Showing posts with label విరహ కవితలు. Show all posts
Showing posts with label విరహ కవితలు. Show all posts

Tuesday, 24 September 2013

జత లేక జాగరణ అలవాటయ్యింది..

మనసెందుకో ఒంటరయ్యింది..
మన అనే తోడు మాయమయ్యింది..
జత లేక జాగరణ అలవాటయ్యింది..
జలతారు వెన్నెల జాలితో జారిపోయింది..
ప్రేమా..
నీ దాహం నాలో ఇంకా తీరలేకుంది..
అయినా నీ మోహం నాపై పడలేకుంది..
నా కల ఇప్పటికీ నిజమై నిలవలేకుంది..
నీ రూపుగా నా ఎదురుగా చూపలేకుంది..
******************************
written by BODDU MAHENDER
at 10.44pm 24.9.2013

Friday, 26 April 2013

నా హృదయానికి ఉరివేస్తోంది చూడు...

ఎందుకీ మౌనం?
తల్లడిల్లుతుందేం నా ప్రాణం..?
రెప్ప వేయలేను.. కన్ను మూయలేను..
మనసు మూగబోయింది ..
మాట  నిల్చిపోయింది..
ఇష్టం కష్టమయ్యింది..
శ్రేష్టం అరిష్టమయ్యింది..
నీ ఊహే నన్ను ఊరడిస్తుంది అనుకున్నా,
నీ ప్రేమే నాకు ఊపిరిపోస్తుంది అనుకున్నా
కానీ అదే నా ఉసురుతీస్తోంది నేడు..
నా హృదయానికి ఉరివేస్తోంది చూడు...
******************************
written by BODDU MAHENDER
at 10:04pm, 26.4.2013

Monday, 31 December 2012

నా ప్రియతమ నేస్తం..

నా మూడో నేస్తం..ముచ్చటగా మురిపించిన నేస్తం
మళ్ళీ మళ్ళీ తిరిగిరాలేని నేస్తం..
నా జీవితాన్ని మలుపు తిప్పి వెళ్తున్న నేస్తం..
నా కళని వెలికి తెచ్చిన నేస్తం..
నా కలని సాకారం చేసిన నేస్తం..
నైతిక విజయాన్ని,మానసిక స్థైర్యాన్ని
మన అనుకునే కొన్ని మంచి మనసుల్ని 
నాకు అందించిన నేస్తం...నా ప్రియతమ నేస్తం.. 
ఇపుడిక తెరమరుగవుతోంది..
జ్ఞాపకాల పేజీల్లో నిలిచిపోబోతోంది.. 
చరిత్రగా మిగిలిపోబోతోంది..
చిరస్థాయిగా నా గుండెల్లో ఒదిగిపోబోతోంది..
అదే ఈ 2012…..ఐ మిస్ యూ 2012..
నువ్వు నాకు జీవమిచ్చావు..నా జీవితానికి వెలుగునిచ్చావు..
ఐ నెవర్ ఫర్గెట్ యు..మై డియర్..
********************************
written by BODDU MAHENDER
at 10:30pm 31.12.2012

I MISS YOU... 2012

Tuesday, 25 December 2012

నువ్వు నా వ్యసనం,వ్యవహారికం..


ఇష్టం,ప్రేమ,ఆరాధన,వ్యామోహమో కాదు..
నువ్వు నా వ్యసనం,వ్యవహారికం..
బంధం,అనుబంధం,బంధుత్వం,సహగమనం కాదు..
నువ్వు నా సమస్తం, సహజీవనం..
ఎలా చెప్పను నువ్వే నేనని.. నీకోసమే ఉన్నానని..
ఇంకెలా చెప్పను..నీ తోడులేక నేను 
ఓ జీవచ్చవమై వెళ్లదీస్తున్నా అని..
****************************
written by BODDU MAHENDER
at 11:25pm 25.12.2012

Thursday, 6 December 2012

నీ ప్రేమే లేకుంటే......


ఎందుకో ఇది నాకర్ధం కాదు
నీ ఎడబాటు సమర్ధం కాదు..
మమకారం ఎప్పుడూ వ్యర్థం కాదు..
మనసున నిను నిలుపుకోవడం నా స్వార్ధం కాదు..

నీ గురించి పదే పదే అడగడం అపార్ధం కాదు..
నీవు లేక నేను ఉంటాను అనుకోవడం యదార్థం కాదు.. 
నీ ప్రేమే లేకుంటే నా బ్రతుకిక చరితార్థం కాదు..
నాలో నేనై ఏ గమ్యం చేరడం.. సాధ్యం కాదు..
******************************
written by BODDU MAHENDER
at 1:09pm 7.12.2012

Saturday, 1 December 2012

ఆ మాటే నువ్వు పలకనంటే..


మాటే కదా..
అనుభూతుల వ్యక్తీకరణ
ఆలోచనల ఆవిష్కరణ
మాటతోనే కదా..
మనసుల వశీకరణ..
మమతల సమీకరణ..
ఆ మాటే నువ్వు పలకనంటే..
నా తోటే నువ్వు ఉండనంటే..
ఇక బ్రతికేది ఎలాగే..?
మన బంధం నిలిచేది ఎలాగే..?
నీ మౌనం నాకు వేల ప్రశ్నలని సంధిస్తోంది..
ప్రతీ క్షణం నాకు నరకాన్నే చూపిస్తోంది..
************************
written by BODDU MAHENDER
at 8:10pm 1.12.2012

Sunday, 25 November 2012

ఎప్పుడో నా పెళ్లి ఎప్పుడో..??


ఎప్పుడో నా పెళ్లి ఎప్పుడో..??
వరాల ఇంతి వధువుగా మారి
నాకు జతగా వచ్చేదెప్పుడో..
సుగుణాల రాశి సుకన్యగా మారి  
నా యెదలో సందడి చేసేదెప్పుడో..

ఊహలెన్నో ఉన్నాయి ఊసులుగా చెప్పేందుకు..
బాసలెన్నో ఉన్నాయి బాధ్యతగా నడిచేందుకు..
సఖియా.. నా సరిజోడుగా నువ్వచ్చేదెప్పుడే..
నా కలల వనంలో కాంతిరేఖగా నిలిచేదెప్పుడే..

ఊరూవాడా మారుమోగాలి మన పెళ్లి సంబరం..
సీతారాముల కళ్యాణాన్ని గుర్తుచేయాలి ఆ ఆడంబరం..
కానీ , ఇంతకీ నువ్వచ్చేదెప్పుడే..
ఈ కలల తెరలు చీల్చి కనుల ముందు నిల్చేదెప్పుడే..
కళ్యాణతిలకం దిద్దుకొని నాతో సప్తపది నడిచేదెప్పుడే..
మన మనసులనే మాంగళ్యం చేసి నీకు ముడి వేసేదెప్పుడే..
**********************************
written by BODDU MAHENDER
at 12:52pm 26.11.2012

Saturday, 10 November 2012

నా స్వప్నం సాక్షాత్కరించేనా..?


ఈ వెన్నెల తాపాలు...నా వెచ్చని ఊహలు..
తీరేది ఎన్నడే...నెరవేరేది ఎన్నడే..
నీ సందింట నిలిచి..నీ హృదయము వలచి..
మనమయ్యే మాట నా మనసుని తాకేది ఎన్నడే..
నా స్వప్నం సాక్షాత్కరించేనా..?
నీ వలపుని సూత్రీకరించేనా..??
************************
written by BODDU MAHENDER
at 10:35pm 10.11.2012

Thursday, 8 November 2012

కానీ.......




అందని దానికోసం అంతులేని ఆరాటం..  
ఆశ అడియాసల మధ్య ఊగిసలాడే పోరాటం..
క్షణం వద్దంటోంది ..క్షణం వీడొద్దంటోంది..
కానీ , ఏ క్షణం నాతో నిలవలేనంటోంది..
ఎందుకనే ప్రశ్నకి జవాబే లేదు ఇంతవరకి..
ఎడబాటు అనే తీరుకి అర్ధమే లేదు నా మనసుకి..
******************
written by BODDU MAHENDER
at 10:32pm 8.11.2012

Thursday, 25 October 2012

పడతి ప్రణయం కోసం ....

బుద్ధి వద్దంటోంది..సుద్ది చెబుతోంది..
మది విననంటోంది..మారాం చేస్తోంది..

కంట ఒలికిన నీరు కాల్వలై పారుతోంది..
గుండె పలికిన మాట కవితలై పొంగుతోంది..

తోడులేని వాడినని తొలిసారి చెబుతోంది..
కోరకూడని ఆశ అని కోపంగా చూస్తోంది..

అయినా పట్టుదల నన్ను పరుగులెత్తిస్తోంది..
పడతి ప్రణయం కోసం ప్రాధేయ పడమంటోంది..
****************************
written by BODDU MAHENDER
at 10:45am 26.10.2012

Sunday, 21 October 2012

నీపై నా నమ్మకాన్ని రుజువు చేస్తావా..


నిను తలచే యే నా తలపైనా..
నీ గుండె తలుపు తడుతుందా..?
నీకై కార్చే యే నా కన్నీటి చుక్కయినా..
నీ మనసు తడి చేస్తుందా..?

ప్రేమా...
నీపై నా నమ్మకాన్ని రుజువు చేస్తావా..
తనలో సగమయ్యే అవకాశం నాకిస్తావా..
*************************
written by BODDU MAHENDER
at 11:52am 22.10.2012

Friday, 27 July 2012

నీ పిలుపులో పులకరించాలని..


క్షణానికోసారి తడిమి చూస్తున్నా..�
క్షమిస్తావని ఎదురుచూస్తున్నా..�
నిమిషానికోసారి నిను పిలుస్తున్నా..
నీవే లేక నీరసించి పోతున్నా..�
చెలీ..
నీ పిలుపులో పులకరించాలని..�
వలపుల తడిలో  నానుతూ ఉన్నా..�
నీ చేరువలో చిగురించాలని �
ఆశల మడిలో పొదుగుతూ ఉన్నా..�
*********************
written by ME
at 10:42pm 27.7.2012

Tuesday, 10 July 2012

ఓ మెసేజ్ ఇవ్వు..


మరిచిన నా పెదవి పై ఓ నవ్వునివ్వు..
మనసున ఓ మూలన చిన్ని ఆశనివ్వు..  
కన్నా...నీ దాననురా అంటూ ఓ మెసేజ్ ఇవ్వు..
కడదాక వీడనంటూ చిన్న కమిట్ మెంట్ ఇవ్వు.. 
*********************************
written by BODDU MAHENDER
at 5:15pm 10.7.2012

Sunday, 8 July 2012

నెరవేరని ఆశలు రేపకే..


ఒంటరితనం వేధిస్తోంది..
ఓ తోడుకై తపిస్తోంది..
ప్రేమ రాగం ఆలపిస్తోంది..
ప్రేయసి జతకై విలపిస్తోంది..

మనసా నీ ఈ కలవరమేంటే..??
నాలో రేగే.. అలజడిని ఆపే..
నెరవేరని ఆశలు రేపకే..
నిశ్చల నదిలో ఉరవడి పెంచకే..
*********************
written by ME
at 10:35pm 8.7.2012 

Friday, 6 July 2012

రాస్తూనే ఉన్నా...


రాస్తూనే ఉన్నా...  
మన  అనుభూతులనే అక్షరాలుగా..
అనుభావాలనే సిరాతో..

చూస్తూనే ఉన్నా...
నీ మనసునే ప్రతి పేజీగా..
ప్రేమ నిండిన కన్నులతో..

కంటూనే ఉన్నా..
నీ కలలనే నా గమ్యాలుగా..
మళ్ళీ కలవాలనే కోరికతో..

వింటూనే ఉన్నా...
నీ నవ్వులనే గుండె సడిగా..
తొలిప్రేమ చేసిన మాయతో...
********************
Written by ME
at 9:45pm 6.7.2012

Wednesday, 4 July 2012

కలతల సడితో ఎదురుచూస్తున్నా..


నా ప్రతి గంతులో..
ఓ ఘర్షణ ఉంది..
ప్రతి పట్టులో..
ఓ వేదన ఉంది..
ప్రతి కొమ్మకు
ఓ జ్ఞాపకం ఉంది..
ప్రతి ముద్దలో..
తన లాలన ఉంది..

యే పొద్దు తనతో కలుపునో..
నా ముద్దు మురిపెం తెలుపునో..గాని  
కన్నీటి దారుల్లో..
కలతల సడితో ఎదురుచూస్తున్నా..
కమ్ముకున్న చీకట్లలో..
కుమిలి కుమిలి ఏడుస్తున్నా..
**********************
wriitten by ME
at 9:30pm 4.7.2012

కనులు ముందు నిలవలేవా..?


నిన్నే తలచీ తలచి నిదురే మరచితినే..
నీకై వగచీ వగచి మైకంలో ఒరిగితినే..
కనుపాపలో ఒదిగిన నీవు..
కనులు ముందు నిలవలేవా..?
యెద సడిగా మారిన నీవు..
యెద లోతులు ఎరగలేవా..??
************************
written by ME
at 5:05pm 4.7.2012

Tuesday, 26 June 2012

ఎక్కడే నా సఖుడు..?


ఎక్కడే నా సఖుడు..?
నా ప్రాణమైన విభుడు..
చూపులకి అందడు..
మాటలకి దొరకడు..
కలగానూ కలవడు..
నా ఊహగానూ నిలవడు..

ఎప్పుడొస్తాడో అని ఎదురుచూస్తోంది ఈ ప్రాణం..
తన సన్నిధిలోనే తరించాలనే నా ప్రతి కణం..
***************************
written by ME
at 9:26pm 26.6.2012

Friday, 22 June 2012

అది నీకు తెలీదు..


ఆ  తారకలే నాలో ఆలోచనలు..
ఈ తామరలే నా ప్రేమారాధనలు..
ఎంత తపించినా అది నీకు తెలీదు..
నీ వెలుగు సోకనిదే నా మది వికసించదు..
 *************************
written by ME
at 9:45pm 22.6.2012

Wednesday, 20 June 2012

ఆ ఆశతోనే....


ఏదో రోజు నువ్వు తిరిగిరావా...
అనే ఆశతోనే జీవిస్తున్నా..
నను వలచి నా జంట కావా...
అనే ఊహలోనే కాపు కాస్తున్నా...

చెలీ...
నా ప్రేమకి మరపు లేదే.. 
నీవే ప్రాణమైన ఈ గుండెకి అలుపు రాదే..
***********************
written by ME
at 11:45am 20.6.2012