ఎంత తుడుచుకున్నా
నీ రూపు కానరావట్లేదు
కన్నీళ్ళ జడిలో
ఈ బాధ తొలిగిపోవట్లేదు
గొంతు మూసుకు పోయి
గుండె కోసుకు పోయి
ఆశ చచ్చి పోయి
శ్వాస వీడిపోయి
బాసలన్నీ అభాసుపాలయిన వేళ
ఊసులన్నీ ఉరికొయ్యలైన వేళ
నన్ను నేను విడిచిపోతున్నా
నిన్ను నీకు చూపి పోతున్నా..
సెలవు..
శాశ్వతంగా.. :(
******************************
written by BODDU MAHENDER
at 11:28pm 25.5.2013
No comments:
Post a Comment