Tuesday, 31 July 2012

మొలకలండి మొలకలు....


మొలకలండి మొలకలు
పెసర,శనగల మొలకలు
పోషకాల నిల్వలు..
మాంసకృత్తుల చెలిమెలు

ఉప్పు కారాలు చల్లి ,
ఉల్లి నిమ్మరసాలు వేసి,
ఉడుకు ఉడుకువి పెడితే 
ఉవ్విళ్ళూరుతూ తింటారు..
ఊసులెన్నో చెబుతారు..

నోటి తాళాలు తీసి
జిహ్వ చాపాల్యాలు పెంచి
బొజ్జ పోషణ చేస్తారు..
శక్తి శోషణ అంటారు.. 

మొలకలండి మొలకలు
ఇవి సహజ సిద్ధ సరుకులు.
*******************
written by ME
at 10:25pm31.7.2012

No comments:

Post a Comment