Showing posts with label దేశ భక్తి కవితలు. Show all posts
Showing posts with label దేశ భక్తి కవితలు. Show all posts

Friday, 25 January 2013

ఈ రోజు..మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు..


హక్కులని కానుకగా ఇచ్చిన రోజు..
ఆదర్శాలని విందుగా పెట్టిన రోజు..
ఈ రోజు..మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు..
సమస్త దేశం..గణతంత్రమని  ప్రకటించుకున్న రోజు..
స్వపరిపాలనకి, స్వతంత్ర వ్యవస్థకి  శ్రీకారం చుట్టిన రోజు..
సామ్యవాదపు భారతావనిని సాకారంగా చూపిన రోజు..
అందుకే  సకలం.. సమైక్యమై..సమాయత్తమై...సగర్వంగా...
జై హింద్ అంటూ నినదిద్దాం..వందేమాతరమంటూ గర్జిద్దాం.. 
***********************************
written by BODDU MAHENDER
at 1am 26.1.2013
Happy Republic Day to All Indians....

Wednesday, 23 January 2013

జాతిని జాగృతం చేసిన మహనీయా..



అడిగి తీసుకునేది కాదు స్వాతంత్ర్యం..
హక్కుగా ఆనందించేది స్వాతంత్ర్యం..
మన రక్తంతో దాన్ని సాధిద్దాం..
భరతమాత నుదిటన తిలకంగా దిద్దేద్దాం..
అమర జవానులుగా మారుదాం మనం..  
అఖిల భారతావనికి రక్షణగా నిలుద్దాం మనం..
అని నినదించి , సేనని నిర్మించి
జాతిని జాగృతం చేసిన మహనీయా..  
నీకు వందనం..అభినందనం...
జై హింద్ ..!!
*******************************

written by BODDU MAHENDER
at 7:57pm 23.1.2012
జోహార్ జోహార్ సుభాష్ చంద్రబోస్

Sunday, 26 August 2012

అండమాన్ లోని సెల్యూలర్ జైలు..


మరణమే ముక్తి అనిపించే ఖైదులు..
మాటలినిపించకుండా మూగని చేసే గదులు..
కఠిన శిక్షలకు, కరకు గుండెలకు ఆనవాలం..అది.
కన్నీటి రొదలకు, కరగని వ్యధలకు స్వస్థలం..అది.
తొలిసారి జాతీయ జెండా ఎగిరింది ఇక్కడే..
జాతి సమైక్యత భావం నినదించింది ఇక్కడే..
అదే మన అండమాన్ లోని సెల్యూలర్ జైలు..
కాలాపానిగా కూడా పిలిచే కాలకూటాల జైలు..
పారిపోనీకుండా...పట్టు విడువకుండా..
పగ సాధించాలనే పరాయి పాలకులకి,
ప్రాణం పోయినా..పట్టుదల విడువని,
స్వరాజ్య కాంక్ష వీరులకి,
ఇదొక చారిత్రక తార్కాణం..
సంస్మరణ నిర్మాణం..
**********************
written by ME
at 1:25am 27.8.2012

Tuesday, 14 August 2012

స్వాతంత్ర్యం అంటే కాదురా విచ్చలవిడితనం..


ఈనాటి ఈ స్వేచ్ఛా వాయువు
ఎంతమంది ఆయువు తీసిందో తెలుసా..
ఈ నాటి నీ విజయ గర్వం,
ఎంతమంది రక్తం పీల్చిందో తెలుసా..
తలవరా..కొలవరా...
నాటి మేటి మహా నేతలని
నీ గుండెల్లో నిలపరా..
వారు చూపిన చేతలని, బాటలని 
స్వాతంత్ర్యం అంటే కాదురా విచ్చలవిడితనం..
నీ మాతృభూమి గౌరవాన్ని పెంచే విద్యుక్త ధర్మం..
జై హింద్ ...!!
***********************
written by ME
at 12pm 15.8.2012

నేను.. ఈ దేశ జాతి పతాకను..

నేను.. ఈ దేశ జాతి పతాకను..
ఫరిడవిల్లుతున్న ప్రజాస్వామ్య కీర్తి పతాకను..
అరవై ఆరేళ్ళ ప్రాయాల పసికూనను..
అఖిల భారత జనాల ముద్దు బిడ్డను..

పింగళి వెంకయ్య కళ నాకు రూపమిస్తే,
గాంధీజీ కల నాలో జీవం నింపింది..
అమరులెంతో మంది వారి రక్తమోడితే,
ఆ తెల్లవాడి శృంఖలం నా నుండి తెగిపడింది...

అహింసా మార్గాన గెలిచిన తొలి కాంక్ష నేను..
అందరిని ఒకటిగ చేసిన నిజ స్ఫూర్తి నేను..
ఆ సేతు హిమాచలం ప్రసరించే కాంతిరేఖ నేను..
ఆత్మ గౌరవం ప్రస్పుటించే శాంతి లేఖ నేను..

మీ విజయగర్వాలకిపుడు పొలికేక నవగా 
విజ్ఞాన జ్యోతుల చమురుబుడ్డి నవగా 
మరో మారు ఎగురుతున్నా..
మహిని ఏలే దర్పం తో....
మరో అంచె ఎదుగుతున్నా...
నింగిని తాకే దాహంతో..
*************************
written by ME
at 8am 30.7.2012
ఈ కవిత ఈ నెల విహంగ మాస పత్రికలో ప్రచురితమైనది.
http://vihanga.com/?p=4848 లింక్ లో దాన్ని చూడవచ్చు.
***********************************
భారతీయులందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు..

Wednesday, 25 July 2012

తిన్నామా..తిరిగామా..పడుకున్నామా..


తిన్నామా..తిరిగామా..పడుకున్నామా..
మీ ఆలోచన అంతవరకే అయితే..
వేరొకరిని వేలెత్తే చూపే అర్హత మీకు లేదు..
సాటి వాని హితం,సమాజ సంక్షేమం
మీకో నిత్య కృత్యమైతేనే....
ఈ దేశం బాగు పడేది..భావితరం సుఖ పడేది..
Jai Hind
******************************
written by ME
at 5:30pm 25.7.2012

Friday, 13 July 2012

నీ దేశం కోసమే జీవించడం..


మహనీయుల త్యాగాల్ని కీర్తించడం కాదు..
మహాత్ముల సూక్తుల్ని వల్లె వేయడం కాదు..
నీలో నీవే మధన పడటం కాదు..
నిను పాలిం చే వాళ్ళని నిందించడం కాదు..
దేశ భక్తి అంటే..
ఆదర్శనీయ పథాన్ని అనుసరించడం..
అందరినీ సమానంగా ప్రేమించడం..
అవసరమైతే ప్రాణ త్యాగానికైనా నెరవకపోవడం..
ఆఖరి ఘడియ దాకా నీ దేశం కోసమే జీవించడం..
*********************************
written by BODDU MAHENDER
at 10:45am 14.7.2012

దేశ భక్తి అంటే..


ఎలుగెత్తి నినదించడం కాదు..
ఏడాదికోసారి స్మరించడం కాదు..
గుండెలవిసేలా రోదించడం కాదు..
రోమాంచితంగా సినిమాల్లో చిత్రించడం కాదు..
దేశ భక్తి అంటే..
ఎదురెళ్ళి అన్యాయాన్ని ఎదుర్కోవడం..
ఎదుట ఉన్న అవినీతిని ఎండగట్టడం.. 
నిను కమ్మేసిన అజ్ఞానాన్ని పారద్రోలడం..
నీ సాటి వాటి ప్రతిభకి జై కొట్టడం..
************************
written by BODDU MAHENDER
at 9:45am 14.7.2012