Showing posts with label భక్తి కవితలు ... Show all posts
Showing posts with label భక్తి కవితలు ... Show all posts

Thursday, 27 February 2014

ఓ భోళా శంకరా..!!

ఓం నమః శివాయ 
ఓం నమః శివాయ 

పంచాక్షరిని జపిస్తూ
ప్రణవ స్వరూపునిగా స్మరిస్తూ
అభిషేకాలతో అర్చిస్తూ
ఆది దేవుడిగా కీర్తిస్తూ
జాగరణతో నోముదుమయ్యా
ఓ భోళా శంకరా..!!
జాతరలే చేయుదుమయ్యా
మా భక్తవ శంకరా..!!
****************************
written by BODDU MAHENDER
at 6:55pm, 27.2.2014
అందరికీ మహా శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు.
ఆ దేవదేవుడి ఆశీస్సులు సదా మీపై ఉండు గాక ...!!

Sunday, 8 September 2013

ఆశ్రిత భక్తుల సర్వసిద్ధి ప్రదాయ ...

చవితి నాడు పుట్టినావని గాని, 
ఓ  చతుర్భుజాయ
నీ శరణు కోరని క్షణముందా..
మా సంకట హరాయ

నవరాత్రుల వేడుకుందని గాని
ఓ  గజముఖ రూపాయ
నీ చరణం వీడిన దినముందా..
సర్వ మంగళ ప్రదాయ 

ఓం నమో నమః  శ్రీ పార్వతీ సుతాయ
ఆశ్రిత  భక్తుల  సర్వసిద్ధి ప్రదాయ
ఎప్పటిలానే ఇపుడూ అందుకో రావయ్యా 
మా ఆతిథ్యాల భక్తి పూ మాలయ్యా..!
******************************
written by BODDU MAHENDER
at 11:06 am 9.9.2013

అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు 

Wednesday, 23 January 2013

సాయీశా..సర్వేశా..

సాయీశా..సర్వేశా..
చంచలితము,
ప్రలోభ పూరితమగు ఈ మనో వికారాల నుండి,
నన్ను శుద్ధి చేయగా రావా దేవా..
నా ప్రార్థన ఆలకించగా లేవా దేవా.. 
******************************
written by BODDU MAHENDER
at 8:41am 24.1.2013

Monday, 24 December 2012

అందరికీ క్రిస్టమస్ శుభాకాంక్షలు...

దైవ కుమారుని జననం..
ధరిత్రి చరితనే సుదినం..
శాంతి ప్రేమల సమ్మోహనం..
స్మరించిన వారి యెదే పావనం..
**************************
written by BODDU MAHENDER
at 7:05pm 24.12.2012

అందరికీ క్రిస్టమస్ శుభాకాంక్షలు 

Tuesday, 27 November 2012

పరంజ్యోతులుగా మిము కొలిచేమురా..


సర్వమంగళ గౌరీ.. సౌభాగ్యమీయవే..
శ్రీ మహాలక్ష్మీ.. సిరిసంపదలీయవే...
శివశంభో హరా..మా కష్టం మాపరా..
శ్రీమన్నారాయణా...సుఖశాంతులివ్వురా..
పరంజ్యోతులుగా మిము కొలిచేమురా..
పరి పరి తపములతో ప్రార్థించేమురా..
జ్ఞానజ్యోతులని మాలో వెలిగించగా రారా..
కరుణించి మా  కాంక్షలు నెరవేర్చి పోరా..
*************************
written by BODDU MAHENDER
at 7:20am 28.11.2012

అందరికీ కార్తిక పౌర్ణమి శుభాకాంక్షలు..

Tuesday, 23 October 2012

అబల కాదు సబల అని ...



శాంత మూర్తి, సహన మూర్తి
శక్తి స్వరూపిణిగా మారెను నేడు..
ఆధిపత్యంతో చెలరేగిన ఆ మహిషుని
అంతమొందించెను చూడు..
అఖిల దేవతలు చేయలేనిది 
ఒక స్త్రీ మూర్తి చేసెను చూడు..
అబల కాదు సబల అని
ఈ లోకానికి చాటెను చూడు..
******************
written by 
BODDU MAHENDER
at 2:54pm 23.10.2012

Sunday, 23 September 2012

వినాయక విన్నపం...


నిస్వార్ధ నిర్మల భక్తి చాలురా భక్తా..
నిజ హృదయ పూజ చాలురా భక్తా..
వగలుపోయే ఈ వర్ణాలెందుకు..??
కృత్రిమమైన ఆ సొగసులెందుకు..??
నా వరాల కోసం 
ప్రకృతి ప్రసాదాలని కలుషితం చేస్తారా..??
స్వచ్ఛమైన జలాల్ని విషపూరితం చేస్తారా..??
మట్టి అయినా..మాణిక్యమైనా నాకొకటేరా...
కుబేరుడైనా , కుచేలుడైనా నా తత్వం మారదురా..
ఆడంబరాల మోజులో 
మీ ఆరోగ్యానికి హాని తెచ్చుకోవద్దు..
ఆ పై ఆ అపనిందని 
నాపై వేయ పూనుకోవద్దు..
ప్రేమతో పూజిస్తే గడ్డి పరకైనా నాకానందమే..
హితాన్ని ఆశిస్తే మట్టి విగ్రహమైనా ఆహ్లాదమే..
శుభం భుయాత్..!!
******************************
written by BODDU MAHENDER
at 10:30am 19.9.2012

Monday, 9 July 2012

పరమ శివా...


నీకోసం కాదు..
నిను నమ్మిన వారికోసం జీవించు..
నీ తోడై నిలిచే సతిని
నీ అర్ధభాగంలా ప్రేమించు..
నిరాడంబరతే ఉన్నా..
నీవు ఓ శక్తి రూపుడివని గ్రహించు..
నీ తోటి జీవజాతులని 
నిర్మల హృదయంతో సేవిం చు..
నిఖిల లోకం హర్షిస్తుందంటే..
నిను చంపే విషాన్నైనా భరించు..
నీ అస్తిత్వానికే ముప్పు తెస్తే..
నీ వైరిలోని ఆ అహాన్ని హరించు..
అని చాటిన..
పరమ శివా...
మా వందనాలు అందుకోవా..
మము కాచే దైవమై..
మాలోనే ఉండిపోవా...
***********************
written by ME
at 8:10am 10.7.2012

హే కృష్ణా...!!


ఏది నీది..? ఏది నాది..?
మనది అనుకుంటేనే మమకారం..
మానవత చూపితేనే మాధవుని ఆకారం..
కట్టు తప్పితేనే వికారం..
కట్టడిగా ఉంటేనే అఖిల సత్కారం..
అంటూ...
సకల జీవిత సారాన్ని ప్రవచించిన ...
హే కృష్ణా...!!
నీవేగా...సృష్టిలో ఓంకారం..
మా జీవన సఫలతకి సాకారం..
**************************
written by ME
at 7:45pm 9.7.2012

కాదా నీ నామమే ఓ మంత్రం..


భక్తికి మతం లేదు..
పూజకి కోవెల లేదు..
ఆరాధనకి అంతం లేదు..
అనుగ్రహంలో ఏ తేడా లేదు..
సాయీశా...!!
కాదా నీ నామమే ఓ మంత్రం..
నీ స్మరణలో మాకు రక్షక తంత్రం...
************************
written by ME
at 4:55pm 9.7.2012

Friday, 2 December 2011

సాయి నాథా ....

ఆదుకోమని అర్ధిస్తే అభయ  హస్తం అందిస్తావు ..
అభాగ్యులమని తలపోస్తే ..
అష్ట సిరులు  అనుగ్రహిస్తావు 
రూపులో ఫకీరు వయినా  
ప్రేమలో   అమీరు వయ్యా 
నీటితో దీపాలు వెలిగించావు ..
భిక్షతో పాపాలు  కడిగేసావు..
మా మనసులని శుద్ధి చేసి 
నీ భక్తి పాదు ను నాటావు 
మసీదు మందిరం   ఏదైనా
పాలించే ధైవమొక్కటే  అన్నావు 
మతాలు  కులాలు వేరైనా 
జాతి అంతా ఒక్కటని చాటావు..
సాయి నాథా  నీ  చరితం మధురం 
నిను కీర్తిస్తూ    చేసే 
మా ప్రతి  పనీ మధురం మధురం
********************************
written by ME,
at 9:50 am, 12.4.2010
********************************
ఈ  కవిత ఆంధ్రభూమి మాస పత్రిక  మార్చి 2011 సంచిక  లో ప్రచురించబడింది  ..