అమ్మకి అమ్మ అయితే గానీ
తీర్చుకోలేని ఋణం అది..
అమ్మకి బిడ్డ అయితే గానీ
పొందలేని భాగ్యం అది..
ఆ ప్రేమ అనిర్వచనీయం..
అనుభవైకవేద్యం..
ఏ సిరి దానికి సాటికాదు..
ఎవ్వరికీ తాను పోటీ కాదు..
అందుకే, అమ్మ ఎప్పుడూ అమ్మే..
నేల దిగి వచ్చిన జేజమ్మే..
*************************
written by BODDU MAHENDER
at 9:02am 12.5.2013
అందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు...
No comments:
Post a Comment