Wednesday 5 March 2014

మౌనమే..

నిజమే..
ఈ మధ్య 
మౌనమే నన్ను చేరదీస్తోంది.
మౌనమే నాకు చేయూతనిస్తోంది.
మౌనమే మదిని సంతోషపరుస్తోంది.
మౌనమే మహిగా సంతుష్టపరుస్తోంది.
మౌనమే.. 
మాటలన్నీ కరగదీసి
మమతలన్నీ పోతపోసి
మనిషిగా నన్ను గుర్తిస్తోంది.
ఓ మనసుని నాలో చిత్రిస్తోంది.
****************************
written by BODDU MAHENDER
at 9:43am, 6.3.2014

No comments:

Post a Comment