Thursday 8 August 2013

ఈ ఉద్యమాలు ఆగవు..

స్వార్ధం, పక్షపాతం నాయకుల్లో ఉన్నంతకాలం
అహంకారం ఆధిపత్యం వహిస్తున్నంత కాలం
ఈ ఉద్యమాలు ఆగవు..
ఈ ఉద్రిక్తత తగ్గదు..
కలిసుంటే మంచిదే అని కలిస్తే,
కబళించుకుందామని కుట్రలు చేస్తే,
ఎంత అమాయకులైనా ఎదురుతిరగక తప్పదు.
ఏమార్చే వాళ్ళ అంతు చూడక తప్పదు.
హక్కులు లేని రాజ్యంలో,
ఆశలు చచ్చిన హృదయంలో,
ఆవేదనే అంతకంతకూ..
ఆత్మహత్య సదృశ్యాలే చివరికంటకూ..
*******************************
written by BODDU MAHENDER
at 11:20am, 9.8.2013

No comments:

Post a Comment