Tuesday 11 February 2014

తెలుసుకొని..తేరుకొని..

చీకట్లోనే ఉన్నాను ఇన్నాళ్లు
చీకటిని తిడుతూ కాదు, వేడుతూ..
నన్ను తనతో దాచమని,
నన్ను తనలా మార్చమని..!!
కానీ వేకువనే చూశాను ఒకరోజు
వేల్పుగా కొలిచాను ప్రతిరోజు..

వెలుగు విలువ తెలియడానికే  చీకటని,
సుఖం స్థాయి పెంచడానికే కష్టమని
తెలుసుకొని..తేరుకొని..
నన్ను నేను మలుచుకున్నా  ఆ రోజు..
“నన్ను” నేను చూసుకుంటున్నా... ఈరోజు..   
*****************************
written by BODDU MAHENDER
at 5:49pm 11.2.2014

No comments:

Post a Comment