చదువేరా ఉన్నతికి మార్గం
ఆ చదువు విలువ తెలుసుకొనుట మానవ ధర్మం
చదువేరా ఉన్నతికి మార్గం
ఆ చదువు విలువ తెలుసుకొనుట మానవ ధర్మం
చదువేరా ఉన్నతికి మార్గం
చదువునే దేవతయని పూజించుమురా...
చదివి నీవే విజ్ఞానము ఆర్జించుమురా..
చదువునే దేవతయని పూజించుమురా...
చదివి నీవే విజ్ఞానము ఆర్జించుమురా..
చదువుకొని ఇతరులకి నేర్పినవాడే
చదువుకొని ఇతరులకి నేర్పినవాడే
ఆత్మీయుడు..ఆరాధ్యుడు..ఆచార్యుడురా..
చదువేరా ఉన్నతికి మార్గం
శ్రద్ధ చూపి పట్టుదలగా పఠియించుమురా..
పాఠమంతా అన్వయిస్తూ ప్రతిభ పెంచరా..
కఠినమైనా సులభమవు సాధన చేస్తే..
కఠినమైనా సులభమవు సాధన చేస్తే..
అయ్యో.. ఒత్తిడితో చనిపోరు ఇది తెలుసుకుంటే..
చదువేరా ఉన్నతికి మార్గం
శాస్త్రజ్ఞుడి మేధస్సులో చదువున్నదిరా..
సర్వజ్ఞుడి కీర్తిలో చదువున్నదిరా..
విద్యార్థికి పాఠశాలే కోవెల రూపం..
అజ్ఞానమును విడువకుంటే కలగదు మోక్షం..
చదువేరా ఉన్నతికి మార్గం
ఆ చదువు విలువ తెలుసుకొనుట మానవ ధర్మం
చదువేరా ఉన్నతికి మార్గం
**************************
written by ME
at 10:42am 30.5.2012
No comments:
Post a Comment