Showing posts with label my photo comments in surya sunday. Show all posts
Showing posts with label my photo comments in surya sunday. Show all posts

Tuesday, 13 December 2011

భళిరా మానవా ...!!



భళిరా   మానవా ...!!
నీ  సృజనకు  హద్దుల్లేవు .
ఆలోచనకు  అవధుల్లేవు .
చిద్రమైన  ఓ జీవితాన్ని ,
చిగురించని  కొమ్మలలో ,
భలే  చక్కగా  చూపినావు  రా ..!!
***************************
written by ME
May 17, 2010 at 1:11 AM


ఈ  ఫోటో కామెంట్ సూర్య దిన పత్రిక ఆదివారం సంచికలో
24.5.2010 నాడు ప్రచురితమైనది ..

ఏమిటీ పరికరం ...


ఏమిటీ  పరికరం ...
ఇది  తీసింది  -
నా  ప్రతి రూపమా ...
నా  రూపానికి  ప్రతిసృష్టి యా ..?
*************************
written by ME
May 10, 2010 at 9:36 AM
 ఈ  ఫోటో కామెంట్ సూర్య దిన పత్రిక ఆదివారం సంచికలో
17.5.2010 నాడు ప్రచురితమైనది ..

Monday, 12 December 2011

బొద్దుగుమ్మల మధ్య

బొద్దుగుమ్మల మధ్య ఓ ముద్దుగుమ్మ
ఆ భారీకాయులతో కుస్తీ పడకమ్మా....
గెలవగలనని ధీమా వద్దమ్మా .
వారి హైటు , వెయిటు నీకన్నా మోర్ అమ్మా....
*******************************

written by ME
at 11pm 15.11.2010

ఈ ఫోటో కామెంట్ సూర్య ఆదివారం సంచికలో 
22.11.2010 నాడు ప్రచురితమైనది .

Tuesday, 20 July 2010

పిల్లే అని లోకువగ చూడనేల ..?

పిల్లే   అని లోకువగ   చూడనేల ..?
పులి నై  నేను  గర్జించనా ..
కయ్యానికి   నువ్వు  కాలు  దువ్వితే ...
కసి  పంజాలతో  నిను  చెండాడనా ....!!
****************************
written by ME
at  9am 31.5.2010
****************************
ఈ ఫోటో కామెంట్ సూర్య ఆదివారం సంచికలో 
6.6.2010 నాడు ప్రచురితమైనది..

నోరు తెరిచిన కారు

నోరు  తెరిచిన   కారు 
చెయ్యమంది   షికారు 
చెప్పానంది  పుకారు 
పక్కనున్న  కొంతెకారు 
పిలుస్తుంటే  ఒకమారు 
అవుతోంది  గుండె  బేజారు ..
***********************
written by ME,
at 10am 6.6.2010
***********************
ఈ  ఫోటో  కామెంట్   సూర్య పేపర్ ఆదివారం సంచికలో 
13.6.2010 నాడు ప్రచురితమైనది ..

నీవు నడిచే వారధి .......

నీవు  నడిచే  వారధి  చిన్నదైనా ...,
నిన్ను  నడిపించే  ధైర్యం  గొప్పది .
బండెడు  భారాన్ని  భుజాన   మోస్తూ ..,
బ్రతుకు  సారాన్ని  మాకు  వివరిస్తూ ..,
అడుగు  తడబడకుండా ,
పట్టు  విడవకుండా ..
గమ్యాన్ని  చేరే  గడసరి ,
నిజ  జీవన  స్ఫూర్తి  నీవే  మరి ..
****************************
written by ME
at 5:43am 14.6.2010
****************************

ఈ ఫోటో కామెంట్ సూర్య పేపర్ ఆదివారం సంచిక లో 
20.6.2010 నాడు ప్రచురితమైనది ..

Monday, 19 July 2010

పట్టు జారితే ...

పట్టు  జారితే  పాతాళమే  ,
అటుపైన  స్వర్గ  ద్వారమే ,

ప్రయత్నిస్తే  ప్రాణాలు   పదిలమే ,
ప్రకృతి  పాటాలు అనుభవైక వేద్యమే.
********************

written by ME
at 5pm, 5.7.2010.

మనసుండాలే గాని.........

మనసుండాలే గాని మార్గాలెన్నో ........
ఆలోచన రావాలే గాని అవకాశాలెన్నో .........
విధి నిర్వహణలో ఒకవైపు ,
వినూత్నత ని  ప్రదర్శిస్తూనే .....
ప్రకృతి పరిరక్షణలో   తనవంతు ,
ప్రచారాన్ని సాగిస్తున్న
ఈ సొగసరి - బహు గడసరి .
**************************
written by ME,
at 9pm 21.6.2010
**************************
ఈ ఫోటో కామెంట్ సూర్య పేపర్ ఆదివారం సంచిక లో 
27.6.2010 నాడు ప్రచురితమైనది ...

భలే భలే బుల్లోడా ..

భలే  భలే  బుల్లోడా ..
బడాయి  చాలురా  చిన్నోడా.....
నీ  డాబు  దర్పం మాటున ,
దాచి  ఉంచిన  మందు  సీసాని ,
నేను  చూడలేదనుకున్నావా ?
నేను  చూడలేదనుకున్నావా ?
సూర్య  పత్రిక  పాటకులకు,
ఫోటో  కామెంట్  గా  రాసి ,
నీ  భాగోతాన్ని  చెప్పననుకున్నావా ?
నేను  చెప్పననుకున్నావా?

బాటిల్ ని బొమ్మగా..

బాటిల్ ని  బొమ్మగా  మలిచాడు ,
కేటుగాడు.... ,
బారు కే కొత్త  అందం  తెచ్చినాడు .
మీసాలు  గట్టిగా  మెలేసినాడు
నీటుగాడు.........,
తాగినోడే  మగాడని  చెప్పినాడు
************************

ప్రియా .... నిను చూడలేక ,

ప్రియా .... నిను చూడలేక ,
నేనుండలేక..........
వస్తేను ....ఇలా
చుస్తావేమి .. అలా .........
కన్నుల కల ...
ఎదురైతే ..నీలా ...
మరిచాను కాపలా ..
మాట్లాడవా .... ఈ వేల ...........
*****************************************