సాకి:
ఈ గ్యాంగుకి హెడ్ అయినందుకు...
నీకు పిల్ల(GF) ని వెతికే బాధ్యత నాది....
ఓరి ప్రేమార్ది..
నీ తవికలు మెచ్చిన చిన్నది ఎవరది..?
ఎలా ఉంటది..??
పల్లవి:
కొండముచ్చులాగా ఉంటదా...
చెప్పర కన్నా..చెప్పర నాన్నా...
కోతిలాగా తోక ఉంటదా..
చెప్పర కన్నా..చెప్పర నాన్నా...
పర్పులు ..ప్రభాసు టేస్ట్ ఉందా..
తింగరి.. తిక్కల నేచరుందా...??
చెప్పకుంటే ఆమె ఫేసు ఎట్ల సెర్చ్ చేయనురా..
కొండముచ్చులాగా ఉంటదా...చెప్పర కన్నా..చెప్పర నాన్నా..
చరణం :
ఏడున్నర రాగంలో ... ఎంకి పాటలే పాడే వేముల రామక్కా
ఫ్లాప్ సూప్ సాంగులకి ...వెర్రి మొర్రి స్టెప్పు లేసే గుండూ మైసమ్మా
వాటమైన రూపం తోటి.. వణుకు తెచ్చే వర్షానా..
పారాహుషార్ అనిపించే....పాములోల్ల పుష్పానా...
నీ మనసుని గుచ్చుకుంది..మహితా మాయలేడా..?
నీ పర్సు దోచింది..పాకీజా....
సత్యభామ లాంటి పొగరుబోతా..
సక్కుబాయి లాంటి వదరుబోతా...
బాలికా..కాళికా పోలికేనా..???
చెప్పరా..నాయనా..భూత భామినా..??
ఒక్క ముక్క చెప్పు చాలు..ఒలుకుతుంది ప్రేమ పాలు...
కొండముచ్చులాగా ఉంటదా...చెప్పర కన్నా..చెప్పర నాన్నా...
కోతిలాగా తోక ఉంటదా..చెప్పర కన్నా..చెప్పర నాన్నా...
***********************************
written by ME
at 1:15pm 25.5.2012

No comments:
Post a Comment