Monday 13 January 2014

గొబ్బెమ్మలే మురవాలి..

సంక్రాంతి రావాలి 
సంతోషం తేవాలి
మా పల్లె చేలల్లో 
సిరులెన్నో పండాలి.
బసవన్న ఆడాలి
హరిదాసు పాడాలి
పల్లెంతా ఏకమై పతంగాలే ఎగరాలి.
చకినాలు నమలాలి
పాయసాలు పొంగాలి
ముత్యాల ముగ్గుల్లో గొబ్బెమ్మలే మురవాలి..
******************************
written by BODDU MAHENDER
at 7:18am 14.1.2014

No comments:

Post a Comment