Showing posts with label .నాలో నేను ... Show all posts
Showing posts with label .నాలో నేను ... Show all posts
Wednesday, 5 March 2014
Tuesday, 25 February 2014
ఆసన్నమైంది..!!
నన్ను నేను వ్యక్తపరిచే
సమయం ఆసన్నమైంది.
నన్ను నేను బహిర్గతపరిచే
ముహూర్తం సంసిద్ధమైంది.
ఇక,
నా నోటికి తాళం వేయను.
నా ఆశకి కళ్ళెం వేయను.
రేపటి స్వప్నానికి హద్దులు గీయను
జీవిత లక్ష్యానికి లంకెలు కట్టను
అవును ..
నన్ను నేను
వ్యక్తపరిచే సమయం ఆసన్నమైంది.
ఆసన్నమైంది..!!
****************************
written by BODDU MAHENDER
at 7:45pm, 25.2.2014
Tuesday, 11 February 2014
తెలుసుకొని..తేరుకొని..
చీకట్లోనే ఉన్నాను ఇన్నాళ్లు
చీకటిని తిడుతూ కాదు, వేడుతూ..
నన్ను తనతో దాచమని,
నన్ను తనలా మార్చమని..!!
కానీ వేకువనే చూశాను ఒకరోజు
వేల్పుగా కొలిచాను ప్రతిరోజు..
వెలుగు విలువ తెలియడానికే చీకటని,
సుఖం స్థాయి పెంచడానికే కష్టమని
తెలుసుకొని..తేరుకొని..
నన్ను నేను మలుచుకున్నా ఆ రోజు..
“నన్ను” నేను చూసుకుంటున్నా... ఈరోజు..
*****************************
written by BODDU MAHENDER
at 5:49pm 11.2.2014
Friday, 17 January 2014
Tuesday, 7 January 2014
ఎవరికి తెలుసు..?
ఈ నిశ్శబ్దం వెనుక దాగిన
నిర్వేదం ఎవరికి తెలుసు..?
ఈ నిస్పృహని పెంచిన
నిరాశ ఎవరికి తెలుసు..?
అలుపు లేకుండా శ్రమిస్తున్నా
ఆర్ద్రత అణుచుకొని లిఖిస్తున్నా
అంతరంగాన్ని వేధిస్తున్న
ఆ ఆత్రం గురించి ఎవరికి తెలుసు..??
అన్నీ ఉన్నా ఆ ఒక్కటీ లేని
ఈ వెలితి గురించి ఎవరికి తెలుసు..??
******************************
written by BODDU MAHENDER
at 10:30pm 7.1.2014
Sunday, 1 December 2013
నాలో భావాల అవక్షేపం
ఎందుకే...
నిన్ను చూస్తే
గుండె తడవుతోంది..
కన్ను నీరవుతోంది..
మాట పెగలకుంది..
బాధ వదలకుంది..
నువ్వు నా కాలక్షేపం కాదు.
నాలో భావాల అవక్షేపం..
ఓ స్వేఛ్చా విహంగ స్వాప్నిక
నా ప్రణయ దేవేరి రూపిక
మరిచేనా నిను కలనైనా..!!
మరి చూసేనా ఈ ఇలపైనా..!!
****************************
written by BODDU MAHENDER
at 10:45am, 2.12.2013
Friday, 29 November 2013
కాలపరీక్షలో....
నేను నేనుగా ఎదిగేందుకే ఈ తాపత్రయం
నన్ను నన్నుగా చూపేందుకే నా కూతూహలం
కళ్ళు తడి అవుతున్నా కాళ్ళు ఆగడం లేదు
ఒళ్ళు హూనమవుతున్నా దారి విడవడం లేదు
ఆందోళన వేధిస్తున్నా,
ఆశల పల్లకిలో ఊరడిల్లుతూ ఉన్నా...
అవమానాలెదురవుతున్నా,
ఆశయాల పల్లవినే పాడుతూ ఉన్నా...
విజయం చేరే వరకేగా ఈ వెక్కిరింతలు
విజయుడైన నాడు, అవే వేనోళ్ళ పొగడ్తలు..
ఈ కాలపరీక్షలో, నేనో
కఠిన హృదయుడిగా మారిపోతున్నా..
కల్మషం లేని ఓ జతకై ఇంకా పసివాడిగానే ఉన్నా..
కలలలోకమని నిత్యం పరుగులిడుతున్నా..
ఓ కాంత చెంత నిశ్చలమైపోవాలని నిశ్చయమైయున్నా..
************************************
written by BODDU MAHENDER
at 12:50pm, 30.11.2013
Wednesday, 14 August 2013
నాకు స్వాతంత్ర్యం కావాలి
స్వార్ధం నిండిన రాజకీయం నుండి
స్వశక్తత వీడిన యువతరం నుండి
కన్నీళ్లు నింపుకునే పేదరికం నుండి
కల్మషం పంచుకునే నాగరికం నుండి
నాకు స్వాతంత్ర్యం కావాలి
మనసుని మరిచిన మనుషుల నుండి
మానవత విడిచిన మూర్ఖుల నుండి
సంఘ విద్రోహ శక్తుల నుండి
సంస్కరణాభిలాష లేని యుక్తుల నుండి
నాకు స్వాతంత్ర్యం కావాలి
నాకు స్వాతంత్ర్యం కావాలి
****************************
written by BODDU MAHENDER
at 8:12am 15.8.2013
Saturday, 3 August 2013
నాకు నేనే అయ్యా స్నేహితుడిగా..
ఎందుకో స్నేహం నాకు సరిపడలేదు..
నిజం చెప్పాలంటే అది నాకు అచ్చి రాలేదు..
స్నేహం విలువ తెలిసిన వాడినయినా,
ఆ స్నేహ మాధుర్యం ఎన్నడూ పొందలేదు..
ఏ నిజ స్నేహం నాతో చేయి కలపలేదు..
వంచించిన స్నేహాలు
నాలో స్నేహపు వాంఛని తగ్గించాయి..
వస్తువని భావించిన స్నేహాలు,
నన్ను వాడుకొని వదిలేశాయి..
అందుకే
నాకు నేనే అయ్యా స్నేహితుడిగా..
నా మనసునే చేసా దానికి సన్నిహితుడిగా..
**********************************
written by BODDU MAHENDER
at 12:46am 4.8.2013
Monday, 15 July 2013
Saturday, 13 July 2013
అపురూపమైన ఆ క్షణాలని మళ్ళీ మళ్ళీ ఏరుకోవాలని
గతిస్తే కానీ విలువ తెలియలేదు
స్మరిస్తే కానీ గుర్తు నిలవలేదు
ఈ యాంత్రిక వడివడి జీవితంలో
స్థితిగతులనే ఎంచి చూస్తున్న తరుణంలో
మలినమంటని నా మనసు ముత్యాన్ని
మరలి రాని ఆ బాల్యపు సొగసుని
ఆర్ధ్రంగా తడుముతూ, ఆత్మీయంగా పొదుగుతూ..
అపురూపమైన ఆ క్షణాలని
మళ్ళీ మళ్ళీ ఏరుకోవాలని
అన్వేషిస్తున్నా ..
అంతులేని నా గమ్యాల వైపు..
అలసట తీర్చే ఆశల తీరాల వైపు..
అందమైన చిలిపి ఊహల వైపు..
అచ్చమైన నా పసితనపు జాడల వైపు ...
*****************************
written by BODDU MAHENDER
at 12:40am 14.7.2013
Thursday, 2 May 2013
కాంక్ష వీడక సాగుతున్నా..
అడుగడుగునా అభద్రత..
ఆలోచనల్లో అస్థిరత..
అనుకున్నది సాధిస్తానా..
అజేయుడనై చూపిస్తానా...
నన్ను నేను నిరూపిస్తానా..
నా ప్రేమను గెలుపిస్తానా..
దారులన్నీ మూసుకుపోతున్నా..
దరి వెతుకుతూ వెళుతున్నా..
కలలన్నీ కరిగిపోతున్నా..
కాంక్ష వీడక సాగుతున్నా..
ఏదో రోజు నాదవుతుందనే ఆశతో..
రేపటికి నా చరితే చూపవుతుందనే ధ్యాసతో..
*******************************
written by BODDU MAHENDER
at 3:45pm 2.5.2013
Friday, 5 April 2013
నేస్తం ఒకటి ఊపిరినిచ్చింది.
అంతమయ్యే స్థితిలో ఆయువయ్యింది.
నేస్తం ఒకటి ఊపిరినిచ్చింది.
మార్గం చూపి మనసుని అల్లింది.
కల ఒకటి కళగా మారింది.
కడు వేదనలో నా కన్నీటిని తుడిచింది.
విజయం ఒకటి నా చెంతన చేరింది.
విశ్వ జనతకి నన్నే రాజుని చేసింది.
గర్వమొకటి నా పెదవిన నవ్వింది.
గత బాధలని తుడిచేస్తూ నా గమ్యాన్ని చేర్చింది.
*******************************
written by BODDU MAHENDER
at 1:45pm 5.4.2013
Tuesday, 2 April 2013
Sunday, 31 March 2013
Friday, 15 March 2013
నిజమయ్యే కలల ముంగిట్లో ...
ఎవరేమనుకున్నా ,
నేను సాధించాను కొన్ని..
ఎదురేమున్నా ,
ఏరిపారేసాను కొన్ని ..
నా పథం – పదం : ప్రేమ
నా గురి – దరి : ప్రేమ
నిరాశను ప్రేమిస్తాను..
నిశీథిని ప్రేమిస్తాను ..
నీ ఆశని నేనయ్యేందుకు
నిమిష నిమిషమూ శ్రమిస్తాను..
నిన్నటిని శ్వాసిస్తాను
రేపటిని పోషిస్తాను..
నిజమయ్యే కలల ముంగిట్లో
కళల హారమై నిలుస్తాను...
***************************
written by BODDU MAHENDER
at 3:38pm 15.3.2013
Tuesday, 26 February 2013
కాదంటావా ప్రియ నేస్తమా...
ఎందుకో తెలియని సంఘర్షణ ....
ఏ వెలితి తోనో సాగిస్తున్న జీవన ఘర్షణ..
ఇదని చెప్పలేను.. అదని కోరలేను..
నా అస్తిత్వం నాకే తెలియనప్పుడు..
నా ఆశయం నన్నే విడిచినప్పుడు..
నీ మాటే నాకు ఊతం అయ్యింది..
నీ బాటే నాకు పాఠం అయ్యింది..
కాదంటావా ప్రియ నేస్తమా...
*************************
written by BODDU MAHENDER
at 11pm 26.2.2013
Sunday, 10 February 2013
అలాగే ఈ టీవీ కూడా..
మనం చూసేదాన్ని బట్టే ఈ లోకం..
మంచికి మంచే కన్పిస్తుంది..
చెడుకి చెమటలు పట్టిస్తుంది..
అలాగే ఈ టీవీ కూడా..
నిన్ను నిర్మిస్తుంది..నీకో దారి చూపిస్తుంది..
నీ ప్రపంచాన్ని నీకే కొత్తగా పరిచయం చేస్తుంది..
కలలని పెంచుతుంది..కళలని చూపుతుంది..
కలకాలం వాటిని జ్ఞాపకాలుగా దాచుతుంది..
అందుకే నాకిది నేస్తమైంది..
నా భవితకి సమస్తమైంది..
*******************************
written by BODDU MAHENDER
at 7:30pm 10.2.2013
Saturday, 2 February 2013
Tuesday, 22 January 2013
తప్పెవరిది..?
తప్పెవరిది..? లోపం ఎక్కడుంది..?
మనిషిని సరిగ్గా అంచనా వేయలేకపోయానా..?
నా మనసుని అదుపులో ఉంచుకోలేకపోయానా..?
వ్యక్తి తప్పుకి వ్యవస్థని తప్పు పట్టాలా..?
సమూహం తప్పుకి సమాజాన్ని నిలబెట్టాలా..?
ఒకరే అనుకుంటే అంతా అలాగే ఉన్నారేం....?
చెలిమి ముసుగులో చెడు చేసి పోతున్నారేం...?
అబద్ధాలు ఆడుతూ ఆదర్శాలు వల్లిస్తున్నారు..
అనురాగం నటిస్తూ ఆప్తుల్నీ వంచిస్తున్నారు...
నమ్మకం అనే దానిపై నమ్మకమే లేకుండా చేస్తున్నారు..
మోహ,వ్యామోహాలకే దాసోహమై పోతున్నారు..
నిజంగా ఏకాంతమే నాకు సరైనది అనిపిస్తోంది..
నాలో నేనై జీవితాన్ని గడపాలి అనిపిస్తోంది..
******************************
written by BODDU MAHENDER
at 1:16pm 22.1.2013
Subscribe to:
Posts (Atom)



















