ఒకరికి ఒక పాన్‌కార్డుకు మించి ఉండటం చట్టవిరుద్ధం.
- ఒకటి కంటే ఎక్కువ ఉంటే సరెండర్ అప్లికేషన్ ద్వారా అదనపు కార్డును వెనక్కి ఇచ్చేయవచ్చు.
- www.incometaxindia.gov.in ద్వారా ఆన్‌లైన్లోనూ పాన్ కార్డు అప్లై చేసుకోవచ్చు.
- పాన్ అప్లికేషన్‌లో పెళ్లయినా కూడా తండ్రిపేరే రాయాలి. ఆదాయపు పన్ను ఫైలింగ్‌లోనూ అంతే.
- మీ పాన్‌కార్డు నంబరు ఎలా ఇస్తారంటే మొదటి మూడక్షరాలు సిరీస్ కోసం, నాలుగో అక్షరం కంపెనీ అయితే ‘సి’ అని, పర్సన్ అయితే ‘పి’ అని... ఇలా ఉంటుంది. ఐదో అక్షరం మీ ఇంటిపేరులోని మొదటి అక్షరం. మిగతావి సీరియల్ నంబర్. చివరి అక్షరం కూడా సిరీస్‌లో భాగమే.
- పాన్ కార్డు కొత్తగా అప్లయి చేసిఉంటే మీది ఏ స్టేటస్‌లో ఉందో తెలుసుకునే అవకాశముంది. గూగుల్‌లో ‘ట్రాక్ యువర్ పాన్ స్టేటస్’ అని టైప్ చేస్తే https://tin.tin.nsdl.com వస్తుంది. ఆ లింకు క్లిక్ చేస్తే మీ స్టేటస్ తెలుసుకోవచ్చు.
- పాన్ కార్డుపై అనుమానాల నివృత్తికి tininfo@nsdl.co.in, utiisl-gsd@mail.utiisl.co.in ఈ రెండు మెయిల్స్‌లో సంప్రదించవచ్చు.
అర్జెంటుగా పాన్ నెంబరు కావాలంటే?
పాన్‌కార్డు ఇంట్లో మరిచిపోయినపుడు మీ పాన్ నంబరు అవసరమైతే ఏం చేస్తారు? ఇంటికి ఫోన్ చేస్తారు. మరి ఇంట్లో ఎవరూ లేకపోతే? అందుకే ఆ అవకాశాన్ని ఇన్‌కంటాక్స్ డిపార్‌టమెంట్ కల్పించింది.
http://incometaxindiaefiling.gov.in వెబ్‌సైట్లోకి వెళ్తే మెనులో ‘సర్వీసెస్’ అని ఆప్షన్ ఉంటుంది. అందులో ‘నో యువర్ పాన్’లో మీ పేరు, పుట్టినరోజు వివరాలు ఫిల్ చేస్తే ఒక్క క్లిక్‌తో మీ పాన్‌కార్డు నంబరు తెలుసుకోవచ్చు.
No comments:
Post a Comment