కంటికెపుడూ కనపడకున్నా..
నా కనుపాపల నిండా నువ్వే..
పెదాలెప్పుడూ పలకకున్నా....
వాటికి చిరునవ్వయినావే...
ఎంత సేపుంటావో తెలియకపోయినా..
ఏడేడు జన్మలుగా అల్లుకుపోయావే...
ఎక్కడుంటావో ఎరుగకపోయినా..
ఎద సవ్వడిగా నిల్చిపోయావే..
చెలీ..
స్వప్నమిదని తెలిసినా..నిన్నే శ్వాసిస్తున్నా..
సత్యమై నిల్చే క్షణం కోసం శోధిస్తున్నా..
************************
written by ME
at 6:50am 6.5.2012
No comments:
Post a Comment