Monday 5 December 2011

వేసవి సెలవులు

వచ్చేశాయి  వచ్చేశాయి..
వేసవి సెలవులు వచ్చేశాయి..
తెచ్చేశాయి తెచ్చేశాయి ..
ఆట విడుపులను తెచ్చేశాయి...
చదువు సంధ్యలతో అలిసిన మనసులకి..
ఆటా పాటలంటూ ఆహ్లాదాన్ని తెచ్చేశాయి..
పరీక్షలూ  ఫలితాలని కుస్తీ పడిన ..
మా మెదళ్ళకి  , హాయిగా విరామాన్ని ఇచ్చేశాయి..
పల్లెల్లోకి వెళ్లి ప్రకృతిని చూడమని ..
అభిరుచులకు మెరుగులు దిద్దమని..
తోటి వారికి సాయం చేస్తూ ..
ఉత్తమ  పౌరులుగా  ఎదగమని..
చక్కని సమయం ఇచ్చేశాయి ..
చల్లగా మా మనసు దోచేశాయి .....
వచ్చేశాయి  వచ్చేశాయి..

వేసవి సెలవులు వచ్చేశాయి.. *********************************
written by ME
at 9am, 2.4.2011
*********************************
ఈ బాల గీతం వార్త పేపర్ "మొగ్గ " శీర్షిక లో 
11 .4.2011  నాడు ప్రచురితమైనది ..

No comments:

Post a Comment