నాలుగు గోడల మధ్య నరకంలో,
నాలో నేనే కుమిలిపోయాను..
నన్ను ఆవరించిన ఆ చీకట్లని,
తొల్చలేక నలిగి విసిగి పోయాను..
మిణుగురు పురుగుని చూసి
మిన్నులో తారక అనుకున్నాను..
మూరెడు తాడుతో ముల్లోకాలు,
చూడవచ్చు అనుకున్నాను..
ఊహలన్నీ రేగి ఉప్పెనై పోతుంటే,
ఆశలన్నీ విరిచి ఆయువు తీసి పోయావు..
ఓ నా అంతర్జాల అనుసంధానమా..
ఇదే నీ శక్తి సంవిదానమా...??
నా బాధలేవి నీకు పట్టవా..
ఆ విద్యుత్ విలయాన్ని అరికట్టవా..??
*************************
written by BODDU MAHENDER
at 7:30pm 18.9.2012

No comments:
Post a Comment