Showing posts with label స్ఫూర్తిదాయక కవితలు. Show all posts
Showing posts with label స్ఫూర్తిదాయక కవితలు. Show all posts

Friday, 29 March 2013

ఉపదేశంగా నీ బ్రతుకుని నిలిపేదెపుడు..?

నిన్నటి ఓటమితోనే నిలిచిపోతే 
నీలో సత్తా ఇంతే అని కృంగిపోతే
రేపనే ఆశనే నువ్వు మరిచిపోతే
రేయిలోనే భవితని చూస్తూ పోతే

చరిత నిర్మాణం అయ్యేదెపుడు..?
మహిత మనోజ్ఞం అయ్యేదెపుడు..?
ఉనికి ఉరుకులాటని ఆపేదెపుడు..?
ఉపదేశంగా నీ  బ్రతుకుని నిలిపేదెపుడు..?
******************************
written by BODDU MAHENDER
at 5:26pm 29.3.2013

Tuesday, 26 February 2013

నీ ప్రేరణే కాదా మూలం...

అంతులేని అన్వేషణ..
నేను ఓపలేని నిరీక్షణ.. 
నా గమ్యం గమనం ప్రశ్నార్ధకమైన వేళ..
నీ సాహిత్యం సాన్నిహిత్యం నన్ను ఆకట్టుకున్న వేళ
కొత్త అనుభూతులకి జీవితం తెరలేపింది..
కొత్త లక్ష్యాలకి  పయనం సాగించింది.. 
నేస్తమా ..
రేపనే రోజున నేటిని లిఖించేందుకు..
నాదనే పేజీని చరిత్రలో  నిర్మించేందుకు..
నీ  ప్రేరణే కాదా మూలం...
నీ  ప్రోత్సాహమే కాదా ప్రాణం..
******************************
written by BODDU MAHENDER
at 8:50pm 26.2.2013

Wednesday, 9 January 2013

మార్చాలి..నా పంథా..


గుండె రగులుతోంది..
రక్తం ఉడుకుతోంది..
పౌరుషం పెరుగుతోంది..
పట్టుదలని పెంచుతోంది..
ఈ గమ్యం, గమనం  నాదా..?
నా లక్ష్యం , స్థాయి.. ఇదా..?
కాదు..మార్చాలి..నా పంథా..
సత్తా చూపించాలి ఈ జగమంతా..
కలలన్నీ చిన్నబోయెంతా..
నా కళలన్నీ పొంగిపోయెంతా..
**************************
written by BODDU MAHENDER
at 11:07pm 9.1.2013

Friday, 29 June 2012

అడుగు వేశాక మడమ తిప్పకు..


అడుగు వేశాక మడమ తిప్పకు..
ఆఖరి ఘడియ దాకా పట్టు వీడకు..
ఆచరణ లేకుంటే ఆశపడకు..
ఆత్మవిశ్వాసాన్ని వీడి వెళ్ళకు..

ఎదురేమైనా రానీ..ఏమైనా కానీ..
ఎత్తిన బావుటా కింద దించకు..
తలపెట్టిన కార్యం విడిచిపెట్టకు.. 

జయహో..జయహో..విజయం నీదే..
ఆహా..ఓహో..అనే సత్కార్యం నీదే..

శ్రీరస్తు..శుభమస్తు..
మనో వాంఛ ఫల సిధ్ధిరస్తు..
**********************
written by ME
at 6:57am 30.6.2012

Thursday, 21 June 2012

అనుకుంటే...


అనుకుంటే అన్నీ సాధ్యమే..
విభిన్నతే నీ ఆలోచనైతే..
ఆదరిస్తే అంతా నీ వాళ్ళే..
ఆత్మీయతే నీ సొంతమైతే..
ఆ ఆకాశానికే నిచ్చెన వేయవోయ్...
ఈ అవనినే నీ యెదగా ఏలవోయ్... 
*********************
written by   - బొడ్డు మహేందర్ 
at 9:55am 22.6.2012

Wednesday, 13 June 2012

మార్పు ఏదైనా ........


నెరవేరని కలలెందుకు..
ఆచరణ చూపని ఆశలెందుకు..
తెలిసి తెలిసి భ్రమలెందుకు..
అదే పనిగా ఊహలెందుకు..

వాస్తవమేదైనా తలవంచు..
నీ విధ్యుక్త ధర్మాన్ని నిర్వహించు..
మార్పు ఏదైనా ఆహ్వానించు..
మనసా వాచా దాన్ని సాధించు..

దారి మార్చినంత మాత్రాన గమ్యం మారినట్టు కాదు..
లక్ష్యం మారినంత మాత్రాన సత్తా తగ్గినట్టు కాదు..
నిన్ను నీవే మలుచుకోవోయ్..వీరుడిగా..శూరుడిగా..
ఎవరేమన్నా సాగిపోవోయ్..ధీరుడిగా..కార్య సాధకుడిగా..


నీ మాటే వేదమవ్వాలి...
నీ బాటే ఆదర్శ పథం అవ్వాలి..
మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరిదే..
మొదలు పెడితే జగమంతా నీ తోటిదే..


****************************
written by ME 
at 9am 14.6.2012

Monday, 11 June 2012

బుజ్జమ్మా ..


అమ్మ తర్వాత అమ్మై నావే..
అక్కగా పిలిచే బంధమైనావే..

కలిసి పుట్టకపోయినా కన్నీరు పెట్టావే..
కామెంట్స్ ఎన్ని చేసినా కమ్మంగా నవ్వావే..

మా వాడు మా వాడని మహాగొప్ప చేసావే..
మహేంద్రుడిగా ఎదిగేందుకు మద్దతుగా నిలిచావే..

మరపే లేనట్టు ప్రతి క్షణమూ పిలిచావే..
మనసెరిగి నా కలలు కళ్ళ ముందు నిలిపావే..

బుజ్జమ్మా ..నిన్నేపుడూ నే మరిచిపోనమ్మా...
నా ఎదలో నీ మూర్తినే నిలిపి నిత్యం ఆరాధిస్తానమ్మా..
********************************
written by ME
at 7:10pm 11.6.2012

ఇది నేను ముద్దుగా పిలుచుకునే మా బుజ్జమ్మ(సుమన్ సయాని) కోసం రాసిన కవిత..
తనకి మీ అందరి సమక్షంలో కృతజ్ఞతలు తెలుపుతూ తను ఎప్పుడూ ఆనందంగా ఉండాలని మనసారా కోరుకుంటూ... 
my PURPLE wishes..

Saturday, 2 June 2012

ఒక్క క్షణం...

ఒక్క క్షణం..
ఆపదలని తప్పించడానికి..
ఆక్రమణలని తొలగించడానికి..

ఒక్క క్షణం...
అవినీతిని అంతమొందించడానికి..
అన్యాయాన్ని తుద ముట్టించడానికి.. 

ఒక్క క్షణం..ఇవ్వు నేస్తం..
కాలగతినే మార్చేందుకు..
కొత్త చరిత్రనే రాసేందుకు.. 

ఒక్క క్షణం.. ఇవ్వు నేస్తం..
నిన్నటి నీ కలని నిజం చేసేందుకు..
రేపటి ఓ ఆశకి రూపమిచ్చేందుకు..
**************************
written by BODDU MAHENDER
at 10:42pm 2.6.2012

Saturday, 19 May 2012

మనసు ద్వారం తెరిచితే....

అప్పుడప్పుడు...అంతే...
మనం ఎన్నో చెప్పాలనుకుంటాం..
ఆలోచిస్తాం..ఆశ పడుతాం..
కానీ ఆ సమయం వచ్చే సరికి
అన్నీ మరిచి...
ఆశక్తతతోనే  ఉండిపోతాం..
ఆవేదనలోనే  రగిలిపోతాం..


అది ప్రేమించే మాట అయినా..
ప్రయోజనకర బాట అయినా..
మనసుపడే ఆట అయినా....
మంది మెచ్చే పాట అయినా..


లోలోనే దాచుకుంటాం...
లోకువవుతామని భయపడుతాం..
మనకు మనమే మభ్యపడుతాం..
మనసునెప్పుడూ బాధపెడుతాం..


అదే..
నోట మాట పలికితే....
లోని భారం తీరదా..?
మనసు ద్వారం తెరిచితే..
ప్రేమ గాలి వీయదా..??


నీలో నీవే మధనపడితేముంది..?
మిగిలేది..నిండు సున్నే..!!
నిర్భీతితో ఓ అడుగేస్తే..
నిలిచిపోయేది...నీ వన్నె..
********************
written by ME
at 10:28pm 19.5.2012

Wednesday, 22 February 2012

ఒకే ఒక విజయం..

ఒకే ఒక విజయం..
నను ఊరిస్తోంది..
ఉసూరుమనిపిస్తోంది..
కవ్విస్తోంది..
కంట తడి పెట్టిస్తోంది..
చీకటిలా పులుముకొని,
నను చిత్రవధ చేస్తోంది..
రేపటినే నేనంటూ...
కొత్త ఆశలు రేపుతూ ఉంది..
ప్రేమ ,అనుబంధం ,అంతస్తు ,హోదా...
అన్నీ ముడి పడ్డ విజయం అది..
నను సంతోషం లో ముంచే విజయం అది ..
కాని , అది లేక , నే చేరుకోలేక ,
నలుగుతున్న నా హృదయ క్షోభ
ఎవరికి తెలుసు ...???
అయినా పట్టు విడవను.. వెన్ను చూపను..
చీత్కారాలు పొందిన చోటే,
సత్కారాలు పొందాలి..
చిన్నచూపు చుసిన వాడే,
నా ముందుచూపుకి ఈర్ష్య పడాలి ..
అది సాధిస్తా ..
అవును , నేను సాధిస్తా..
సాధించి మీ అందరికి చూపిస్తా..
మిమ్మల్నే నా అనుచరులుగా మారుస్తా..
***********************
written by Me
at 10:59am 23.2.2012.


***********************
ఈ కవిత సూర్య దిన పత్రిక ఆదివారం సంచికలో ,
మార్చి 4,2012 నాడు ప్రచురితమైనది..

Sunday, 4 December 2011

అనుకున్నది జరగలేదని ..

అనుకున్నది జరగలేదని ..
నిరాశ చెందకు ఏనాడు
పట్టుదలే సాధనంగా ..
ప్రయత్నించి చూడు ఈనాడు
ప్రవహిస్తున్న యేరును చూడు
శిలలని సైతం ఎదిరించి  ప్రవహిస్తున్నది
పట్టుదలతో కృషి చేసి చూడు ..

కస్టాలు కన్నీళ్లు ఎదురయ్యాయని
భయపడక ,
ఆత్మ విశ్వాసంతో  సాగు ముందుకు
నీవనుకున్నది సాధించేంత వరకు

అమావాస్య తర్వాత పున్నమి రాక మానదు
శిశిరం తర్వాత వసంతం రాక మానదు ...
కాబట్టి
విఫలమయ్యానని చింతించక ..
పట్టుదలతో ప్రయత్నమారంభించు ...
నీ గమ్యం వైపు పయనం సాగించు ..
ప్రయత్నమంటూ ఉంటే
సాదించలేనిది అంటూ  ఏమీ  ఉండదు ...
***********************************************
ఈ కవిత వార్త పేపర్ ఆదిలాబాద్  జిల్లా ఎడిషన్ లో
4 .2 .2002  నాడు ప్రచురితమైనది..
ఇది పేపర్ లో ప్రచురణ పొందిన నా మొదటి కవిత ..
***********************************************



Tuesday, 29 November 2011

ఆశా కిరణం ....

అంతా  అయి పోయిందని , అనుకోవద్దు ...
ఆశలు  వీడి , బ్రతుకీడ్చొద్దు ...
పరిధులు  గీసి , పరువు  అనుకోవద్దు ...
జీవిత  గమనం , బరువు  అనుకోవద్దు ...
రేపటి  మలుపులో  ఏముందో  అని ..,
నేటి  రేయిని  చూసి  చింతించొద్దు ..
నీకై  నీవే  దివిటీవై,
వేకువ  వెలుతురుగా 
నిలవడం  మరిచిపోవద్దు ..
*********************************

written by  ME
at 3:02am, 20-9-2011.

Monday, 28 November 2011

విద్య లేదని వేదన పడకు ..

పస లేని చదువు పనికి మాలినది ...
బ్రతుకు పాఠం చదువు ,
నీ భారం దిగుతుంది ...

అంతరంగంలోకి తొంగి చూడు ....
నీ ఆలోచనలు ప్రస్పుటిస్తాయి...
అంతులేని జీవన అగాధాన్ని పూడ్చడంలో ,
అవే నీకు అండగా నిలుస్తాయి ...

గతంలోకి మళ్లీ వెళ్ళు ..
గాడి తప్పిన ఆలోచనల ,
ఫలితాలు కనిపిస్తాయి ...
అవే గుణ పాఠాలై
నీ ఉన్నతికి , సహకరిస్తాయి ...

భవిష్యత్తుని బాధ్యతగా చూడు ...
భావి తరాల కలలు కనిపిస్తాయి ...
వాటి ప్రేరణ పునాది ,
నేటి నీ స్వేద బిందువులే అని చెప్తాయి ....

నేడు ని ఎప్పుడూ వాయిదా వెయ్యకు ...
విద్య లేదని వేదన పడకు ..
స్వశక్తి, అధ్బుత మేధ నీ సొంతం
ఇక జయమే... నీ కృషి ఉంటె ఆసాంతం

*******************************
written by ME,
 at 8.52am, 2.11.2011.


Sunday, 11 July 2010

వెలుగు కిరణం సోకే వరకే

నిరాశల నీడలోన
నిలిచిపోకు నేస్తమా..
నిశీథిల జాడలోన
సాగిపోకు మిత్రమా...
ఆశలన్నీ ఆవిరైనా,
అండగా నేనున్నాగా స్నేహమా..
ఆఖరి క్షణమే ఎదురుగా వచ్చినా,
ఆయువై నిలుస్తాను నా ప్రియతమా..
వెలుగు కిరణం సోకే వరకే,
వేధించే ఈ చీకట్లు..
వెండి వెన్నెలై నిలిస్తే,
వీగిపోవా నీ ఇక్కట్లు.. 

*******************
Written by ME
at 10am, 26.10.2007