Monday, 7 May 2012

అమ్మనవుతున్నాననే.......


పుడుతూ నేర్చిన ఏడుపు..
పుటకంతా నాకో ఆటవిడుపు..
పెళ్ళయ్యాక పండిన ఈ కడుపు..
నా అంతులేని వేదనకి ఓ కంటి తుడుపు..

పొద్దు పొడుపల్లె... లోన,తాను ఎదుగుతుంటే..
పొయ్యి మీద నీరల్లే...పైన నేను ఇగిరి పోతున్నా..
అయినా ఇసుమంతైనా బాధలేదు..
నా రక్తమాంసాలు కరిగిపోతున్నాయన్న చింత లేదు..
పైగా..అంబరాన్నంటే ఆనందం..
అమ్మనవుతున్నాననే అద్భుత  పారవశ్యం..

ఎముకలన్నీ విరిచేస్తున్నట్ట్లుగా నొప్పి పీడిస్తున్నా..
ఎక్కడి ప్రాణాలు అక్కడే నిలువునా తోడేస్తున్నా..
లేదు నాలో ఒకింతైనా జడుపు..
నా చిన్నారి పాపే నాకో బంగారు ముడుపు..
****************************
written by ME
at 3:06am 7.5.2012

No comments:

Post a Comment