమయినా 


ఖర్చు చేసే నీ తత్వం
నను కలవరపరిచేనే ...
పొదుపు లేని మనిషివని
లోన కుమిలిపోయెనే


నువ్వొక చీడ ... నాకొక పీడ
నిను వదిలినంతనే 
మనసు తెలికవ్వునే ...
నా పాలిటి శనివి నీవే ..
నా  గుండెపై కుంపటి నీవే..
నా ఆశలకి కత్తెర నీవే
నా జేబుకి చిల్లులు పెట్టకే 


     " లలితా ఓ లలితా "
*****************************
written by ME,
at 9pm 10.1.2011



ఆర్య 2 సినిమా లో "మై లవ్ ఈజ్ గాన్..." అనే పాటకి పేరడీ పాట:

మై సెల్ ఈజ్ గాన్...మై సెల్ ఈజ్ గాన్...
 మై సెల్ ఈజ్ గాన్...మై సెల్ ఈజ్ గాన్...
పోయే పోయే సెల్లె పోయే ...పోతే పోయిందే .. 
ఇట్స్ గాన్...  ఇట్స్ గాన్... 
ఇట్స్ గాన్...మై సెల్ ఈజ్ గాన్...
                                                              " పోయే పోయే సెల్లె పోయే .."

చరణం :
నోకియా ఫోను  పాయే..
నంబర్స్ మిస్సు ఆయే ..
ఫ్రెండ్ షిప్ లింకు కట్  అయిందే ..
గర్ల్ ఫ్రెండ్ ఫోటో పాయే ..
క్లోజ్ ఫ్రెండ్ డేటా పాయే 
నా ఫేటు రూటు మారినాదే ..
                                                           "మై సెల్ ఈజ్ గాన్..."

చరణం :




సిగ్నల్ సరిగా ఉండదే ..బ్యాటరీ లో అవుతుంటదే..
చార్జింగ్ త్వరగా అవ్వదే ..సెల్ పోతే పోయిందే ..
కీ ప్యాడ్ చెడి పోయున్నదే ....డిస్ ప్లే డిమ్ గా మారిందే ..
ప్యానల్ పాతది అయిందే ...సెల్ పోతే పోయిందే ..
F .M  ట్యూను కాదు .. నెట్ యాక్టివ్ కాదు ..
ఫోనంతా డొక్కు తుక్కుదేలే ..
వాయిస్ క్లారిటీ లేదు ...వీడియో చాటింగ్ లేదు ..
హైటెక్ హంగు లేనే లేదే.. 

                                                           "మై సెల్ ఈజ్ గాన్..."

*********************************************
written by ME,
at 8am 2.2.2011
*********************************************


ఈ పేరడీ పాట సూర్య పేపర్ ఆదివారం సంచికలో ..
ఫిబ్రవరి 20 , 2011   నాడు ప్రచురితమైనది ..