Showing posts with label శృంగార కవితలు. Show all posts
Showing posts with label శృంగార కవితలు. Show all posts

Tuesday, 11 December 2012

నీ ప్రేమకి కానుకగా..........


ఆపుకోలేని తపనలకి
అడ్డు చెప్పని ఆధరాలున్నా,
ఆత్మీయమైన భావనలని,
అందంగా చెప్పే మార్గమే ఇదంటున్నా..
చెలీ..కసి రేగిన కోరికతో కాదు..
కదిలించే నీ ప్రేమకి కానుకగా పెడుతున్నా..
ఆస్వాదిస్తానే ప్రియా.. నీ ప్రేమ ఆసాంతం..
నీతో ఉండే నా ప్రతి ఘడియ కాదా సుఖాంతం..
******************************
written by BODDU MAHENDER
at 10:22am 12.12.2012

Sunday, 4 November 2012

ముద్దు..


చతుర్దశ చుంబన క్రియల్లో
చతురత చూపువాడే చరితార్థుడు
మధురస మగువ అధరాలపై
మన్మోహన గాట్లు పెట్టేవాడే మగధీరుడు
కన్నె కోరికని పురి విప్పించేదే ఈ కమనీయ ముద్దు..
కామకోరికల రససిద్ధి కల్పించేదే ఈ రమణీయ ముద్దు..
ముద్దు ఎప్పుడూ చేదు కాదు..
ముదిత ముత్యాల సిరి లోన..
హద్దు ఎప్పుడూ దానికి లేదు..
హరివిల్లుగా అల్లుకున్న బంధాలలోన...
************************
written by BODDU MAHENDER
at 8:18pm 5.11.2012

Friday, 21 September 2012

తపన పెంచింది ఆ తన్మయత్వం ....


తడి పెదవుల జంట కోలాటం 

వేడి ముద్దుల గుండె ఆరాటం 
హద్దు దాటేసింది ఆవేశం 
పొద్దు కల్పించింది సన్నివేశం 
తపన పెంచింది ఆ తన్మయత్వం 
తమకం రేపినది నిండా కాముకత్వం 
ఇక జతగా చేయాలని ఉంది జాగారం 
తన కౌగిలే అవగా నాకు కారాగారం 
*********************

written by BODDU MAHENDER
at 11:45pm 14.9.2012

Friday, 7 September 2012

మరి రావే ..రావే..


ఈ విరహం, వియోగం ఇక చాలే చెలి..
నా మోహం, వ్యామోహం మరి తీర్చే సఖి..
రెక్క విచ్చిన కోరికలతో,
తమకం హెచ్చిన తలపులతో,
నీ దరి చేరినానే ఈ రేయి...
నీ లేత ముద్దుల ముడుపులతో
పరువపు హద్దుల విడుపులతో..
పొందాలని ఆ హాయి..
మరి రావే ..రావే..
నా మణి మాలిక..
నా ముచ్చట తీర్చవే..
మదనుడి మనో ఏలిక..
********************
written by ME
at 8:35pm 7.9.2012

Monday, 6 August 2012

సఖి పరువపు సొగసే...........


ఈ నిశి రేయే నాకో పండయినది..
తన చిలిపి ఊహే తీపి గుజ్జయినది..
ఆ నిండు చంద్రమే మా ఊసుకి విత్తయినది..
సఖి పరువపు సొగసే నా విరహానికి సొత్తయినది..
****************************
written by ME
at 10:25pm 6.8.2012

Friday, 13 July 2012

ఎవరూ లేని ఏకాంతంలో......


ఎవరూ లేని ఏకాంతంలో 
ఏకమై పోదాం
నువ్వూ- నేను 
మనమై పోదాం
పెదాల తీపికి 
రుచి మరిగేద్దాం
దేహాల వేడిలో
చలి కాచుకుందాం
************************
written by BODDU MAHENDER
at 9:25am 13.7.2012

Saturday, 7 July 2012

ఈ రేయి ఇలాగే ఆగిపోనీ..

ఈ రేయి ఇలాగే ఆగిపోనీ..
నీ తోడుగా నేనెప్పటికీ నిలిచిపోనీ..
విరహమంతా ఈ చీకటిలా తొలిగిపోనీ...
ఆ తొందరంతా పండు వెన్నెలగా పరుచుకోనీ...
సంతోషమే మనతో ఉండిపోనీ..
సరసంగా కాలం గడిచిపోనీ..
ప్రేమనే ప్రాణంగా మనం నిలుపుకోనీ...
జీవం ఉన్నంతవరకు జతగా సాగిపోనీ..


ఈ రేయి ఇలాగే ఆగిపోనీ.. 
నీ తోడుగా నేనెప్పటికీ నిలిచిపోనీ..
*************************
written by ME
at 1:15am 8.7.2012

Sunday, 20 May 2012

ఈ మహినే నీ వశం చేస్తా..


నీ వలపులో ఎపుడో బంధీనయ్యా..
ఇంకా ఈ వాలుజడ బంధనాలు ఎందుకే చెలీ..
ఓ పిలుపుకే అపుడే దాసోహమయ్యా..
ఇంకా ఈ ప్రేమికుడిపై పెత్తనమెందుకే సఖి..

నీ చూపొక్కటి చాలు..చిత్తం అంటా నీ ముందు..
ఆ నవ్వొక్కటి చాలు..నాట్యం చేస్తా కనువిందు..

మనసారా నను చేరవే...
మరణం అంచుదాకా నీతో నడుస్తా..
మధువులొలికే నీ ముద్దులీయవే..
ఈ మహినే నీ వశం చేస్తా..
మరోచరిత్రనే నే లిఖిస్తా..
 *******************
written by ME
at 8:50am 21.5.2012

Wednesday, 2 May 2012

జతగా ఈ జన్మంతా....

ప్రియా..
కాలమెరుగని ఓ ప్రణయానికి 
మనమే శ్రీకారం చుడదాం..
కాలమే తెలియని ఆ బంధానికి 
మనమే ప్రాకారం కడుదాం..
కలలన్ని కళ్ళ ముందు నిలుపుదాం..
కాంక్షలన్నీ కసిరేపుతూ చూపుదాం..
సరసంగా ముద్దులతో మొదలెడుదాం..
సంతోషంగా ఆ హద్దులని తుడిపేద్దాం...
నీలో నేనని మొత్తంగా కలిసిపోదాం..
నీకై నేనని మెత్తంగా హాయి పొందుదాం..
జతగా ఈ జన్మంతా ముడిపడిపోదాం..
లతగా ఈ వనమంతా అల్లుకుపోదాం..
**********************
written by ME
at 8:56pm , 2.5.2012

Thursday, 19 April 2012

మదన కోమలి..


ఆభరణాలతో నీ అందమంతటిని దాచేసినా,
ముసుగుతో నీ ముద్దు రూపాన్ని కప్పేసినా,
మౌనంతో నీ మనసుకి అడ్డు తెరలే  వేసినా...

చలువ వెన్నెల్లో కలువల్లా  కనిపించే 
నీ కైపు కన్నుల  కదలికలొక్కటి చాలే చెలి..
మత్తె క్కి  నీ ప్రేమలో.. పడేందుకు మదన కోమలి..
**************************
written by ME
at 7:38am 20.04.2012

Monday, 13 February 2012

ముద్దు

నీ  తడి  పెదవుల ,
వేడి  ముద్దులకే,
వేచాను  ఇన్నాళ్ళు..
నీ  ముద్దు  చేసే ,
మాయ  చేష్టలకి ..
మురుస్తున్నా  ఈనాడు ..

Ummmmaaaa...
********************
written by ME
at 4:38am 14.2.2012

Tuesday, 24 January 2012

ప్రియ సమ్మోహనం ..

అధర  మధురాల  రసాస్వాదనలో ..
జోడు హృదయాల భావావేశం.. 
సంగమించిన దేహాల శృంగార క్రియలో ..
పులకరించిన మనసుల ప్రియ సమ్మోహనం ..
ప్రేమా ..ప్రేమా..
******************************
written by ME
at 5:27pm,   26.3.2011