Sunday, 23 September 2012

వినాయక విన్నపం...


నిస్వార్ధ నిర్మల భక్తి చాలురా భక్తా..
నిజ హృదయ పూజ చాలురా భక్తా..
వగలుపోయే ఈ వర్ణాలెందుకు..??
కృత్రిమమైన ఆ సొగసులెందుకు..??
నా వరాల కోసం 
ప్రకృతి ప్రసాదాలని కలుషితం చేస్తారా..??
స్వచ్ఛమైన జలాల్ని విషపూరితం చేస్తారా..??
మట్టి అయినా..మాణిక్యమైనా నాకొకటేరా...
కుబేరుడైనా , కుచేలుడైనా నా తత్వం మారదురా..
ఆడంబరాల మోజులో 
మీ ఆరోగ్యానికి హాని తెచ్చుకోవద్దు..
ఆ పై ఆ అపనిందని 
నాపై వేయ పూనుకోవద్దు..
ప్రేమతో పూజిస్తే గడ్డి పరకైనా నాకానందమే..
హితాన్ని ఆశిస్తే మట్టి విగ్రహమైనా ఆహ్లాదమే..
శుభం భుయాత్..!!
******************************
written by BODDU MAHENDER
at 10:30am 19.9.2012

No comments:

Post a Comment