Saturday, 13 July 2013

అపురూపమైన ఆ క్షణాలని మళ్ళీ మళ్ళీ ఏరుకోవాలని

గతిస్తే కానీ విలువ తెలియలేదు
స్మరిస్తే కానీ గుర్తు నిలవలేదు
ఈ యాంత్రిక వడివడి జీవితంలో 
స్థితిగతులనే ఎంచి చూస్తున్న తరుణంలో 
మలినమంటని నా మనసు ముత్యాన్ని 
మరలి రాని ఆ బాల్యపు సొగసుని 
ఆర్ధ్రంగా తడుముతూ, ఆత్మీయంగా పొదుగుతూ.. 
అపురూపమైన ఆ క్షణాలని 
మళ్ళీ మళ్ళీ ఏరుకోవాలని 
అన్వేషిస్తున్నా .. 
అంతులేని నా గమ్యాల వైపు.. 
అలసట తీర్చే ఆశల తీరాల వైపు.. 
అందమైన చిలిపి ఊహల వైపు.. 
అచ్చమైన నా పసితనపు జాడల వైపు ...
*****************************
written by BODDU MAHENDER
at 12:40am 14.7.2013

No comments:

Post a Comment