Friday, 18 May 2012

ఎండమావులకై .....

దురదృష్టం...
ఇంకా అదే మాట వింటూనే ఉన్నా..
చెవుల్లో సీసం తెచ్చి పోస్తున్నట్లు వేధించినా..!!

దౌర్భాగ్యం..
ఇంకా అదే హేళన  భరిస్తూనే ఉన్నా..
కళ్ళల్లో కాలే చువ్వలు గుచ్చినట్లు బాధించినా..!!

చెప్పిన మాట చెబుతూనే ఉన్నా..
ఓటమి ఎదురైన ప్రతీసారి..
ఐన గాయం మానుతుందిలే అనుకున్నా..
గెలుపుకి చేరువైన ప్రతీసారి..

కానీ..
పుట్టుకతో ఉన్న శని...
పుడమిని వీడే దాకా పోతుందా..??
పుటుక్కుమని పగిలిన యెద అద్దం..
పునర్జన్మలో నీ రూపం చూపెడుతుందా..??

అందుకే...
ఏడుపుతో ఉపశమిస్తున్నా..
ఏకాకిగా బ్రతుకీడుస్తున్నా..
ఏ వైపో తెలియని ఎడారిలో..
ఎండమావులకై  పరుగెడుతున్నా..
*******************
written by ME
at 9:30am 19.5.2012

No comments:

Post a Comment