కోరితే తప్పేముంది..?
వీడితే ముప్పేముంది..?
మా ప్రశ్నల్లో న్యాయం లేదా..?
మా పోరాటంలో ధర్మం లేదా..?
మా ఊపిరులకు విలువ లేదా..?
మా అస్తిత్వాలకి వీలు లేదా..?
ఆధిపత్యం వహించడమేనా..? సమైక్యం అంటే..?
హక్కులను హరించడమేనా..? సమైక్యం అంటే..?
విలీనం నాడే బానిసలయ్యాం..
విభేదాలు చూపినా భరిస్తూ వచ్చాం..
కాలి కింది నేలనే తవ్వితే సహించలేకపోయాం..
ఆత్మగౌరవ బావుటాలమై నింగికెగిసి పోయాం..
అయినా విద్వేషం లేదు.. విభజన పరమైన మార్పు తప్ప..
దురుద్దేశం లేదు.. దుర్నీతికి అంతం పలకడం తప్ప ..
*************************************
written by BODDU MAHENDER
at 5:06am 30.7.2013
No comments:
Post a Comment