కార్డు పోతే ..?
ఏటీఎం ,డెబిట్,క్రెడిట్, ఇంటర్ నేషనల్ ...ఇలా ఏ కార్డు వినియోగిస్తున్నా సరే ,కార్డు పోయింది అంటే ముందుగా చేయాల్సిన ముఖ్యమైన పని - ఆ కార్డుని వెంటనే బ్లాక్ చేయించడం.
కార్డు ఇష్యూ చేసిన బ్యాంకు కస్టమర్ కేర్ , ఫోన్ బ్యాంకింగ్ ద్వారా లేక కార్డు సర్వీస్ ప్రొవైడర్ (వీసా ,మాస్టర్ కార్డ్ ) కాల్ సెంటర్ కి మీరు ఫోన్ చేసి బ్లాక్ చేసుకోవచ్చు.ఈ సమయంలో కార్డు హోల్డర్ పేరు , కార్డు నంబర్ ,మీ గుర్తింపు కోసం పుట్టిన తేదీ , బ్యాంక్ అకౌంట్ నంబర్ వంటి ఇతర వివరాలని అడిగి తెలుసుకుంటారు. సాధారణంగా ఎవరు ఫోన్ చేసి కార్డు నంబర్ , కార్డు హోల్డర్ పేరు చెప్పినా ముందు జాగ్రత్తగా కార్డుని వెంటనే బ్లాక్ చేస్తారు.
ఒక్కోసారి మనం కార్డు ఎక్కడో పెట్టి మర్చిపోతాం.అది కనపడదు.పోయింది కదా అని బ్లాక్ చేస్తే కొత్త కార్డు రావడానికి వారం రోజులపైనే పడుతుంది.అలా అని వెతుకుతూ కూర్చొని ఉంటే, ఎవరైనా కాజేసి వాదేస్తారేమో అని భయం ఉంటుంది. ఇలాంటప్పుడు కార్డుని తాత్కాలికంగా బ్లాక్ చేయవచ్చు. ఇలా కార్డుని తాత్కాలికంగా బ్లాక్ చేసేందుకు ICICI, AXIS వంటి కొన్ని బ్యాంకులు వెసలుబాటుని కల్పిస్తున్నాయి. ఫోన్ చేసిన వెంటనే తాత్కాలికంగానా లేక శాస్వతంగానా అని అడుగుతారు. కార్డు పోయిందని నిర్ధారణకి రానప్పుడు తాత్కాలికంగా బ్లాక్ చేయించుకోవచ్చు.కార్డ్ దొరికిన వెంటనే బ్యాంకుకి ఫోన్ చేసి మీ వివరాలని చెప్పి వెంటనే మళ్ళీ కార్డుని పునరిద్ధరించుకోవచ్చు .
కార్డు ATM మిషన్ లో ఇరుక్కుపోయినపుడు ..
తక్షణం మీ దగ్గరలోని సంబంధిత బ్యాంకు బ్రాంచికి వెళ్లి ఫిర్యాదు చేయాలి. ఇలా ATM లో ఏవైనా కార్డులుంటే, అవి అదే సంస్థకి చెందిన కార్డులు అయితే వెంటనే కార్డు నంబర్ ఆధారంగా అకౌంట్ ఉన్న బ్రాంచికి పంపడం జరుగుతుంది.తర్వాత మీ చిరునామాకి ఈ కార్డుని పంపిస్తారు.దీనికి కనీసం వారం రోజుల సమయం పడుతుంది.ఒక వేల కార్డు పూర్తిగా బ్లాక్ చేయిస్తే మాత్రం కొత్త కార్డు తీసుకోవాల్సిందే. అదే వేరే బ్యాంకు ATM లో కార్డు స్ట్రక్ అయితే మాత్రం ఆ కార్డుని వెంటనే ముక్కలు చేస్తారు.కాబట్టి మీరు ఆ కార్డు మిస్యూజ్ అవ్వకుండా ముందు జాగ్రత్తగా ఆ కార్డుని మీరే బ్లాక్ చేయించి కొత్త కార్డు తీసుకోవాలి. కొత్త కార్డు తీసుకున్నందుకు రూ.200 నుంచి రూ.500 వరకి చార్జీలు వసూలు చేస్తారు.
బీమా రక్షణ ఉంటుంది:
దొంగిలించిన మీ కార్డుతో ఎవరైనా లావాదేవీలు నిర్వహిస్తే ,ఆ మొత్తాన్ని తిరిగి ఇచ్చే విధంగా బ్యాంకులు బీమా రక్షణని కల్పిస్తాయి.కాని దీనికి ముందుగా మీరు చేయాల్సింది - కార్డు పోయిన వెంటనే బ్యాంకుకి ఫిర్యాదు చేయడంతో పాటు కార్డు పోయినట్లు పోలీస్ స్టేషన్ నుండి ఒక F.I.R. పత్రం ఇవ్వాల్సి ఉంటుంది.ఇలా బ్యాంకుకి ఫిర్యాదు చేసిన తర్వాత మీకు సంబంధం లేకుండా జరిగిన లావాదేవీలకి సంబంధించిన మొత్తాన్ని బ్యాంకులే భరిస్తాయి.కాని లావాదేవీలు జరిగిన 30 రోజుల లోపు ఈ వ్యవహారాన్ని బ్యాంకు దృష్టికి తీసుకురావాల్సి ఉంటుంది.ఒకవేళ మీ కార్డుకి బీమా రక్షణ లేకపోతే అడిగి తీసుకోవచ్చు.
pin నంబర్ మర్చిపోయినపుడు..
మీ ATM లేదా డెబిట్,క్రెడిట్ కార్డుల పిన్ నంబర్లు మరిచిపోతే ఈ విషయాన్ని బ్యాంకు దృష్టికి తీసుకు వస్తే మీకు కొత్త pin నంబర్ ని ఇస్తారు.ఇది నేరుగా ఇవ్వరు. అకౌంట్ లో ఉన్న చిరునామాకి పిన్ నంబర్ ని పోస్ట్ చేస్తారు.దీనికి రూ.25 నుంచి రూ.50 వరకు వసూలు చేస్తారు.
ఈ కింది బ్యాంకుల కస్టమర్ కేర్ నంబర్స్ నోట్ చేసుకోండి.
master card : 0008001001087
visa card : 0008001001219
SBI :
1800112211, +91802659990
ICICI BANK:
9849578000
040-23128000, 1800224848
HDFC BANK :
040-66624332, 18004254332
ANDHRA BANK:
040-24756023.
STATE BANK OF HYDERABAD:
1800112211, 08026599990
AXIS BANK :
02225261201, 18604258888.
UCO BANK:
18003450123, 18003453337
0RIENTAL BANK OF COMMERCE:
040-27722424, 18003452424.
ఇవి గుర్తుంచుకోండి:
- కార్డు వివరాలని గోప్యంగా ఉంచండి.
- కార్డు నంబర్ ని రాసి పెట్టుకోవడం మరిచిపోవద్దు.
- కార్డుని బ్లాక్ చేయాలంటే ఆ నంబర్ తప్పనిసరి.
- అలాగే ఫోన్ బ్యాంకింగ్ లేదా టోల్ ఫ్రీ నంబర్లని రాసిపెట్టుకోండి.
- మిస్యూజ్ అవుతుందనే అనుమానం ఉంటె వెంటనే బ్లాక్ చేయించండి.
No comments:
Post a Comment