Showing posts with label సందేశాత్మక కవితలు. Show all posts
Showing posts with label సందేశాత్మక కవితలు. Show all posts

Monday, 6 January 2014

కావాలంటే చూడు..

వ్యక్తిని ప్రేమించే కన్నా 
వ్యవస్థని ప్రేమిస్తేనే నయం.
మనమే అని స్వార్ధం తొలగి 
మనకై అనే భావన ఏర్పడుతుంది.
 మనసు అనే భ్రమ తొలగి
మనిషి అనే రూపం బయటపడుతుంది.
కావాలంటే చూడు.. 
నీవు నీకే బందీ అయినప్పుడు
నీ చేయూతని అంగీకరించనపుడు
నిన్ను నీకే దూరం చేసినపుడు
నీ అవస్థలని అపహాస్యం చేసినపుడు
నిజం నిగ్గుతేలుతుంది.
నీలో ప్రేమ నిర్లిప్తత చెందుతుంది.
కానీ అమ్మ లాంటి ఊరు అక్కున చేర్చుకుంటుంది.
అండనిస్తానంటే అమృతాన్నే చిలికిస్తుంది.
****************************
written by BODDU MAHENDER
at 6:50pm, 6.1.2014

Thursday, 21 February 2013

ఇదేనా..ఇదేనా.. మీరు కోరుకున్న సద్గుణ సామ్రాజ్యం..?


తప్పు చేసిందెవరు..? తల్లడిల్లి పోతుందెవరు..?
ఎవరిపై మీ కక్ష..? ఎవరికి వేస్తున్నారు శిక్ష ..?
ఆలోచిస్తున్నారా..? 
అరాచకంతోనే అణిచెయ్యాలని చూస్తున్నారా..?
ఎందుకీ వర్గ వైషమ్యాలు..? వ్యక్తిగత మూర్ఖాభిమానాలు..?
కన్నుకి కన్ను మీ సిద్ధాంతమైతే..
ఇప్పుడు కోల్పోయినవెన్ని..? ఇంకా కోల్పోవాల్సింది ఎన్ని..??
ఇదేనా..ఇదేనా.. మీరు కోరుకున్న సద్గుణ సామ్రాజ్యం..?
రాజనీతులు వల్లించి సృష్టిస్తున్నారు నరమేధ అమానుషత్వం..
బ్రతికేది చావడానికైతే మీ బ్రతుక్కి ఉంటుందా అర్ధం..?
చంపేది సాధనకైతే దక్కుతుందా ఆ పరమార్ధం..?
ప్రేమించండి.. ప్రేమతోనే సర్వం సాధించండి..
******************************
written by BODDU MAHENDER
at 9:41pm 21.2.2013

Sunday, 30 December 2012

కాంక్ష తీరే గమనాన ....


ఏ క్షణం నీకోసం ఆగదోయి...
ప్రతి క్షణం నీదని తల్చవోయి..
గుప్పెట విప్పి  నీ ఆలోచనలు  పెంచవోయి ..
రెక్కలు గట్టి ఆ ఊహలు ఎగరనీయవోయి..
కలలకి కళని చేర్చి కాలంతో ముడిపెట్టవోయి..
కాంక్ష తీరే గమనాన నీ లక్ష్యం చేపట్టవోయి..
***************************
written by BODDU MAHENDER
at 9:35am 31.12.2012

Sunday, 23 December 2012

జాగ్రత్త ..తస్మాత్ జాగ్రత్త ..!!


మగతనం అంటే మగువని లోబర్చుకోవడం కాదు..
మనసారా తన గుండెలో నిను పొందుపర్చుకోవడం..
ఆడతనం అంటే హాయినిచ్చే వస్తువనుకోవడం కాదు..
ఆత్మసాక్షిగా అర్పితమయ్యే స్త్రీకి అండగా నిలవాలనుకోవడం..
తెలుసుకోరా ఓరి నరుడా..మానవత మరిచిన మరుడా..
కామంతో కుళ్ళిపోయిన గురుడా..కన్నె జీవితాల హరుడా.. 
ఆధిపత్యం చెలాయించాలనుకుంటే అంతమై పోతావు..
అనుభవించి తీరాలనుకుంటే ఆ అంగాన్నే కోల్పోతావు..
జాగ్రత్త ..తస్మాత్ జాగ్రత్త ..!!
*********************************
written by BODDU MAHENDER
at 5:55pm 23.12.2012

Thursday, 20 December 2012

పునర్జన్మగా పండుగ..


ఊహలన్నీ చెదిరిపోయినవి.. కలలన్నీ కరిగిపోయినవి..  
ఉత్పాతం జాడే లేదు.. ఉపద్రవం జరగనే లేదు..
జోష్యం ఫలించలేదు ఎందుకని..??
సినీ మాయలు పని చేయలేదు ఎందుకని..??
 భగవానుడు మనకి మరొక అవకాశమిచ్చాడా..?
భవిష్యత్తులో జరిగే దానికి సూచన చేసి పోయాడా..?
ఏదేమైనా ఆశావాదమే నింపుకో నిండుగా..
అవని పరిరక్షణ చేస్తూ మెండుగా..
ఈరోజునే జరుపుకో పునర్జన్మగా పండుగ..
నిన్ను నీవే మలుచుకో సాటివాడికి అండగా..
******************************
written by BODDU MAHENDER
at 10:45am 21.12.2012

అది ఒక హెచ్చరిక మాత్రమే..


సమయం వేచి చూస్తోంది..
సమస్తాన్ని తుడిచి వేయాలని..
సంకల్పం పురిగొల్పుతోంది..
శాష్త్ర జ్ఞానాన్ని సద్వినియోగం చేయాలని..
మన అలక్ష్యమే పెను విపత్తుకి కారణం,
మన అత్యాశే ఈ ఘోరకలికి మూలం..
జ్యోతిష్యం చెప్పినా, కాలజ్ఞానం చెప్పినా 
అది ఒక హెచ్చరిక మాత్రమే..
నీ నడకని, నడతని సరిచేసే ఒక సూచిక మాత్రమే..
యుగాంతం అన్నది జరిగినా, జరగకపోయినా
ప్రకృతి పట్ల నీ బాధ్యత మాత్రం మరువకు..
ప్రతి క్షణం జాగురూకతతో మెలగడం మానకు.. 
******************************
written by BODDU MAHENDER
at 9:02pm 20.12.2012

Tuesday, 4 December 2012

అందుకే ఉన్నప్పుడే, బ్రతికి ఉన్నప్పుడే.....


మృత్యువు... 
ఎందరికో అది..కోరినా దొరకని వరం..
కానీ అందరికీ తప్పని ఓ కలవరం..
కర్మ ఫలం అనుకున్నా..
శరీరధర్మ శాస్త్రం అనుకున్నా..
ఎదుర్కోక తప్పని మహా సంకటం..
నువ్వు ఓడిపోక తప్పని నీ కడ సమరం..
ఒక్క క్షణంలోనే.. 
నీ అనే అహాన్ని అంతా తుడిపేస్తుంది..
నీ బంధాలనన్నింటినీ దూరం చేస్తుంది..
నిజాన్ని చూపించి నిన్ను నిశ్చేష్టున్ని చేస్తుంది..
నీ అజ్ఞానానికి నిన్నే కుమిలిపోయేలా చేస్తుంది..
అందుకే ఉన్నప్పుడే, బ్రతికి ఉన్నప్పుడే..
నీ తోటి వారికి సాయం చెయ్యి..
నీ తోడుగా నిలిచే వారికి ప్రాణం పొయ్యి..
*****************************
written by BODDU MAHENDER
at 10:35pm 4.12.2012

Saturday, 1 December 2012

మేలుకో..నీలా మరొకరు బలి కాకుండా పూనుకో..


తెలిసే తెలియకో ముచ్చట పడ్డావు..
వయసు వేడిలో ఓ ఊబిలో పడ్డావు..
బయటకొచ్చే మార్గం లేదు..
నీ బ్రతుకు నిలిచే అవకాశం లేదు..
కామం నీ కళ్ళు గప్పితే..
అది నీ దేహానికే బట్టగప్పింది..
ఇపుడు దు:ఖిస్తే ఏం లాభం లేదు..
ఎవరినో నిందిస్తే ఏ ప్రయోజనమూ లేదు..
మేలుకో..నీలా మరొకరు బలి కాకుండా పూనుకో..
నీ అనుభవం...వేల మంది అజ్ఞానుల్ని చైతన్యపరచాలి..
రోదిస్తున్న ప్రతిక్షణం.. సుఖరోగాల పీడనపై అవగాహన తేవాలి..
*********************************
written by BODDU MAHENDER
at 1:15pm 1.12.2012

Wednesday, 17 October 2012

కనులు తెరిచి ఈ లోకాన్ని చూడు..


ఎదగాలని పైకి లేచా..
వెనుక నుండి తన్నాడొకడు..
ఎదురు నిలిచి అడిగి చూసా..  
తోకముడిచి వెళ్ళే నొకడు..

అణిగిమణిగి ఉన్నంతకాలం
ఆధిపత్యం చెలాయిస్తారంతా..  
ఆటవిడుపు బొమ్మని చేసి
నిను ఆటాడేస్తారంతా..

కనులు తెరిచి ఈ లోకాన్ని చూడు..
కంపు కొడుతున్న విలువల్ని చూడు..
బిగదీసుకు ఉండిపోతే బట్టబాజీ వైపోతావ్..
బరిగీసి తెగబడితేనే భగవాన్ గా నిల్చిపోతావ్..
****************************
written by BODDU MAHENDER
at 1:34 pm 17.10.2012