Showing posts with label విమర్శనాత్మక కవితలు. Show all posts
Showing posts with label విమర్శనాత్మక కవితలు. Show all posts

Friday, 11 April 2014

చిత్త’శుద్ధి’ లేని కవి పుంగవులారా..!!

మనలో మనకే వర్గపోరు
భాష కోసం, భావం కోసం
మనలో మనమే వైరి తీరు
అస్తిత్వం కోసం, ఆధిపత్యం కోసం
ఈర్ష్య , ద్వేషాలే మన అలంకారాలు
ఈసడించుకోవడంలోనే అక్షర ఘీంకారాలు
కుళ్ళు, కుతంత్రాలే  జ్ఞాన దీపికలు
కుంచిత భావంతోనే పద అమరికలు 
కళ్ళుండీ చూడలేని గుడ్డితనం మనది
కవి కాంచున్ అని బీరాలు పోయే ‘గొప్ప’దనం మనది
సిగ్గుపడరండి ఓ విశ్వనరులారా..!! 
చిత్త’శుద్ధి’ లేని కవి పుంగవులారా..!!
********************************
written by BODDU MAHENDER
at 5:10am 12.4.2014