Thursday, 17 May 2012

‘టక్కరిదొంగ’ చిత్రంలో ‘నలుగురికీ నచ్చినది’ పాటకు పేరడీ

పల్లవి :
నలుగురికీ నచ్చినది ఆర్టీసీకే నచ్చదురో!
నరులెవరూ నడవనిది ఆ రూట్లో అది నడుచునురో!
బస్సని కొందరు అన్నా... అది మాత్రం కాదు నిజం
తుస్సున గాలే పోతే తెలిసొచ్చును అసలు నిజం...
బస్సు స్టాపులు ఒకవైపు బస్సులు ఒకవైపు
టైమ్‌ టేబులంటూ లేదు ప్రతి బస్సు యమలేటు నలుగురికీ

చ షార్ట్‌ రూట్‌లో బస్సు నడపడం నథింగ్‌ స్పెషల్‌ 2
చుట్టు తిప్పుతూ సిటీ చూపడం సంథింగ్‌ స్పెషల్‌
ఎంసెట్‌లో ర్యాంకు పొందటం నథింగ్‌ స్పెషల్‌ 2
సిటీ బస్సులో సీటు పొందటం సంథింగ్‌ స్పెషల్‌
చైను లాగితే ట్రైను ఆగడం నథింగ్‌ స్పెషల్‌ 2
స్టాపు వచ్చినా ఆగనిది ఈ బస్సు స్పెషల్‌ నలుగురికీ

- బొడ్డు మహేందర్

No comments:

Post a Comment