Saturday, 5 May 2012

నేను నేనుగా ....

ఆడంబరాలు అమెరికా వైనా...
నా ఆత్మ ఎప్పుడూ భారతీయమే.. 
అందర్లో ఒక్కటై పోతున్నా..
నా అస్థిత్వానికై తాపత్రయమే ..

అవసరార్ధం ఆమడ దూరం వచ్చినా..
ఆత్మీయతకై ఎన్నడూ అర్థిస్తూనే ఉన్నా..
కలల లోకంలో కాలిడి వెళుతున్నా..
కన్నప్రేమకి ఎపుడూ కొరతగానే ఉన్నా..

ఆధునికతతో ఎంత పరుగెత్తుతున్నా..మన
ఆచారవ్యవహరాలకి విలువిస్తూనే ఉన్నా..
సాంకేతికతతో పోటీకి దిగుతున్నా..మన 
శాస్త్ర, సంప్రదాయాలని స్మరిస్తూనే ఉన్నా..

అన్యభాషలెన్ని నేర్చుకుంటున్నా..మన
అమ్మ భాషని పలుకుతూనే ఉన్నా..
రుచులెన్ని చవి చూస్తున్నా, మన
అభి"రుచుల్ని" కొనసాగిస్తూనే ఉన్నా..

మొత్తానికి నేను నేనుగా ఉంటున్నా..
మనది కాని లోకంలో ఓ మానుగా ఉంటున్నా..
*****************************
written by ME
at 8pm 5.5.2012

No comments:

Post a Comment