Saturday 17 December 2011

శివ సినిమాలోని " బోటనీ పాటముంది " అనే పాటకి రాసిన పేరడీ :

రాయల్ స్టాగ్ విస్కీ ఉంది 
ఓల్డ్ మంక్ రమ్ము ఉంది 
ఏ డ్రింకు తాగుదామురా ..
కోకైను పౌడర్ ఉంది 

గంజాయి చుట్ట ఉంది 
ఏ మత్తులో తూలుదామురా ..
విస్కీలు బ్రాండీలు తాగాబోకురా 
కాలేయానికి తూట్లు పొడవబోకురా..
గంజాయి నల్లమందు ముట్టబోకురా..
మత్తులో నీ మెదడు మోద్దుబారు రా ..


ఝలక్ ఝలక్ ఝలక్ ఝలక్ జాం
ఝలక్ ఝలక్ ఝలక్ ఝలక్ జాం 


సినిమాల్లో చూపినట్టు ..రింగు రింగుల పొగలూద్దాం..
తీయరా సిగరెట్ ప్యాక్ ని 
తిన్నదంతా అరిగేట్టు ..రాజసమే ఇధైనట్లు ..
నములరా పాను.. గుట్కాని
స్మోకింగ్ తో నోరంతా కంపుకొట్టు ..
గుట్కాతో పళ్ళన్నీ గార పట్టు 
గుట్కాలతో ధవడలన్నీ పొక్కి పెట్టు 
మానకుంటే రాచపుండై తిరగబెట్టు


ఝలక్ ఝలక్ ఝలక్ ఝలక్ జాం 
ఝలక్ ఝలక్ ఝలక్ ఝలక్ జాం 


ఏళ్ళుగా వ్యసనముంది .,మారాలని నాకు ఉంది 
మార్గమే చూపు గురువా ..
వ్యాదులంటే వణుకూ ఉంది ..వస్తాయని భయము ఉంది 
చెప్పవా చిన్ని సలహా ..
మనసుంటే మార్గముంది వెర్రి నాన్నా 
ప్రయత్నిస్తే ఫలితముండు బుజ్జి కన్నా ..
కౌన్సిలింగ్ తో కనువిప్పు కలుగురన్నా 
వైద్యం తో నీ వ్యాధులు తొలగురన్నా..


వ్యసనాలు అన్ని మరిచి 
ఒళ్ళు వంచి పని చేస్తే 


సంపాదన పెరగవచ్చురా 


ధనమంతా పొదుపు చేసి , పిల్లల్ని పోషించి 
విద్యా బుద్ధులు నేర్పవచ్చురా 
తందనా తందననా  తందనా తందననా 

ఇక నే చెప్తా సార్...
వ్యసనాలకి బానిసలై తిరిగే టోళ్ళు..
వ్యర్ధ పదార్థాలై కుల్లిపోతరు..
సన్మార్గం లో నడిచే సక్కనోల్లు ..
సంఘంలో గొప్ప వాళ్ళుగా మిగిలిపోతరు..
*****************************
written by ME,
at 8pm 24.12.2010





No comments:

Post a Comment