నేను.. ఈ దేశ జాతి పతాకను..
ఫరిడవిల్లుతున్న ప్రజాస్వామ్య కీర్తి పతాకను..
అరవై ఆరేళ్ళ ప్రాయాల పసికూనను..
అఖిల భారత జనాల ముద్దు బిడ్డను..
పింగళి వెంకయ్య కళ నాకు రూపమిస్తే,
గాంధీజీ కల నాలో జీవం నింపింది..
అమరులెంతో మంది వారి రక్తమోడితే,
ఆ తెల్లవాడి శృంఖలం నా నుండి తెగిపడింది...
అహింసా మార్గాన గెలిచిన తొలి కాంక్ష నేను..
అందరిని ఒకటిగ చేసిన నిజ స్ఫూర్తి నేను..
ఆ సేతు హిమాచలం ప్రసరించే కాంతిరేఖ నేను..
ఆత్మ గౌరవం ప్రస్పుటించే శాంతి లేఖ నేను..
మీ విజయగర్వాలకిపుడు పొలికేక నవగా
విజ్ఞాన జ్యోతుల చమురుబుడ్డి నవగా
మరో మారు ఎగురుతున్నా..
మహిని ఏలే దర్పం తో....
మరో అంచె ఎదుగుతున్నా...
నింగిని తాకే దాహంతో..
*************************
written by ME
at 8am 30.7.2012
ఈ కవిత ఈ నెల విహంగ మాస పత్రికలో ప్రచురితమైనది.
http://vihanga.com/?p=4848 లింక్ లో దాన్ని చూడవచ్చు.
***********************************
భారతీయులందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు..
No comments:
Post a Comment