Saturday 3 August 2013

నాకు నేనే అయ్యా స్నేహితుడిగా..

ఎందుకో  స్నేహం నాకు సరిపడలేదు..
నిజం చెప్పాలంటే అది నాకు అచ్చి రాలేదు..
స్నేహం విలువ తెలిసిన వాడినయినా,
ఆ  స్నేహ మాధుర్యం ఎన్నడూ పొందలేదు..
ఏ నిజ స్నేహం నాతో చేయి కలపలేదు..
వంచించిన స్నేహాలు
నాలో స్నేహపు వాంఛని తగ్గించాయి..
వస్తువని భావించిన స్నేహాలు,
నన్ను వాడుకొని వదిలేశాయి..
అందుకే
నాకు నేనే అయ్యా స్నేహితుడిగా..
నా మనసునే చేసా దానికి సన్నిహితుడిగా..
**********************************
written by BODDU MAHENDER
at 12:46am 4.8.2013

No comments:

Post a Comment