Wednesday 4 September 2013

ఈ ప్రశ్నలకి సమాధానమే గురువు.

అంతా అయోమయమే.. అన్నిటా అనుమానమే..
ఏదో తెలుసుకోవాలి, మరేదో కనుగొనాలి..
అది జీవ రహస్యమైనా, సృష్టి రహస్యమైనా..
సమస్య మూలాల్ని అన్వేషించాలి..
సార్ధక జీవితం అనిపించుకోవాలి.. 
ప్రాపంచిక జ్ఞానాన్ని ,  ఆధ్యాత్మిక పరిజ్ఞానాన్ని  
ప్రముఖంగా పదిలపరుచుకోవాలి.
కానీ ఎలా..?
ఎవరు ఉపదేశమిస్తారు..?
ఏ విధంగా కార్యోన్ముఖున్ని చేస్తారు ..?
ఈ ప్రశ్నలకి సమాధానమే గురువు.
నిన్ను జ్ఞానో న్న తుడిగా మార్చే కల్పతరువు. 
నల్లబల్లపై తెల్లని సుద్ద గీతలులాగానే
నీలో అజ్ఞాన అంధకారాన్ని చీలుస్తూ
వెలుగు రేఖలు ప్రసరింపజేసే  ఆదరువు.
****************************
written by BODDU MAHENDER
at 2:39am 5.9.2013

ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు

No comments:

Post a Comment